ఎప్పటికీ కింగ్ మేకరేనా? సొంతంగా కష్టమేనా?
xఏదైనా రాజకీయం చేయాలన్నా, నిలదొక్కుకోవాలన్నా వ్యూహ రచనలతో పాటు అదృష్టం కూడా కలసి రావాలి. దేవెగౌడ వ్యూహరచనలు దాదాపుగా ఫలిస్తుంటాయి. పార్టిని మూడు సార్లు బలం లేకపోయినా [more]
xఏదైనా రాజకీయం చేయాలన్నా, నిలదొక్కుకోవాలన్నా వ్యూహ రచనలతో పాటు అదృష్టం కూడా కలసి రావాలి. దేవెగౌడ వ్యూహరచనలు దాదాపుగా ఫలిస్తుంటాయి. పార్టిని మూడు సార్లు బలం లేకపోయినా [more]
xఏదైనా రాజకీయం చేయాలన్నా, నిలదొక్కుకోవాలన్నా వ్యూహ రచనలతో పాటు అదృష్టం కూడా కలసి రావాలి. దేవెగౌడ వ్యూహరచనలు దాదాపుగా ఫలిస్తుంటాయి. పార్టిని మూడు సార్లు బలం లేకపోయినా అధికారంలోకి తెచ్చారు దేవెగౌడ. అలాగే తాను కూడా ప్రధానమంత్రి కాగలిగారు. అలాంటి దేవెగౌడ సరైన వ్యూహరచనలు చేయలేకపోతున్నారన్న టాక్ పార్టీలో బలంగా విన్పిస్తుంది. వయసు పెరగడంతో కుటుంబానికే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తుండటం పార్టీ పతనావస్థకు చేరుకోవడానికి కారణాలుగా చెబుతున్నారు.
గత ఎన్నికల్లోనూ….
గత ఎన్నికల్లోనూ దేవెగౌడ వ్యూహం ఫలించిందనే చెప్పాలి. కింగ్ మేకర్ అవుతామని తొలి నుంచి దేవెగౌడ చెబుతున్నారు. అలాగే కాంగ్రెస్ ఇంటికొచ్చి మరీ ముఖ్యమంత్రి పదవి ఆఫర్ చేసింది. ఆయన చెప్పినట్లే జరిగింది. కానీ 14 నెలలపాటు మాత్రమే అధికారంలో కొనసాగారు. ప్రభుత్వం కుప్పకూలిపోవడానికి కాంగ్రెస్ తో పాటు కుమారస్వామి తప్పిదాలు కూడా ఉన్నట్లు దేవెగౌడ గ్రహించినా కుమారుడిని అదుపులో పెట్టలేకపోయారు. ఫలితంగా అధికారానికి దూరం కావాల్సి వచ్చింది.
కలసి పోటీ చేసినా….
దీంతో పాటు లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ తో కలసి పోటీ చేసినా తనతో పాటు మనవడు నిఖిల్ గౌడ ఓటమి దేవెగౌడను మరింత కుంగదీసింది. అందుకే వచ్చే ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తామని దేవెగౌడ ఇప్పటికే ప్రకటించారు. ఈమేరకు కొన్ని జిల్లాలు తిరిగి పార్టీని బలోపేతం చేసే ప్రయత్నం చేశారు. కానీ అనేక చోట్ల అధికారంలో ఉన్నప్పుడు ద్వితీయ శ్రేణి నేతలను పార్టీ పట్టించుకోవడం లేదన్న విమర్శలు ఆయన ఎదుటే విన్పించాయి. కుమారస్వామి, రేవణ్ణలు నేతలను, క్యాడర్ ను పెద్దగా పట్టించుకోరన్న విమర్శలు ఎప్పటి నుంచో ఉన్నాయి. కానీ వాటిని వారు సరిదిద్దుకోలేదు.
మరోసారి కింగ్ మేకర్ అవ్వాలని….
వచ్చే ఎన్నికల నాటికి పార్టీని బలోపేతం చేయాలని కుమారస్వామి, దేవెగౌడలు గట్టిగానే ప్రయత్నిస్తున్నారు. నిజానికి జనతాదళ్ ఎస్ కర్ణాటకలో ఉప ప్రాంతీయ పార్టీగా మిగిలిపోయింది. కొన్ని ప్రాంతాలకే ఎప్పటి నుంచో పార్టీ పరిమితమయినా దేవెగౌడ, కుమారస్వామిలు పట్టించుకోలేదు. దీంతో ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ ను ఎన్నికల వ్యూహకర్తగా నియమించుకున్నారు. వచ్చే ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసి మళ్లీ కింగ్ మేకర్ అవ్వాలన్నదే వారి లక్ష్యంగా కన్పిస్తుంది. ఇప్టటికే బీజేపీ, కాంగ్రెస్ లతో కలసి పనిచేసిన అనుభవం దేవెగౌడ కుటుంబానికి బాగానే వచ్చింది. మరి ఫ్యూచర్ లో ఎవరితో కలుస్తారన్నది సస్పెన్సే అయినా ఒంటరిగా పోటీ చేసి అధికారం దిశగా మరోసారి అడుగులు వేయాలన్నది వారి వ్యూహంగా కన్పిస్తుంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.