ధర్మాన సోదరుల మధ్య పెద్ద గ్యాప్ అందుకేనా?
శ్రీకాకుళం జిల్లాలో బలమైన రాజకీయ కుటుంబంగా ఉన్న ధర్మాన సోదరులు ఇప్పుడు మాట్లాడుకోవడం లేదా ? ఇద్దరూ ఒకే పార్టీలో ఉన్నా.. అంటీ ముట్టనట్టు వ్యవహరిస్తున్నారా ? [more]
శ్రీకాకుళం జిల్లాలో బలమైన రాజకీయ కుటుంబంగా ఉన్న ధర్మాన సోదరులు ఇప్పుడు మాట్లాడుకోవడం లేదా ? ఇద్దరూ ఒకే పార్టీలో ఉన్నా.. అంటీ ముట్టనట్టు వ్యవహరిస్తున్నారా ? [more]
శ్రీకాకుళం జిల్లాలో బలమైన రాజకీయ కుటుంబంగా ఉన్న ధర్మాన సోదరులు ఇప్పుడు మాట్లాడుకోవడం లేదా ? ఇద్దరూ ఒకే పార్టీలో ఉన్నా.. అంటీ ముట్టనట్టు వ్యవహరిస్తున్నారా ? ముఖ్యంగా ధర్మాన ప్రసాదరావు.. ఇటు పార్టీలోను, అటు ప్రభుత్వానికి కూడా కడు దూరం పాటిస్తున్నారా ? అంటే.. ఔననే అంటున్నారు పరిశీలకులు. వాస్తవానికి ఇద్దరు సోదరులు కూడా కలివిడిగా ఉంటారు. వైసీపీలో ఇద్దరూ కలిసే రాజకీయాలు చేశారు. అయితే.. ఇటీవల కాలంగా ధర్మాన ప్రసాదరావు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. శ్రీకాకుళం ఎమ్మెల్యేగా ఉన్నందున ప్రొటొకాల్ ప్రకారం.. ఏదైనా కార్యక్రమాలకు హాజరు కావాల్సి ఉంటే.. ఇలా వచ్చి అలా వెళ్లిపోతున్నారు.
అంటీముట్టనట్లుగానే…?
ఇటీవల పేదలకు ఇళ్ల పంపిణీ కార్యక్రమాలకు కూడా తన నియోజకవర్గంలో ఏదో తూతూ మంత్రంగా వచ్చి వెళ్లిపోయారనే టాక్ ధర్మాన ప్రసాదరావు విషయంలో వినిపిస్తోంది. అదే సమయంలో తను పాల్గొనాల్సిన పార్టీ కార్యక్రమాలకు తన కుమారుడు రామ్ మనోహర్‌ను పంపుతున్నారు. సరే.. వారసుడిని ఎంట్రీ చేస్తున్నారా? అంటే.. ఇంకా ఇప్పుడే కాదనే టాక్ వినిపిస్తోంది. మరి ఇంతగా ధర్మాన ప్రసాదరావు సైలెంట్ అయిపోవడానికి కారణమేంటని ఆరాతీస్తే.. పదవి విషయంలోనే ఆయన మదన పడుతున్నారని అంటున్నారు అనుచరులు. గతంలో వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో మంత్రిగా పనిచేసిన ధర్మాన ప్రసాదరావుకు చాలానే అనుభవం ఉంది. పైగా ఆచితూచి మాట్లాడతారనే పేరు కూడా సంపాయించుకున్నారు.
ఆసక్తి లేదన్నట్లుగానే…?
పదేళ్ల కాంగ్రెస్ పాలనలో ధర్మాన శ్రీకాకుళం జిల్లాలో ఓ రేంజ్లో చక్రం తిప్పారు. నిజంగా మంత్రి పదవిని ఎలా అనుభవించాలి… దాంతో ఎలా శాసించాలి ? ఎలా అభివృద్ధి చేయాలన్న అంశాల్లో ఆయనకు తిరుగులేకుండా పోయింది. ఈ క్రమంలోనే వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత.. తనకు మంత్రి పదవి ఖాయమని అనుకున్నారు. కానీ, అనూహ్యంగా తన అన్న కృష్ణదాస్‌కు పదవి దక్కి.. తనను పక్కన పెట్టడంతో.. అప్పటి నుంచి ధర్మాన ప్రసాదరావు ముభావంగానే ఉంటున్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చి 20 నెలలు అవుతున్నా ధర్మాన అసలు ఏ మాత్రం రాజకీయాలపై ఆసక్తి లేదన్నట్టుగా వ్యవహరిస్తున్నారు.
అయితే కృష్ణదాస్ విషయంలో….
ఇక, త్వరలోనే పార్టీలో మంత్రి పదవుల తీరు మారనుందనేది తెలిసిందే. రెండున్నరేళ్ల తర్వాత మంత్రులను మారుస్తామంటూ.. జగన్ గతంలోనే ప్రకటించారు. ఈ క్రమంలో తనకు పదవి ఖాయమని అనుకున్నారు. అయితే.. కృష్ణదాస్‌ను తొలగించేది లేదనే సంకేతాలు.. జగన్ నుంచి వస్తున్నాయి. పార్టీ కోసం.. ఆయన త్యాగం చేశారని.. వైఎస్ కుటుంబానికి కూడా చాలా సఖ్యతగా ఉన్నారని.. అందుకే కృష్ణదాస్‌ను ఐదేళ్లూ మంత్రిగా కొనసాగిస్తారని సీనియర్లు చెబుతున్నారు. ఇక కొద్ది రోజుల క్రితమే ఆయనకు డిప్యూటీ సీఎంగా కూడా ప్రమోషన్ వచ్చింది.
ఒకే కుటుంబంలో…..
ఇక జిల్లా రాజకీయాల్లో ఆయన లోపాయికారిగా ఉంటారన్న నివేదిక జగన్ వద్ద ఇప్పటికే ఉంది. ఇక జిల్లాలో వైసీపీకి పూర్తి అనుకూలంగా మారుతోన్న ఓ సామాజిక వర్గం నేతలు కూడా ధర్మాన ప్రసాదరావుకు వ్యతిరేకంగా జగన్ దగ్గర చేస్తోన్న లాబీయింగ్ ఫలిస్తున్నట్టే కనిపిస్తోంది. ఇక కృష్ణదాస్‌ను కంటిన్యూ చేస్తే ఒకే కుటుంబానికి చెందిన వారికి రెండు పదవులు దక్కే అవకాశం లేదు. దీంతో ధర్మాన ప్రసాదరావు.. ఇప్పుడు ఫుల్లుగా సైలెంట్ అయ్యారని చెబుతున్నారు పరిశీలకులు.