మంత్రి ఉమా తడబాటు.. ఏం జరుగుతోంది?
మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు. టీడీపీ సీనియర్ నాయకుడిగా గుర్తింపు పొందారు. కృష్ణా జిల్లాలో కీలక చక్రం తిప్పి న ఉమా.. పార్టీలోనూ పట్టు సాధించారు. పార్టీ అధినేత [more]
మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు. టీడీపీ సీనియర్ నాయకుడిగా గుర్తింపు పొందారు. కృష్ణా జిల్లాలో కీలక చక్రం తిప్పి న ఉమా.. పార్టీలోనూ పట్టు సాధించారు. పార్టీ అధినేత [more]
మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు. టీడీపీ సీనియర్ నాయకుడిగా గుర్తింపు పొందారు. కృష్ణా జిల్లాలో కీలక చక్రం తిప్పి న ఉమా.. పార్టీలోనూ పట్టు సాధించారు. పార్టీ అధినేత చంద్రబాబు వద్ద కూడా మంచి మార్కులు సాధించారు. గతంలో నందిగామ నుంచి పోటీ చేసిన ఆయన తర్వాత ఈ నియోజకవర్గం రిజర్వేషన్ చేయడంతో ఆయన మైలవరానికి మారిపోయారు. మైలవరం నుంచి వరుస విజయాలు సాధించారు. గత ఎన్నికల్లో విజయం సాధించిన ఉమాను చంద్రబాబు తన మంత్రివర్గంలోకి తీసుకున్నారు. కీలకమైన నియోజకవర్గంగా టీడీపీకి దీనిని మార్చుకున్నారు. అయితే, రెండోసారి ఆయన విజయం సాధించిన తర్వాత ఇక్కడ కేడర్‌ను పూర్తిగా గాలికి వదిలేశారనే వ్యాఖ్యలు జోరుగా వినిపిస్తున్నాయి.
క్యాడర్ వ్యతిరేకంగా ఉండటంతో…
దీంతో వచ్చే ఎన్నికల్లో మైలవరం నుంచి ఆయన పోటీ చేసినా.. గెలుపు గుర్రం ఎక్కేందుకు పార్టీలోని అంతర్గత రాజకీయాలే అడ్డుగా కనిపిస్తున్నాయి. దీనికి తోడు ఇక్కడ వైసీపీ నుంచి వసంత కృష్ణప్రసాద్ రంగంలోకి దిగుతున్నారు. ఇప్పటికే ఈయనకు ఇక్కడ టికెట్ కన్ఫర్మ్ అయింది. ప్రచారం కూడా హోరెత్తిస్తున్నారు. ప్రధానంగా వసంతకు స్థానికంగా ఉన్న రాజకీయ బలంతో పాటు దేవినేనిపై ఉన్న వ్యతిరేకత కూడా ఇక్కడ ప్రభావం చూపిస్తోంది. దీంతో దేవినేనికి ఇక్కడ గెలుపు అంత ఈజీ కాదనే అభిప్రాయం సర్వత్రా వినిపిస్తోంది. చంద్రబాబు దగ్గర మార్కులు సాధించడం కోసం.. నియోజకవర్గాన్ని పెద్దగా పట్టించుకోలేదని కూడా ఆయనపై వ్యతిరేక ప్రచారం సాగుతోంది.
బలమైన ప్రత్యర్థిగా వసంత…
ఇక, మైలవరం నియోజకవర్గం నుంచి రెండు సార్లు గెలిచినా కూడా ఇక్కడ పార్టీ శ్రేణులకు ఏమీ చేయలేదనే అసంతృప్తి ఉంది. నియోజవకర్గాన్ని తన అనుచరులకు అప్పగించడం, చిన్న చిన్న కాంట్రాక్టులు కూడా సొంత మనుషులకే అప్ప గించడం వంటి కీలక పరిణామాల నేపథ్యంలో పార్టీ కేడర్ పూర్తిగా దేవినేనికి వ్యతిరేకంగా మారుతుంది. ఈ నేపథ్యంలోనే ఇక్కడ వసంతకు ఉన్న ఇమేజ్ కూడా పాజిటివ్‌గా మారుతోంది. దీంతో దేవినేని ఇక్కడ గెలిచే పరిస్థితి కూడా కనిపించడం లేదని అంటున్నారు. వచ్చే ఎన్నికల్లో ఇక్కడ పోటీ చేయడమా? లేక నియోజకవర్గాన్ని మార్చుకోవడమా అనే ఆలోచనలో కూడా ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది.
నియోజకవర్గం మారుతారా..?
వాస్తవానికి దేవినేనికి పార్టీలో మంచి పట్టుంది. అయితే, ఎన్నికల వ్యూహంలో మాత్రం ఆయన ఇప్పుడు వెనుకబడ్డారనే అంటున్నారు. విపక్షంపై విరుచుకుపడడంలోను, జగన్‌పై విమర్శలు చేయడంలోను దేవినేని ముందున్నారు. అయితే, పార్టీలో పట్టు ఉన్నప్పటికీ… క్షేత్రస్థాయిలో మాత్రం పరిస్థితి వ్యతిరేకంగా మారడంతో దేవినేనికి సొంత నియోజకవర్గంలో ఇబ్బందులు తప్పవనే సంకేతాలు వినిపిస్తున్నాయి. మొత్తానికి దేవినేని విషయంలో కొంత మేరకు స్వయంకృత నష్టమే కనిపిస్తోందని అంటున్నారు. మరి ఈ నేపథ్యంలోనే ఆయన వచ్చే ఎన్నికల్లో నియోజకవర్గం కూడా మారిపోతారనే ప్రచారం కూడా జరుగుతోంది. మరి ఎలాంటి వ్యూహంతో వెళ్తారో చూడాలి.