జూనియర్ ధర్మాన మైనస్ అవుతాడా
శ్రీకాకుళం జిల్లాలో ధర్మాన కుటుంబం గత ముప్పయ్యేళ్ళుగా రాజకీయాల్లో ఉంది. ధర్మాన ప్రసాదరావు ప్రజలకు చేరువగా ఉంటూ వారి అభిమానంతో అనేక సార్లు ఎమ్మెల్యేగా నెగ్గారు. వైఎస్సార్ [more]
శ్రీకాకుళం జిల్లాలో ధర్మాన కుటుంబం గత ముప్పయ్యేళ్ళుగా రాజకీయాల్లో ఉంది. ధర్మాన ప్రసాదరావు ప్రజలకు చేరువగా ఉంటూ వారి అభిమానంతో అనేక సార్లు ఎమ్మెల్యేగా నెగ్గారు. వైఎస్సార్ [more]
శ్రీకాకుళం జిల్లాలో ధర్మాన కుటుంబం గత ముప్పయ్యేళ్ళుగా రాజకీయాల్లో ఉంది. ధర్మాన ప్రసాదరావు ప్రజలకు చేరువగా ఉంటూ వారి అభిమానంతో అనేక సార్లు ఎమ్మెల్యేగా నెగ్గారు. వైఎస్సార్ శిష్యునిగా ఉంటూ రాజకీయంగా మంత్రి పదవులు అధిష్టించారు. కీలకమైన శాఖలు కూడా నిర్వహించి గట్టి నేత అనిపించుకున్నారు. ఇక ఆయన సోదరుడు ధర్మాన కృష్ణదాస్ కూడా 2009 నుంచి ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చారు. ప్రస్తుతం ఆయన జగన్ మంత్రివర్గంలో ముఖ్యమైన శాఖలు చూస్తున్న మంత్రి. శ్రీకాకుళంలో అధికార మార్పిడి కాగానే ధర్మాన కుటుంబానికి అవకాశాలు రావడం పరిపాటిగా మారింది. అయితే ఈ దఫా మాత్రం ప్రసాదరావు సోదరుడు ధర్మాన కృష్ణదాస్ మంత్రి అయ్యాడు.
అందుకే మంత్రి దక్కలేదు….
ఇక ధర్మాన ప్రసాదరావు మంచి వక్త. ఏ విషయమైన చక్కగా వివరించగలరు, అయితే ఆయన వైఎస్ జమానలో మంత్రిగా ఉన్నపుడు శ్రీకాకుళం జిల్లా కన్నెదార భూముల మైనింగ్ వ్యవహారాల్లో ఆరోపణలు ఎదుర్కొన్నారు. దాని వెనక ఆయన కుమారుడు ధర్మాన మనోహర్ నాయుడు ఉన్నారని అంటారు. మొత్తానికి ఆ విషయంలో ధర్మానకు చెడ్డ పేరు వచ్చింది. ఇక ప్రసాదరావు విధేయత మీద కూడా జగన్ కి ఉన్న సందేహాలు కారణంగా మంత్రి పదవి ఇవ్వరాదని నిర్ణయించారు. దాంతో ధర్మాన కృష్ణదాస్ కి దక్కింది. మరి తన పదవికి అడ్డుగా ఉన్న కుమారుడు మనోహర్ ని ప్రసాదరావు ఎంతవరకూ కట్టడి చేస్తున్నారన్నదే ఇక్కడ ప్రశ్న. ధర్మాన గెలిచిన తరువాత కుమారుడిదే మళ్ళీ జిల్లాలో పెత్తనం అయిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
జగన్ కి తెలిస్తే…?
ఇక ధర్మాన మనోహర్ నాయుడు ఇపుడు తండ్రి బదులుగా డిఫ్యాక్టో ఎమ్మెల్యేగా అధికారం చలాయిస్తున్నాడన్న విమర్శలు వస్తున్నాయి. ధర్మాన ప్రసాదరావు ఎమ్మెల్యేగా ఉన్నా కూడా కొడుకే చక్రం తిప్పుతున్నారని అంటున్నారు. ఇక వైఎస్సార్ పించన్లను మనోహర్ అధికారులతో కలసి పంపిణీ చేయడం పెద్ద చర్చగా మారింది. ఆయన ఏ హోదాలో ఇలా చేస్తున్నారని విపక్షం ప్రశ్నిస్తోంది. దీని మీద మాజీ ఎమ్మెల్యే గుండా లక్ష్మీ దేవి జూనియర్ ధర్మాన పై ఘాటుగా విమర్శలు చేస్తున్నారు. అవినీతి కారణంగా గతంలో ధర్మానని ఓడించారని, ఇపుడు మళ్ళీ ఆయన కుమారుడు తీరు మారలేదని ఆమె ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. శ్రీకాకుళంలో అవినీతి రౌడీయిజం చేస్తే సహించేది లేదని ఆమె హెచ్చరిస్తున్నారు. మరి రాజకీయ వారసుడిగా తన కుమారుడిని చూసుకోవాలనుకుంటున్న ధర్మాన ప్రసాదరావు కుమారుడి దూకుడుకు అడ్డుకట్ట వేయాలని పార్టీలో కూడా వినిపిస్తోంది. లేకపోతే రేపటి రోజున ఇబ్బందులో పడతారని, జగన్ ఇలాంటి విషయాలను సహించరని కూడా అంటున్నారు.