అవినాష్ కు అందనివ్వరా?
బెజవాడ వైసీపీలో అంతర్గత చిచ్చు ఆరంభమైందా? రాజకీయ విశ్లేషకులు ఉహించినట్టే.. ఇక్కడ వైసీపీలో అంతర్గత పోరుకు బీజాలు పడ్డాయా ? అంటే.. తాజాగా జరిగిన పరిణామం.. ఔననే [more]
బెజవాడ వైసీపీలో అంతర్గత చిచ్చు ఆరంభమైందా? రాజకీయ విశ్లేషకులు ఉహించినట్టే.. ఇక్కడ వైసీపీలో అంతర్గత పోరుకు బీజాలు పడ్డాయా ? అంటే.. తాజాగా జరిగిన పరిణామం.. ఔననే [more]
బెజవాడ వైసీపీలో అంతర్గత చిచ్చు ఆరంభమైందా? రాజకీయ విశ్లేషకులు ఉహించినట్టే.. ఇక్కడ వైసీపీలో అంతర్గత పోరుకు బీజాలు పడ్డాయా ? అంటే.. తాజాగా జరిగిన పరిణామం.. ఔననే అంటోంది. ఎన్నికల తర్వాత బెజవాడ వైసీపీలో కీలకమైన మార్పులు చోటు చేసుకున్నాయి. బెజవాడ తూర్పు ని యోజకవర్గం నుంచి ఓడిపోయిన బొప్పన భవకుమార్‌కు నగర వైసీపీ ఇంచార్జ్‌గా బాధ్యతలు అప్పగించారు. అదే సమయంలో టీడీపీ తరపున గుడివాడలో పోటీ చేసి ఓడిపోయిన తెలుగు యువత మాజీ అధ్య క్షుడు అవినాష్ దేవినేనిని వైసీపీలోకి తీసుకున్నారు. అదే సమయంలో ఆయనను బెజవాడ తూర్పు ని యోజకవర్గం వైసీపీ ఇంచార్జ్‌గా కూడా నియమించారు.
నగర పర్యటనకు…..
దీంతో తూర్పులో ఓడిపోయిన భవకుమార్ నగర ఇంచార్జ్‌గాను, ఇటీవలే పార్టీలోకి వచ్చిన దేవినేని అవినాష్ తూర్పు నియోజకవర్గం ఇంచార్జ్‌గాను ఉన్నారు. ఇక ఇదే నియోజకవర్గంలో వైసీపీలో మూడో గ్రూప్ కూడా ఉంది. ఎన్నికలకు ముందు వరకు ఇక్కడ పార్టీ ఇన్చార్జ్గా ఉన్న మాజీ ఎమ్మెల్యే యలమంచిలి రవికి కూడా ఒక గ్రూప్ ఉంది. దీంతో తూర్పు నియోజకవర్గంలో తన సత్తా చాటుకునేందుకు పర్యటించాలని దేవినేని నిర్ణయించుకున్నారు. తన బాబాయి, దేవినేని గాంధీ 40వ వర్ధంతిని పురస్కరించుకుని నగర వ్యాప్తంగా కార్యక్రమాలకు రెడీ అయ్యారు. అన్న దానాలు, వస్త్రాల పంపిణీ వంటివి చేపట్టారు.
అవినాష్ కు దూరంగా…
ఈ క్రమంలోనే తూర్పు నియోజకవర్గంలోనూ దీనిని భారీ ఎత్తున చేయాలని నిర్ణయించుకున్నారు. అయితే, ఈ నియోజకవర్గాన్ని వైసీపీ అధినేత జగన్ అవినాష్‌కు అప్పగించినా.. భవకుమార్ మాత్రం ఆశలు వదిలేసుకోలేదు. ఈ క్రమంలో తూర్పులో అవినాష్ పర్యటించి, ఇక్కడ ఆయన హవా చూపిస్తే.. తనకు ఇబ్బందేనని భావించిన భవకుమార్.. తన అనుచరులు, శ్రేణులను కట్టడి చేశారు. అంటే అవినాష్ చేపట్టే కార్యక్రమాలకు వారిని దూరంగా ఉండాలని ఆయన ఆదేశించినట్టు తెలిసింది.
ఫిర్యాుదు చేయాలని….
దీంతో తూర్పు నియోజకవర్గంలో దేవినేని అవినాష్ ఇన్చార్జ్గా ఉన్నా ఆయన వర్గం నేతలు మినహా మిగిలిన రెండు గ్రూపుల నేతలు రాకపోవడంతో పైపైనే కార్యక్రమాన్ని నిర్వహించారు. దీంతో బొప్పన ఆశించిన విధంగా ఇక్కడ అవినాష్ కార్యక్రమం గ్రాండ్ సక్సెస్ కాకుండా ఆయన చేసిన వ్యూహం ఫలించింది. అయితే, దీనిని తీవ్రంగా భావిస్తున్న అవినాష్ .. తాను చేపట్టిన తొలి కార్యక్రమానికి ఇలా సహకారం లేకుండా చేయడంపై ఆయన పార్టీలో ఫిర్యాదు చేయాలని భావిస్తున్నారు. మొత్తంగా చూస్తే.. ఈ పరిణామం.. అప్పుడే నగర వైసీపీలో చిచ్చు పెడుతోందని అంటున్నారు పరిశీలకులు.