భయం లేదు.. బెంగ లేదే?
మహారాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు వివాదాస్పదమవుతున్నాయి. రాష్ట్రమంతటా కరోనా మహమ్మారి విజృంభిస్తున్నా ప్రభుత్వం మాత్రం మినహాయింపులకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చిందంటున్నారు. దేశంలో తొలి నుంచి మహారాష్ట్ర అత్యధిక [more]
మహారాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు వివాదాస్పదమవుతున్నాయి. రాష్ట్రమంతటా కరోనా మహమ్మారి విజృంభిస్తున్నా ప్రభుత్వం మాత్రం మినహాయింపులకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చిందంటున్నారు. దేశంలో తొలి నుంచి మహారాష్ట్ర అత్యధిక [more]
మహారాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు వివాదాస్పదమవుతున్నాయి. రాష్ట్రమంతటా కరోనా మహమ్మారి విజృంభిస్తున్నా ప్రభుత్వం మాత్రం మినహాయింపులకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చిందంటున్నారు. దేశంలో తొలి నుంచి మహారాష్ట్ర అత్యధిక కేసులతో ముందుంది. ప్రధానంగా మర్కజ్ మసీదు ప్రార్థనల నుంచి వచ్చిన వారి నుంచి, వలస కార్మికుల నుంచి ఎక్కువగా ఈ వ్యాధి సోకినట్లు అధికారులు గుర్తించారు.
దేశంలో నమోదవుతున్న కేసుల్లో…..
దేశంలో కరోనా పాజిటివ్ కేసులు ఐదు లక్షలు దాటితే ఒక్క మహారాష్ట్రలో 1,65 లక్షల కేసులు నమోదయ్యాయి. దేశంలో మరణాల సంఖ్య 15 వేలు వరకూ ఉంటే మహారాష్ట్రంలో ఏడు వేలు ఉన్నాయి. అంటే దేశంలో నమోదయిన కేసుల్లో ఎక్కువ శాతం మహారాష్ట్రలోనే ఉంటుండం విశేషం. ఈ పరిస్థితుల్లో లాక్ డౌన్ ను ఈ నెల 30 వతేదీ తర్వాత కూడా కంటిన్యూ చేయనున్నట్లు ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రే ప్రకటించారు.
సడలింపుల విషయంలో…..
కానీ కానీ సండలింపుల విషయంలో మాత్రం మహారాష్ట్ర ప్రభుత్వం ముందుందనే చెప్పాలి. గత ఆదివారం నుంచి సెలూర్లు, బ్యూటీ పార్లర్లకు మహారాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఇది వివాదాస్పదంగా మారింది. మహారాష్ట్రలో రాజకీయ నేతల నుంచి పోలీసుల వరకూ కరోనా వైరస్ బారిన పడుతున్నారు. ఈనేపథ్యంలో కరోనా వ్యాప్తి ఎక్కువగా చెందే సెలూన్లు, బ్యూటీ పార్లర్లకు అనుమతి ఇవ్వడం ఏంటని విపక్షాలు ప్రశ్నిస్తున్నాయి.
ముంబయి నగరంలోనే…..
అయితే ఉద్ధవ్ థాక్రే మాత్రం లాక్ డౌన్ పొడిగించినా ఒకదాని వెంట సండలింపులుంటాయని చెబుతున్నారు. ఇక ముంబయి నగరం భయపెడుతోంది. ముంబయి నగరంలోనే దాదాపు ఎనభై వేలు కేసులు దాకా నమోదయ్యాయి. వాణిజ్య రాజధాని ముంబయి కరోనాతో వణుకుతుండటం, మహారాష్ట్ర ప్రభుత్వం వరస మినహాయింపులు ఇవ్వడంపై సర్వత్రా విమర్శలు విన్పిస్తున్నాయి. మరి మహారాష్ట్ర కోరనా నుంచి ఎలా బయటపడుతుందో చూడాలి.