దేవినేనికి సూపర్ ధమ్కీ ఇచ్చారుగా?
స్థానిక ఎన్నికల పుణ్యమా అని అన్ని పార్టీల్లోనూ నేతల మధ్య మరోసారి అసంతృప్తి సెగలు కక్కుతోంది. ఈ అసంతృప్తికి అధికార, ప్రతిపక్ష పార్టీలనే భేదం కూడా లేకపోవడం [more]
స్థానిక ఎన్నికల పుణ్యమా అని అన్ని పార్టీల్లోనూ నేతల మధ్య మరోసారి అసంతృప్తి సెగలు కక్కుతోంది. ఈ అసంతృప్తికి అధికార, ప్రతిపక్ష పార్టీలనే భేదం కూడా లేకపోవడం [more]
స్థానిక ఎన్నికల పుణ్యమా అని అన్ని పార్టీల్లోనూ నేతల మధ్య మరోసారి అసంతృప్తి సెగలు కక్కుతోంది. ఈ అసంతృప్తికి అధికార, ప్రతిపక్ష పార్టీలనే భేదం కూడా లేకపోవడం గమనార్హం. ఇప్పటి వరకు ప్రధాన ప్రతిపక్షంలో కొనసాగిన అసంతృప్తి ఇప్పుడు అధికార పక్షానికి కూడా చేరిపోవడం గమనార్హం. విషయంలోకి వెళ్తే ఇలాంటి అసంతృప్తే విజయవాడ వైసీపీని కూడా కుంగదీస్తోంది. ముఖ్యంగా రెండు నియోజకవర్గాల్లో ప్రభావం చూపించే స్థాయిలో ఈ అసంతృప్తి ఉండడంతో నాయకులు ఒకింత అలజడి ఫీలవుతు న్నారు. విజయవాడ రాజకీయాల్లో దేవినేని రాజశేఖర్ వర్గానికి ప్రత్యేక పాత్ర ఉంది. నెహ్రూ విజయవాడ నగరం సమీపంలో ఉండే కంకిపాడు నుంచి అనేక సార్లు ఆయన గెలిచి చక్రం తిప్పారు. ఇప్పుడు ఆయన కుమారుడు దేవినేని అవినాష్ కూడా ఇదే రేంజ్లో చక్రం తిప్పాలని ప్రయత్ని స్తున్నారు.
అవినాష్ ప్రతిపాదనలను….
గత ఏడాది జరిగిన ఎన్నికల్లో టీడీపీ తరఫున గుడివాడ నుంచి పోటీ చేసి ఓడిపోయిన దేవినేని అవినాష్ కొన్నాళ్లకే వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. ప్రస్తుతం తూర్పు నియోజకవర్గం ఇంచార్జ్ గా కూడా ఉన్నారు. తాజాగా జరుగుతున్న స్థానిక ఎన్నికల్లో తన వర్గానికి ప్రాధాన్యం ఇచ్చుకునేందుకు ఆయన ప్రయత్నిస్తున్నారు. వాస్తవానికి ఆయన తూర్పు నియోజకవర్గానికి ఇంచార్జ్‌గా ఉన్నప్పటికీ సెంట్రల్ నియోజకవర్గం పరిధిలోకి వచ్చే చాలా వార్డుల్లో దేవినేని వర్గం ప్రభావం ఎక్కువగానే ఉంది. దీంతో ఈ రెండు నియోజకవర్గాల్లోనూ కనిసంలో కనీసం పాతిక మందిని తన వారిని నిలబెట్టాలని అవినాష్ ప్రతిపాదించారు. అయితే దేవినేని అవినాష్ ప్రతిపాదనలను నగర పార్టీ అధ్యక్షుడుగా ఉన్న బొప్పన భవకుమార్ పక్కన పెట్టారు.
నలుగురికే దక్కడంతో….
అంతేకాదు, తన వారికి టికెట్ లు ఇప్పించుకున్నారు. ఇక, మంత్రి వెలంపల్లి శ్రీనివాస్, సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణుల ప్రభావం కూడా భారీ ఎత్తున ఉంది. దీంతో దేవినేని అవినాష్ ఇచ్చిన జాబితాలో కేవలం నలుగురు వ్యక్తులకు మాత్రమే వార్డు కార్పొరేటర్ స్థానాలు దక్కా యి. ఈ పరిణామాలంతో ఒకింత ఇబ్బందికి గురైన అవినాష్ మొత్తానికే ఎన్నికల ప్రక్రియకు దూరంగా ఉండాలని భావించారు. ఇక, నగర అధ్యక్షుడిగా ఉన్న భవ కుమార్ తను పోటీ చేసి ఓడిపోయిన తూర్పులో కీలకంగా మారారు. తన వారికి టికెట్లు ఇప్పించుకున్నారు.
విభేదాలు తీవ్రమవ్వడంతో….
అసలు ఏ ఉద్దేశంతో అయితే దేవినేని అవినాష్ పార్టీలో చేరారో అది నెరవేరలేదు. తన వర్గం నేతలకు న్యాయం జరగలేదు. దీంతో భవకుమార్, అవినాష్ మధ్య విభేదాలు ముదురుతున్నాయని అంటున్నారు పరిశీలకులు. దేవినేని అవినాష్ ప్రతిపాదనలు ఫలించకపోవడంతో ఆయన అనుచరులు కూడా పార్టీ తరఫున ప్రచారానికి ముందుకు రావడం లేదు. ఈ పరిణామాలను తమకు అనుకూలంగా మార్చుకున్న టీడీపీ నాయకుడు, ఎంపీ కేశినేని నాని విజృంభిస్తున్నారు. దీంతో విజయవాడలో అధికార పార్టీ కన్నా కూడా టీడీపీ హవా ఎక్కువగా కనిపిస్తుండడం గమనార్హం.