ఈయనపై ఇంత వ్యతిరేకతా?
చేసుకున్నోడికి చేసుకున్నంత… అన్నది సామెత. అధికారంలో ఉన్నప్పుడు విర్రవీగిన ఫలితం ఇప్పుడు అనుభవించాల్సి వస్తుంది. ఆయనే మాజీ మంత్రి దేవినేని ఉమ. ఆయనపై నేతల్లో ఉన్న వ్యతిరేకతను [more]
చేసుకున్నోడికి చేసుకున్నంత… అన్నది సామెత. అధికారంలో ఉన్నప్పుడు విర్రవీగిన ఫలితం ఇప్పుడు అనుభవించాల్సి వస్తుంది. ఆయనే మాజీ మంత్రి దేవినేని ఉమ. ఆయనపై నేతల్లో ఉన్న వ్యతిరేకతను [more]
చేసుకున్నోడికి చేసుకున్నంత… అన్నది సామెత. అధికారంలో ఉన్నప్పుడు విర్రవీగిన ఫలితం ఇప్పుడు అనుభవించాల్సి వస్తుంది. ఆయనే మాజీ మంత్రి దేవినేని ఉమ. ఆయనపై నేతల్లో ఉన్న వ్యతిరేకతను చూసి చంద్రబాబు సయితం ఆశ్చర్యంలో పడ్డారట. అందుకే ఆయనను పార్టీ పదవులకు దూరం పెట్టారని పార్టీలో బలంగా విన్పిస్తుంది. చంద్రబాబు నిజానికి దేవినేని ఉమకు విజయవాడ పార్లమెంటు అధ్యక్ష పదవి ఇవ్వాలనుకున్నారు.
చివరి నిమిషంలో…..
ఈ మేరకు చంద్రబాబు దేవినేని ఉమతో సంప్రదించినట్లు కూడా తెలిసింది. దేవినేని ఉమ సయితం తనకే ఆ పదవి వస్తుందని విశ్వసించారు. కానీ అనూహ్యంగా నెట్టెం రఘురాం పేరు ప్రకటించడంతో దేవినేని ఉమ సయితం అవాక్కయ్యారని తెలిసింది. ఎన్నికల్లో ఓటమి పాలయిన దగ్గర నుంచి దేవినేని ఉమ తన వాయిస్ ను ఎక్కడా తగ్గించలేదు. పార్టీకి అండగా నిలబడ్డారు. ప్రభుత్వ వైఖరిని ఎండగడుతున్నారు. పైగా చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడు కూడా.
నేతలు అభ్యంతరం చెప్పడంతో…..
ఈ నేపథ్యంలో దేవినేని ఉమకు పార్లమెంటరీ అధ్యక్ష పదవి వస్తుందని భావించారు. ఆయన తన ముఖ్య అనుచరులతో కూడా ఈ విషయం చెప్పారు. కానీ చివరి నిమిషంలో దేవినేని ఉమ పేరు మారిపోవడానికి కారణాలపై ఆయన వర్గం ఆరా తీసిందట. చంద్రబాబు దేవినేని ఉమ పేరు ఖరారు చేస్తున్నారని తెలియగానే కృష్ణా జిల్లా టీడీపీ నేతలు చంద్రబాబు వద్ద అసంతృప్తి వ్యక్తం చేశారని తెలిసింది.
అధికారంలో ఉండగా…..
దేవినేని ఉమకు పదవి ఇస్తే తాము పనిచేయలేబోమని ఒకరిద్దరు నేతలు కుండబద్దలు కొట్టారని సమాచారం. దీనికి ప్రధాన కారణం దేవినేని ఉమ మంత్రిగా ఉండగా ఐదేళ్లపాటు పార్టీ నేతలను పురుగులను చూసి చూసేవారట. కనీసం సమస్యల కోసం వెళితే దేవినేని ఉమ స్పందించేవారు కాదట. ఎంపీ కేశినేని నానితో సహా అప్పట్లో అనేక మంది ఎమ్మెల్యేలు దేవినేని ఉమపై అధిష్టానానికి ఫిర్యాదు చేసినా ఫలితం లేదు. దీంతో ఇప్పుడు అధికారం కోల్పోగానే మళ్లీ దేవినేని ఉమపై చంద్రబాబుకు నేరుగా ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. అందువల్లనే ఉమకు పార్టమెంటరీ నియోజకవర్గ పదవి ఇవ్వలేదన్న టాక్ ఉంది.