ఎందుకంత కోపం…?
టీడీపీలో సీనియర్ నాయకుడు తండ్రి కాలం నుంచి ఇప్పటి వరకు పార్టీలోనే ఉండి.. గుంటూరు జిల్లా పొన్నూరులో చక్రం తిప్పుతున్న నాయకుడు ధూళిపాళ్ల నరేంద్ర కుమార్. ఈ [more]
టీడీపీలో సీనియర్ నాయకుడు తండ్రి కాలం నుంచి ఇప్పటి వరకు పార్టీలోనే ఉండి.. గుంటూరు జిల్లా పొన్నూరులో చక్రం తిప్పుతున్న నాయకుడు ధూళిపాళ్ల నరేంద్ర కుమార్. ఈ [more]
టీడీపీలో సీనియర్ నాయకుడు తండ్రి కాలం నుంచి ఇప్పటి వరకు పార్టీలోనే ఉండి.. గుంటూరు జిల్లా పొన్నూరులో చక్రం తిప్పుతున్న నాయకుడు ధూళిపాళ్ల నరేంద్ర కుమార్. ఈ నియోజకవర్గంలో వరుసగా ఐదు సార్లు ఆయన విజయం సాధించారు. అంతేకాదు, పార్టీ గెలుపు ఓటములతో సంబంధం లేకుండా ధూళిపాళ్ల నరేంద్ర గెలుస్తూనే ఉన్నారు. అయితే, డబుల్ హ్యాట్రిక్ విషయం వచ్చే సరికి మాత్రం కొద్దిగా తడబడ్డారు. ఈ క్రమంలోనే ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఆయన ఓటమి పాలయ్యారు. వాస్తవానికి రాజకీయాల్లో ఉన్నవారికి గెలుపు, ఓటములు సహజమే అయినా.. ధూళిపాళ్ల నరేంద్ర మాత్రం తీవ్రంగా పరిగణించారు.
అన్నింటికీ దూరంగా….
ఇక, ఇప్పుడు బాబు ఆయనను పక్కన పెట్టాడా? లేక బాబునే ఆయన పక్కన పెట్టాడా? అనే చర్చ సాగుతోంది. దీనికి ఏకైక కారణం.. పార్టీ కార్యక్రమాలకు కానీ, పార్టీ నేతలకు కానీ, ఆయన అందుబాటులో లేకుండా పోవడమే. కొన్ని విషయాల్లో సర్దుబాటు చేసుకుంటారని భావించినా.. కూడా ధూళిపాళ్ల నరేంద్ర కేవలం తన సంగం డెయిరీ కార్యక్రమాలకే పరిమితమవుతున్నారు. వాస్తవానికి ఇటీవల ఎన్నికల్లో ఆరోసారి విజయం కోసం కృషి చేశారు. పార్టీ గెలుపు ఓటములతో సంబంధం లేకుండా ఆయన గెలుపు కోసం ప్రయత్నం చేశారు. అయితే, ఆయనను ప్రజలు ఓడించారు. ఈ నేపథ్యంలో తన సొంత వ్యాపారాలకే పరిమితమయ్యారు.
బాబు మీద అసంతృప్తి….
ఇక, పార్టీ తరఫున కూడా ఏ కార్యక్రమం చేపట్టినా.. రావడం లేదు. కార్యకర్తల్లో భరోసా నింపే కార్యక్రమానికి కూడా ఎలాంటి ప్రయత్నం చేయడం లేదు. అయితే, దీనికి ప్రధానంగా చంద్రబాబుపై ధూళిపాళ్ల నరేంద్ర పెంచుకున్న అసంతృప్తి కారణమని అంటున్నారు. ఐదు సార్లు వరసగా గెలిచినా కూడా తనకు ఎలంటి పదవులు ఇవ్వలేదనే అసంతృప్తితో ధూళిపాళ్ల రగిలిపోతున్న విషయం వాస్తవం. ప్రభుత్వం ఐదేళ్ల పాటు అధికారంలో ఉన్నప్పుడు కూడా ధూళిపాళ్ల నరేంద్ర నియోజకవర్గానికే పరమితం అయ్యారు. అప్పటి నుంచి ఆయన బాబు మీద అసంతృప్తితోనే ఉంటున్నారు.
బాబు ఫోన్ చేసినా….
ఐదేళ్ల నుంచి ధూళిపాళ్ల నరేంద్ర ను బాబు పెద్దగా ఎప్పుడూ పట్టించుకోలేదు. దీనికి మరో ప్రధాన కారణం కూడా ఉంది. సంగం డెయిరీ చైర్మన్ పదవిని వదులుకుంటే మంత్రి పదవి ఇస్తానని గతంలో హామీ ఇచ్చినట్టు చెబుతున్నారు. అయితే, దీనిని వదులుకునేందుకు ధూళిపాళ్ల నరేంద్ర ఎక్కడా సిద్ధంగా లేక పోవడంతో చంద్రబాబు ఆయనను పక్కన పెట్టారు. మొత్తంగా ఈ వ్యవహారంతోనే ఇప్పుడు ధూళిపాళ్ల నరేంద్ర పార్టీపై విముఖత వ్యక్తం చేస్తున్నారని అంటున్నారు. ఇటీవల పార్టీ సమన్వయ సమావేశాల కోసం నరేంద్రకు చంద్రబాబే స్వయంగా ఫోన్ చేసినాధూళిపాళ్ల నరేంద్ర స్పందించలేదని పార్టీ వర్గాల్లోనే చర్చ నడుస్తోంది.