పెద్దాయన మరో ప్రయోగం…??
మాజీ ప్రధాని దేవెగౌడ కర్ణాటకలో మధ్యంతర ఎన్నికలు వస్తాయని గట్టిగా నమ్మకంగా ఉన్నట్లుంది. సంకీర్ణ సర్కార్ కూలిపోవడం ఖాయమని ఆయన విశ్వసిస్తున్నారు. అతి తక్కువ స్థానాలతో జనతాదళ్ [more]
మాజీ ప్రధాని దేవెగౌడ కర్ణాటకలో మధ్యంతర ఎన్నికలు వస్తాయని గట్టిగా నమ్మకంగా ఉన్నట్లుంది. సంకీర్ణ సర్కార్ కూలిపోవడం ఖాయమని ఆయన విశ్వసిస్తున్నారు. అతి తక్కువ స్థానాలతో జనతాదళ్ [more]
మాజీ ప్రధాని దేవెగౌడ కర్ణాటకలో మధ్యంతర ఎన్నికలు వస్తాయని గట్టిగా నమ్మకంగా ఉన్నట్లుంది. సంకీర్ణ సర్కార్ కూలిపోవడం ఖాయమని ఆయన విశ్వసిస్తున్నారు. అతి తక్కువ స్థానాలతో జనతాదళ్ ఎస్ ముఖ్యమంత్రి పదవిని చేజిక్కించుకున్నప్పటికీ పాలన సక్రమంగా జరగడం లేదన్నది తండ్రితనయుడు దేవెగౌడ, కుమారస్వామిలు భావిస్తున్నారు. కాంగ్రెస్ నేతలే ఎక్కువగా చికాకులు తెప్పిస్తున్నారని అందువల్లే మధ్యంతర ఎన్నికలు వస్తాయని దేవెగౌడ నమ్ముతున్నారు.
చికాకు తెప్పిస్తుండటంతో….
కర్ణాటకలో జరిగిన ఎన్నికల్లో జనతాదళ్ ఎస్ కు 39 శాసనసభ స్థానాలు వచ్చినప్పిటికీ కాంగ్రెస్ కు 80కి పైగా స్థానాలు దక్కినప్పటికీ ముఖ్యమంత్రి పదవిని తన కుమారుడికి దక్కడంలో దేవెగౌడ చురుకైన పాత్ర పోషించారు. అయితే ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి కుమారస్వామికి కాంగ్రెస్ నేతలు సహకరించడం లేదు. ముఖ్యంగా హస్తిన స్థాయిలో తాను సర్దుబాటు చేసుకువస్తున్నప్పటికీ కర్ణాటక కాంగ్రెస్ నేతలను మాత్రం కట్టడి చేయలేకపోతున్నారు.
కాంగ్రెస్ నేతలు సహకరించలేదని….
దీంతో పాటు ఇటీవల జరిగిన లోక్ సభ ఎన్నికల్లో దారుణ ఓటమిని దేవెగౌడ జీర్ణించుకో లేకపోతున్నారు. తుముకూరులో తాను, మాండ్యలో మనవడు నిఖిల్ గౌడ ఓటమికి ప్రధాన కారణం కాంగ్రెస్ నేతల వైఖరే కారణమని దేవెగౌడ భావిస్తున్నారు. ప్రజలు కూడా సంకీర్ణ సర్కార్ పట్ల విసుగు చెంది ఉన్నారని లోక్ సభ ఎన్నికల ఫలితాలతో స్పష్టమయింది. జనతాదళ్ ఎస్ కు పట్టున్న ప్రాంతంలో కూడా ఓటమి పాలు కావడంతో ఆయన పార్టీ పటిష్టతకు శ్రీకారం చుట్టారు.
86 ఏళ్ల వయసులో…..
కేంద్రంలో మరోసారి బీజేపీ ప్రభుత్వం రావడం, కాంగ్రెస్ కు దేశవ్యాప్తంగా ఎదురుగాలి వీయడంతో ఆ పార్టీతో చెలిమి ప్రమాదకరమని దేవెగౌడ గ్రహించినట్లున్నారు. జనతాదళ్ ఎస్ సంకీర్ణ సర్కార్ నుంచి వైదొలిగే అవకాశాలు కూడా కన్పిస్తున్నాయి. అందుకే దేవెగౌడ వచ్చే నెల ఆగస్టు నెలలో పాదయాత్ర చేపట్టనున్నారని తెలుస్తోంది. ఆగస్టు 20వ తేదీ నుంచి దేవెగౌడ కర్ణాటక వ్యాప్తంగా పాదయాత్ర చేస్తుండటం మధ్యంతర ఎన్నికల సంకేతాలని కాంగ్రెస్ నేతలు సయితం అనుమానిస్తున్నారు. అయితే పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయడం కోసమే తాను పాదయాత్ర చేస్తున్నట్లు పెద్దాయన చెబుతున్నా… దానిని సొంత పార్టీ నేతలతో సహా ఎవరూ నమ్మడం లేదు. 86 ఏళ్ల వయసులో దేవెగౌడ చేయనున్న పాదయాత్ర పార్టీని ఏ మేరకు బలోపేతం చేస్తుందో చూడాలి.
- Tags
- amith shah
- b.s. yadurppa
- bharathiya janatha party
- devegouda
- indian national congress
- janathadal s
- karnataka
- kumara swamy
- narendra modi
- rahulgandhi
- sidharamaiah
- ఠమితౠషా
- à°à°°à±à°£à°¾à°à°
- à°à±à°®à°¾à°°à°¸à±à°µà°¾à°®à°¿
- à°à°¨à°¤à°¾à°¦à°³à± à°à°¸à±
- à°¦à±à°µà±à°à±à°¡
- నరà±à°à°¦à±à°° à°®à±à°¦à±
- బి.à°à°¸à±.యడà±à°¯à±à°°à°ªà±à°ª
- à°à°¾à°°à°¤ à°à°¾à°¤à±à°¯ à°à°¾à°à°à±à°°à±à°¸à±
- à°à°¾à°°à°¤à±à°¯ à°à°¨à°¤à°¾ పారà±à°à±
- రాహà±à°²à± à°à°¾à°à°§à±
- సిదà±à°§à°°à°¾à°®à°¯à±à°¯