తండ్రి లేక… తనయుడు వల్ల అవుతుందా?
బీహార్ ఎన్నికలకు ముందు రామ్ విలాస్ పాశ్వాన్ మరణం ఆ పార్టీ విజయావకాశాలపై తీవ్ర ప్రభావం చూపనుంది. తండ్రి అండ చూసుకుని ఆయన కుమారుడు తీసుకున్న రాజకీయ [more]
బీహార్ ఎన్నికలకు ముందు రామ్ విలాస్ పాశ్వాన్ మరణం ఆ పార్టీ విజయావకాశాలపై తీవ్ర ప్రభావం చూపనుంది. తండ్రి అండ చూసుకుని ఆయన కుమారుడు తీసుకున్న రాజకీయ [more]
బీహార్ ఎన్నికలకు ముందు రామ్ విలాస్ పాశ్వాన్ మరణం ఆ పార్టీ విజయావకాశాలపై తీవ్ర ప్రభావం చూపనుంది. తండ్రి అండ చూసుకుని ఆయన కుమారుడు తీసుకున్న రాజకీయ నిర్ణయం ఇబ్బందికరంగా మారనుంది. రామ్ విలాస్ పాశ్వాన్ ఒంటిచేత్తో పార్టీని నడిపించారు. లోక్ జనశక్తి పార్టీని స్థాపించిన ఆయన ఇటు బీహార్ లోనూ, అటు జాతీయ స్థాయిలోనూ ఎదగడానికి తోడ్పడిందనే చెప్పాలి.
దళిత నేతగా. …
రామ్ విలాస్ పాశ్వాన్ దళిత నేతగా జాతీయ స్థాయిలో గుర్తింపు పొందరు. ఆయన ఎన్డీఏ ఇటు యూపీఏలకు మంచి మిత్రుడిగా వ్యవహరించారు. దళితుల సమస్యలపై ఆయన ఏనాడు రాజీపడలేదు. మంత్రి పదవిలో ఉన్నా అనేక అంశాలపై కేంద్ర ప్రభుత్వంతో పోరాడిన చరిత్ర రామ్ విలాస్ పాశ్వాన్ ది. అందుకే లోక్ జనశక్తి పార్టీ అంటే ఎవరికీ తెలియదు. అది రామ్ విలాస్ పాశ్వాన్ పార్టీగానే ప్రజల్లో గుర్తింపు పొందింది.
ఒంటరిగా పోటీ…..
కానీ బీహార్ ఎన్నికల సమయంలో రామ్ విలాస్ పాశ్వాన్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన కుమారుడు చిరాగ్ పాశ్వాన్ ఎన్నికల సమయంలో కీలక నుంచి తీసుకున్నారు. ఎన్డీఏ నుంచి బయటకు వచ్చారు. లోక్ జనశక్తి పార్టీ ఒంటరిగా పోటీ చేస్తుందని చిరాగ్ పాశ్వాన్ ప్రకటించారు. అయితే ఇప్పుడు రామ్ విలాస్ పాశ్వాన్ మృతితో ఒంటరిగా పోటీ చేసి పార్టీని చిరాగ్ పాశ్వాన్ విజయపథాన నడిపించగలరా? అన్న అనుమానాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి.
ఆయన పార్టీగానే…..
దాదాపు ఐదు దశబ్దాలుగా రామ్ విలాస్ పాశ్వాన్ బీహారీలకు దళిత నేతగా సుపరిచితులు. రామ్ విలాస్ పాశ్వాన్ తన కుమారుడు చిరాగ్ పాశ్వాన్ ను పార్టీ అధ్యక్షుడిగా చేశారు. ఇప్పటికే కుటుంబ పార్టీగా ముద్ర పడింది. ఇప్పటికే అభ్యర్థులను కూడా ఎంపిక చేశారు. కానీ తండ్రికి ఉన్నంత ఇమేజ్ చిరాగ్ పాశ్వాన్ కు ఇసుమంతైనా లేదనే చెప్పాలి. రామ్ విలాస్ పాశ్వాన్ జనంలో తిరిగే నేత. చిరాగ్ మాత్రం జనాలకు దూరంగా ఉండే నేతగా ముద్రపడ్డారు. అయితే సెంటిమెంట్ ఏమైనా పనిచేస్తుందేమో చూడాలి. అంతే తప్ప చిరాగ్ పాశ్వాన్ ఒంటరిగా పార్టీని ముందుకు నడిపించడం కష్టమే.