దగ్గుబాటి ఫ్యామిలీలో రాజకీయ రచ్చ.. ఇంకా సర్దుకోలేదా..?
ప్రకాశం జిల్లా పరుచూరు నియోజకవర్గానికి చెందిన దగ్గుబాటి వెంకటేశ్వరరావు, ఆయన సతీమణి దగ్గుబాటి పురందేశ్వరి ఇద్దరూ రాజకీయాల్లో ఉన్న విషయం తెలిసిందే. ఒకరు వైసీపీలో ఉన్నట్టుగానే ఉన్నారు [more]
ప్రకాశం జిల్లా పరుచూరు నియోజకవర్గానికి చెందిన దగ్గుబాటి వెంకటేశ్వరరావు, ఆయన సతీమణి దగ్గుబాటి పురందేశ్వరి ఇద్దరూ రాజకీయాల్లో ఉన్న విషయం తెలిసిందే. ఒకరు వైసీపీలో ఉన్నట్టుగానే ఉన్నారు [more]
ప్రకాశం జిల్లా పరుచూరు నియోజకవర్గానికి చెందిన దగ్గుబాటి వెంకటేశ్వరరావు, ఆయన సతీమణి దగ్గుబాటి పురందేశ్వరి ఇద్దరూ రాజకీయాల్లో ఉన్న విషయం తెలిసిందే. ఒకరు వైసీపీలో ఉన్నట్టుగానే ఉన్నారు . కానీ, ఉన్నారో లేదో తెలియదు. ఇక, పురందేశ్వరి మాత్రం బీజేపీలోనే ఉన్నారు. అప్పుడప్పుడు మీడియా ముందుకు వచ్చి వైసీపీపై విమర్శలు కూడా చేస్తున్నారు. అయితే, వెంకటేశ్వరరావు వ్యవహారం మాత్రం ఏం చేస్తున్నారనే విషయంలో ఎలాంటి క్లారిటీ లేకపోవడం గమనార్హం. గత ఏడాది ఎన్నికలకు ముందు ఆయన తన కుమారుడు చెంచురామయ్య రంగంలోకి దింపాలని భావించారు.
ఓటమి తర్వాత…..
కానీ, చెంచురామయ్యకు అమెరికా పౌరసత్వం ఉండడంతో చివరి నిముషం వరకు క్లారిటీ రాకపోవడంతో దగ్గుబాటే స్వయంగా రంగంలోకి దిగారు. అయితే, రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ గాలులు వీచినా.. ఇక్కడ బలమైన నాయకుడుగా పేరు తెచ్చుకున్న దగ్గుబాటి వెంకటేశ్వరరావు మాత్రం ఓటమిపాలయ్యారు. ఆ తర్వాత ఆయన పార్టీలోనే కొనసాగుతున్నా.. ఆయన సతీమణి పురందేశ్వరి వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేయడంతో పార్టీ ఏకంగా దగ్గుబాటిపై ఆగ్రహం వ్యక్తం చేసింది. నువ్వు మన పార్టీలో ఉన్నావు.. నీ సతీమణి.. బీజేపీలో ఉండి.. మన పార్టీపై విమర్శలు చేస్తున్నా.. నువ్వు స్పందించడం లేదు. సో.. ఇది పార్టీ లైన్‌కు విరుద్ధం. కాబట్టి ఇద్దరూ ఏదో ఒక పార్టీలోనే ఉండాలని షరతు పెట్టింది.
వైసీపీలో ఉన్నా….
దీనికి దగ్గుబాటి వెంకటేశ్వరరావు నుంచి ఎలాంటి స్పందనా రాకపోవడంతో ఎన్నికలకు ముందు వరకు ఇక్కడ వైసీపీ ఇంచార్జ్ గా ఉన్న రామనాథం బాబును తిరిగి తీసుకువచ్చి ఇంచార్జ్ పోస్టు ఇచ్చారు. అంతేకాకుండా ఆయనకు ప్రకాశం డీసీఎస్ఎంఎస్ చైర్మన్ పదవి కూడా ఇచ్చారు. దీంతో దగ్గుబాటి వెంకటేశ్వరరావు ఆటోమేటిక్‌గానే మైనస్ అయ్యారు. అయితే, ఆయన పార్టీకేమీ రాజీనామా చేయలేదు. అలాగని పార్టీ తరఫున ఎక్కడా వాయిస్ వినిపించడం లేదు. ప్రస్తుతం లోకల్‌గా కూడా లేరని, హైదరాబాద్‌లో ఉన్నారని అంటున్నారు. లాక్‌డౌన నేపథ్యంలో దగ్గుబాటి దంపతులు బిర్యానీ చేసిన వీడియో కూడా వైరల్ అయ్యింది.
ఇద్దరూ మౌనంగానే…..
ఇక రాజకీయంగా చూస్తే ఏపీలో ఇటీవల బీజేపీ వర్సెస్ వైసీపీ మాటల యుద్ధం సాగింది. దీనిలో వైసీపీ రాజ్యసభ సభ్యుడు సాయిరెడ్డి.. బీజేపీ నాయకురాలు, దగ్గుబాటి సతీమణి పురందేశ్వరిపైనా వ్యాఖ్యలు చేశారు. గత ఏడాది ఎన్నికల సమయంలో బీజేపీ కేంద్ర శాఖ రాష్ట్రానికి ఎన్నికల నిధులు ఇస్తే.. వాడుకున్నారంటూ.. తీవ్ర ఆరోపణలు చేశారు. అయినా కూడా ఆమె ఎక్కడా స్పందించలేదు. ఇక వైసీపీలో ఉన్నారో లేదో కూడా తెలియని దగ్గుబాటి వెంకటేశ్వరరావు మౌనమునిగానే ఉన్నారు. ఈ పరిణామాలు గమనిస్తున్న వారు. ఇద్దరు దంపతులు వ్యూహాత్మకంగా మౌనం వహిస్తున్నారా? భవిష్యత్తులో ఏం చేయనున్నారు? అనే సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. దగ్గుబాటి వెంకటేశ్వరరావుకు తన సీన్ అర్థమైనా పురందేశ్వరి మాత్రం ఏదో ఒక పదవి రాకపోదా ? అన్న ఆశతోనే ఉన్నట్టు కనపడుతోంది.