ఉమా సైలెంటా..? ఉమాతో సైలెంటా ?
కృష్ణాజిల్లాలో కీలక టీడీపీ నాయకుడిగా చక్రం తిప్పిన మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుకు పరిస్థితులు అనుకూలించడం లేదని అంటున్నారు పరిశీలకులు. పార్టీ అధికారంలో ఉండగా.. చక్రం తిప్పిన [more]
కృష్ణాజిల్లాలో కీలక టీడీపీ నాయకుడిగా చక్రం తిప్పిన మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుకు పరిస్థితులు అనుకూలించడం లేదని అంటున్నారు పరిశీలకులు. పార్టీ అధికారంలో ఉండగా.. చక్రం తిప్పిన [more]
కృష్ణాజిల్లాలో కీలక టీడీపీ నాయకుడిగా చక్రం తిప్పిన మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుకు పరిస్థితులు అనుకూలించడం లేదని అంటున్నారు పరిశీలకులు. పార్టీ అధికారంలో ఉండగా.. చక్రం తిప్పిన ఆయన.. తన సామాజికవర్గంతోపాటు దాదాపు అన్ని వర్గాల వారికీ అందనంత ఎత్తుకు ఎదిగిపో యారనే భ్రమల్లో బతికారని అంటున్నారు. ఫలితంగా పార్టీలో ప్రతి ఒక్కరికీ ఆయన శత్రువు అయ్యారు. చంద్రబాబు తనకు కీలక బాధ్యతలు అప్పగించారు (పట్టిసీమ నిర్మాణం, పోలవరం బాధ్యతలు) కనుక ఇక తానే నెంబర్ 2,3,4 అనుకుంటూ నెంబర్ల రాజకీయం చేశారు. దీంతో ఎంపీలు, ఎమ్మెల్యేలను కూడా ఆయన లెక్కచేయలేదు.
ఎందరు సీనియర్లున్నా….
పార్టీలో జిల్లాలో చూస్తే ఎంతో మంది సీనియర్లు ఉన్నా చంద్రబాబు, లోకేష్ ఇద్దరూ దేవినేని ఉమాకే ప్రయారిటీ ఇవ్వడంతో ఆయన ఆడిందే ఆట.. పాడిందే పాటగా రెచ్చిపోయారు. ఇక ఇటు నియోజకవర్గాన్ని కూడా పట్టించుకోలేదు. ఫలితంగానే దేవినేని ఉమా.. గత ఎన్నికల్లో గట్టి పట్టున్న మైలవరంలో పరాజయం పాలయ్యారనే అభిప్రాయం ఉంది. ఇక, పార్టీ ఓటమి తర్వాత దూకుడుగా ముందుకు వెళ్లినా.. ఆయనను ఎవరూ పట్టించుకోలేదు. ఇక, ఆ తర్వాత పార్టీలో పదవులు ఇచ్చినా తొలి జాబితాల్లో దేవినేనికి ఎలాంటి పదవీ దక్కలేదు. ఇక, ఆ తర్వాత మాత్రం కీలక పదవిని దక్కించుకున్నారు. ఇతర పార్టీలతో సమన్వయం చేసే బాధ్యతను ఉమాకు అప్పగించారు చంద్రబాబు.
ఆయన వెంట ఎవరూ…?
దీంతో తన దూకుడును అందరూ యాక్సెప్ట్ చేస్తారని దేవినేని ఉమా భావించారు. కానీ, అదేంటో ఇప్పుడు కూడా ఆయనను ఎవరూ పట్టించుకోవడం లేదు. మీడియా మీటింగులు పెట్టినా.. ఆయన పక్కన కూర్చునేందుకు ఎవరూ ముందుకు రావడం లేదట. దీంతో ఒంటరిగానే దేవినేని ఉమా ప్రెస్ మీట్లు పెట్టుకుంటున్నారు. ఇప్పుడు కృష్ణా టీడీపీలో ఇదే హైలెట్. ఇక, జిల్లా పర్యటనలకు కూడా చోటా నేతలను వెంటేసుకుని తిరుగుతున్నారే తప్ప.. కొంత పేరున్న నాయకులు ఎవరూ దేవినేని ఉమా వెంట ఉండడం లేదు. మరి ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొంటున్న ఉమాకు ఇతర పార్టీలతో టీడీపీని సమన్వయం చేసే బాధ్యతలను అప్పగించడంపై సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది.
ఎవరూ విశ్వసించక…..
పార్టీలో ఉన్నవారితోనే రెండు నిమిషాలు మాట్లాడలేని దేవినేని ఉమా ఇతర పార్టీల నాయకులతో ఎలా సమన్వయం చేసుకుంటారని సీనియర్లు సైతం ప్రశ్నిస్తున్నారు. అంతేకాదు.. తాను చెప్పేది తప్ప ఎదుట వ్యక్తి అభిప్రాయం వినడానికి ఇష్టపడరనే విమర్శలు కూడా ఉన్న దేవినేని ఉమాను ఎవరు మాత్రం విశ్వసిస్తారు ? అనేది కూడా వీరు అడుగుతున్న ప్రశ్న. మొత్తానికి దేవినేని ఉమా పరిస్థితి అడకత్తరెలో పోక మాదిరిగా తయారైందని అంటున్నారు పరిశీలకులు.