ఉమాపై ఇంత వ్యతిరేకతా?
కృష్ణా జిల్లా టీడీపీలో మరో కలవరం చోటు చేసుకుంది. కీలకమైన నియోజకవర్గం మైలవరంలో పార్టీ కేడర్ పట్టు తప్పుతున్న సంకేతాలు వస్తున్నాయి. ఈ నియజకవర్గంలో మాజీ మంత్రి [more]
కృష్ణా జిల్లా టీడీపీలో మరో కలవరం చోటు చేసుకుంది. కీలకమైన నియోజకవర్గం మైలవరంలో పార్టీ కేడర్ పట్టు తప్పుతున్న సంకేతాలు వస్తున్నాయి. ఈ నియజకవర్గంలో మాజీ మంత్రి [more]
కృష్ణా జిల్లా టీడీపీలో మరో కలవరం చోటు చేసుకుంది. కీలకమైన నియోజకవర్గం మైలవరంలో పార్టీ కేడర్ పట్టు తప్పుతున్న సంకేతాలు వస్తున్నాయి. ఈ నియజకవర్గంలో మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు వరుస విజయాలు సాధించారు. 2009, 2014లోనూ ఆయన గెలుపు గుర్రం ఎక్కారు. పార్టీలో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అంతకు ముందు నందిగామ నుంచి పోటీ చేసి జిల్లాలో మంచి వాయిస్ ఉన్న నేతగా ఎదిగిన దేవినేని ఉమామహేశ్వరరావు 2009లో ఆ నియోకవర్గం ఎస్సీలకు రిజర్వ్ కావడంతో మైలవరానికి మారి పోటీ చేయడం బాగా కలిసివచ్చింది. ఇక్కడి కమ్మ సామాజిక వర్గం ఆయనకు కొండంత అండగా నిలిచింది. ఈ క్రమంలోనే 2014లో చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇరిగేషన్ వంటి కీలకమైన శాఖను బాబు.. దేవినేని ఉమామహేశ్వరరావుకే అప్పగించారు.
కక్ష పూరితంగా…..
ఇక, నియోజకవర్గం విషయానికి వస్తే.. ఇక్కడ దేవినేని ఉమామహేశ్వరరావు గట్టి పట్టు సాధించారు. 2009, 2014లో ఆయన గెలుపు గుర్రం ఎక్కేందుకు కేడర్ బలంగా పనిచేసింది. నిత్యం వారికి అందుబాటులో ఉండడం, వారికి పనులు చేసిపెట్టడం వంటి కీలక చర్యల ద్వారావారి మనసులోనూ దేవినేని ఉమామహేశ్వరరావు చోటు సంపాయించుకున్నారు. ఇక, 2014లో మంత్రి అయిన తర్వాత మాత్రం దేవినేని ఉమామహేశ్వరరావులో మార్పులు వచ్చాయి. కేడర్‌ను పూర్తిగా పక్కన పెట్టారు. ముఖ్యంగా ఎన్నికల్లో తన విజయానికి దోహదం చేసిన నాయకులను కూడా పట్టిం చుకున్నది లేదు. 2014 ఎన్నికల్లో జోగి రమేష్‌పై దేవినేని ఉమామహేశ్వరరావు కేవలం 7 వేల ఓట్లతోనే గెలిచారు. ఆ ఎన్నికల్లో తనకు మెజార్టీ రాని గ్రామాల నాయకులను ఆయన సైడ్ చేయడంతో రాజకీయంగా సొంత పార్టీ కేడర్లోనే పెద్ద చిచ్చు రేగింది. ఆ చిచ్చు చివరకు ఈ ఎన్నికల్లో దేవినేని ఉమామహేశ్వరరావును ఓడించే వరకు ఆరలేదు.
క్యాడర్ దూరం అవ్వడంతో….
ముఖ్యంగా 2016, 2017 మధ్య నియోజకవర్గంలో దేవినేని ఉమామహేశ్వరరావుకు వ్యతిరేకంగా టీడీపీ నేతలు కదం తొక్కారు. ఆయనపై చంద్రబాబుకు ఫిర్యాదులు కూడా చేశారు. తమకు కనీసం అందుబాటులో కూడా ఉండడం లేదని పేర్కొన్నారు. తన అనుకున్నవారికి మాత్రమే పనులు చేస్తున్నారని ఫిర్యాదులు చేశారు. అయితే, అప్పట్లో చంద్రబాబు వీటిని లైట్ తీసుకున్నారు. ఫలితంగా ఈ ఏడాది ఎన్నికల సమయంలో కేడర్ పూర్తిగా దేవినేని ఉమామహేశ్వరరావుకి దూరమైంది. దీంతో వైసీపీ నుంచి పోటీ చేసిన వసంత కృష్ణ ప్రసాద్ సునాయాసంగా విజయం సాధించారు. దేవినేని ఫ్యామిలీకి చిరకాల బద్ధ శత్రువు అయిన వసంత ఫ్యామిలీకి చెందిన కృష్ణప్రసాద్ సవాల్ చేసి మరీ దేవినేని ఉమామహేశ్వరరావును ఓడించాడు.
క్యాడర్ కూడా….
పోనీ.. ఓటమి తర్వాత కూడా టీడీపీలో పెద్దగా ప్రక్షాళన జరగడం లేదు. మిగిలిన నియోజకవర్గాల్లో గతంలో గెలిచిన ఎమ్మెల్యేలు పార్టీనేతలకు, పార్టీని గెలిపించిన వారికి కీలకమైన గుర్తింపుతో పాటు పదవులు కూడా ఇప్పించుకున్నారు. కానీ, దేవినేని ఉమామహేశ్వరరావు మాత్రం కేడర్‌ను పట్టించుకోక పోవడం, నియోజకవర్గంలో అందుబాబటులోనూ ఉండకపోవడం మైనస్‌గా మారిపోయింది. నియోజకవర్గంలో ద్వితీయ శ్రేణి కేడర్‌ను ఎదగనీయరన్న పేరు దేవినేని ఉమామహేశ్వరరావుకు ఉంది. ఇక ఇప్పుడు కూడా ఆయన కోటరీకే ప్రయార్టీ ఇవ్వడంతో పార్టీకి చాలా మంది దూరమవుతోన్న పరిస్థితి.
ఓటమి తర్వాత……
ఓడినా నియోజకవర్గంపై దృష్టి సారించని దేవినేని ఉమామహేశ్వరరావు జిల్లా, రాష్ట్ర రాజకీయాలపై కామెంట్లు చేస్తున్నారు. దేవినేని ఉమామహేశ్వరరావు అధికారంలో ఉన్నా… మంత్రిగా ఉన్నా ముందు నియోజకవర్గంపై కాకుండా జిల్లాలో వైసీపీ వాళ్లు ఏం చేస్తున్నారు… సొంత పార్టీల ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారన్న దానిపైనే ఎక్కువ కాన్సంట్రేషన్ చేస్తారన్న అభిప్రాయం సర్వత్రా ఉంది. ఇది నిజం కూడా..! ఇక, ఇప్పుడు కూడా ఇప్పటి వరకు నియోజకవర్గంలో ఓటమికి కారణాలపై సమీక్షించలేదు. దీంతో కేడర్‌లో కీలక వర్గాలు పార్టీకి దూరమయ్యే ప్రభావం ఎక్కువగా కనిపిస్తోందని అంటున్నారు. మరి దేవినేని ఉమామహేశ్వరరావు మైలవరంపై ఎప్పుడు ఫోకస్ పెట్టి ముందు తన ఇల్లు చక్కపెట్టుకుంటారో ? చూడాలి.