పట్టు దొరికినా ఫేట్ మాత్రం?
దేవినేని అవినాష్ కు రాజకీయాలు కలసి రావడం లేదా? అంటే అవుననే అంటున్నారు. దేవినేని నెహ్రూ విజయవాడ రాజకీయాలను శాసించారు. బెజవాడలో దేవినేని నెహ్రూ చెప్పిందే వేదం. [more]
దేవినేని అవినాష్ కు రాజకీయాలు కలసి రావడం లేదా? అంటే అవుననే అంటున్నారు. దేవినేని నెహ్రూ విజయవాడ రాజకీయాలను శాసించారు. బెజవాడలో దేవినేని నెహ్రూ చెప్పిందే వేదం. [more]
దేవినేని అవినాష్ కు రాజకీయాలు కలసి రావడం లేదా? అంటే అవుననే అంటున్నారు. దేవినేని నెహ్రూ విజయవాడ రాజకీయాలను శాసించారు. బెజవాడలో దేవినేని నెహ్రూ చెప్పిందే వేదం. అలాంటి దేవినేని నెహ్రూ తనయుడు అవినాష్ కు పాలిటిక్స్ లో పట్టు చిక్కడం లేదు. పార్టీలు మారుతున్నప్పటికీ రాజకీయ రేఖలు ఆయన చేతిలో తరచూ మారిపోతున్నాయి. ఫలితంగా దేవినేని అవినాష్ కు ఆయన తండ్రి బాటలో నడుద్దామనుకున్నా కుదరడం లేదు.
అరంగేట్రంతోనే……
రాజకీయ అరంగేట్రంతోనే విజయవాడ ఎంపీగా పోటీ చేసి ఓటమిపాలయ్యారు. అప్పుడు కాంగ్రెస్ నుంచి పోటీ చేయడమే ఆయన చేసిన పెద్ద తప్పు. ఆ తర్వాత వైసీపీలోకి వెళ్దామనుకుని అక్కడ వంగవీటి రాధా ఉండటంతో తెలుగుదేశం పార్టీలోకి దేవినేని కుటుంబం జంప్ అయింది. దేవినేని నెహ్రూ మరణం తర్వాత రాజకీయంగా అవినాష్ కు టీడీపీ మంచి అవకాశమే ఇచ్చింది. పార్టీ రాష్ట్ర తెలుగు యువత అధ్యక్షుడిగా చేసింది. దీంతో అవినాష్ రాష్ట్ర స్థాయి నేత అయ్యారు.
వైసీపీలో చేరడంతో…..
ఇక 2019 ఎన్నికల్లో దేవినేని అవినాష్ తూర్పు నియోజకవర్గాన్ని ఆశించారు. అయితే టీడీపీ అధిష్టానం దేవినేని అవినాష్ కు గుడివాడ సీటును కేటాయించింది. అక్కడ బలమైన వైసీపీ నేత కొడాలి నాని ఉండటం, జగన్ గాలి వీయడంతో దేవినేని అవినాష్ ఓటమి పాలయ్యారు. కోట్లు ఖర్చు పెట్టినా గెలవలేకపోవడంతో నెల కూడా టీడీపీలో ఉండలేకపోయారు. తిరిగి వైసీపీ కండువా కప్పేసుకున్నారు. వైసీపీలో తూర్పు నియోజకవర్గం వచ్చే ఎన్నికల్లో ఇస్తామన్న హామీ రావడంతోనే దేవినేని అవినాష్ పార్టీలో చేరారు. పార్టీలో చేరిన వెంటనే దేవినేని అవినాష్ ను తూర్పు నియోజకవర్గ ఇన్ ఛార్జిగా జగన్ నియమించారు.
రాజధాని అంశం…..
ఇంతవరకూ బాగానే ఉన్నా 2024లో జరిగే ఎన్నికల్లో దేవినేని అవినాష్ పరిస్థితి ఏంటన్న చర్చ మొదలయింది. అమరావతి నుంచి రాజధానిని తరలించేందుకు వైసీపీ సర్కార్ సిద్ధమయింది. దీనిపై ప్రధానంగా కృష్ణా, గుంటూరు ప్రాంత ప్రజలు వైసీపీ పట్ల ఒకింత అసహనంతో ఉన్నారు. దీంతో వచ్చే ఎన్నికల్లో ప్రధానంగా విజయవాడ నగరంలో భాగమైన తూర్పు నియోజకవర్గం నుంచి వైసీపీ టిక్కెట్ పై గెలవడం దేవినేని అవినాష్ కు అంత సులువు కాదు. అందుకే రాజధాని అమరావతి అంశంపై దేవినేని అవినాష్ మాట్లాడ లేదు. మొత్తం మీద పార్టీలు మారుతున్నా దేవినేని అవినాష్ ఫేట్ మాత్రం మారడం లేదన్న కామెంట్స్ విజయవాడ పొలిటికల్ సర్కిళ్లలో బాగానే విన్పిస్తున్నాయి.