చిన్నదీ… అనుకున్నదీ పాయే..?
విశాఖ జిల్లా రాజకీయాల్లో మాజీ మంత్రి దాడి వీరభద్రరావు సీనియర్ నేత. ఆయన ఎన్టీఆర్ కాలంలో బాగా రాణించారు. చంద్రబాబు జమానాలో మాత్రం ఒకసారి శాసనమండలికి నెగ్గి [more]
విశాఖ జిల్లా రాజకీయాల్లో మాజీ మంత్రి దాడి వీరభద్రరావు సీనియర్ నేత. ఆయన ఎన్టీఆర్ కాలంలో బాగా రాణించారు. చంద్రబాబు జమానాలో మాత్రం ఒకసారి శాసనమండలికి నెగ్గి [more]
విశాఖ జిల్లా రాజకీయాల్లో మాజీ మంత్రి దాడి వీరభద్రరావు సీనియర్ నేత. ఆయన ఎన్టీఆర్ కాలంలో బాగా రాణించారు. చంద్రబాబు జమానాలో మాత్రం ఒకసారి శాసనమండలికి నెగ్గి అక్కడ విపక్ష నేతగా ఉన్నారు. బాబు హయాంలో ఆయనకు ఆశించినంతగా గుర్తింపు రాలేదు. ఆయన విశాఖ జిల్లా రాజకీయాల్లో మరో మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడిని ప్రోత్సహించేవారు. సరే దాడి వీరభద్రరావుకి బాబుతో తేడా కొట్టిన తరువాత రాజకీయంగా వేసిన పిల్లిమొగ్గలకు ఇపుడు ఆయన తనయుడు, వారసుడు దాడి రత్నాకర్ కూడా ఇబ్బందులు పడుతున్నారు.
పిలిచి ఇస్తే….?
దాడి వీరభద్రరావు 2014 ఎన్నికలకు ముందు వైసీపీలో చేరితే జగన్ గౌరవించి మరీ ఆయన్ని సమాదరించారు. నాటి ఎన్నికల్లో నేరుగా ఆయన్నే పోటీ చేయమన్నారు. కానీ తనయుడు రత్నాకర్ కి విశాఖ పశ్చిమ టికెట్ ని పెద్దాయన తెచ్చుకున్నారు. ఎన్నికల్లో కొడుకు ఓడిపోయారు. ఆ మరుసటి రోజే ఆయన జగన్ ని తిడుతూ బయటకు వచ్చేశారు. ఇక ఆ తరువాత మళ్ళీ టీడీపీలో చేరడానికి ట్రై చేశారు, అటూ ఇటూ చివరి వరకూ తిరిగి ఇపుడు వైసీపీలో కుదురుకున్నారు. అయితే మళ్ళీ వచ్చిన దాడి వీరభద్రరావుని జగన్ కండువా వేసి పార్టీలోకి తీసుకున్నారు తప్ప ఎన్నికల్లో టికెట్ ఇవ్వలేదు.
చిన్నపదవిట…
ఇక నామినేటెడ్ పదవులైనా తన కుమారుడికి, లేదా తనకు దక్కుతాయని మాజీ మంత్రి దాడి ఆశపడ్డారు. అయితే సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం సింహాచలం దేవస్థానం ట్రస్ట్ బోర్డ్ మెంబర్ గా రత్నాకర్ కి అవకాశం ఇచ్చారు. కానీ అది తనకు చిన్న పోస్ట్ అంటూ రత్నాకర్ వద్దనుకున్నారు. మరో వైపు జీవీ ఎంసీ ఎన్నికల్లో కార్పోరేటర్ గానైనా పోటీ చేసి మేయరో, డిప్యూటీ మేయరో అవుదామనుకుంటే అక్కడ లోకల్ పాలిటిక్స్ వల్ల అన్ని సీట్లూ మహిళలకు రిజర్వ్ అయిపోయాయి. దాంతో ఇపుడు కుమారుడు రత్నాకర్ కి బెర్త్ ఎక్కడా లేక పెద్దాయన వీరభద్రరావు కలవరపడుతున్నారు.
భారీ పదవి కావాలట….
ఇక నామినేటెడ్ పదవులు తీస్తే కనీసం అందులోనైనా భారీ పదవి అంటే ఏదైనా కార్పోరేషన్ చైర్మన్ లాంటిది తన కుమారుడికి ఇవ్వకపోతారా అని దాడి వీరభద్రరావు రాజకీయం చేస్తూ వస్తున్నారు. అయితే లోకల్ బాడీ ఎన్నికల తరువాత నామినేటెడ్ పదవులు ఇస్తామని వైసీపీ పెద్దలు అంటున్నారు. అదీ కూడా పార్టీని గెలిపించిన చోట్ల వారి పనితీరు గుర్తించి ఇస్తామని చెబుతున్నారు. ఇక కరోనా వైరస్ ప్రభావం ఉంది. ఇంకో వైపు లోకల్ బాడీ ఎన్నికలు ఎపుడవుతాయో ఎవరికీ తెలియదు. ఈ చిక్కుముడులు వీడెదెపుడు పెద్ద కుర్చీ దక్కేదెపుడు అని పెద్దాయనతో పాటు ఆయన పుత్ర రత్నం కూడా వగచి వగచి వేచి చూస్తున్నారుట.