Andhra : వీళ్లంతా ఏకమవుతున్నారా? ముంచేస్తారా?
ఏదైతే రాకూడదో అదే జగన్ ప్రభుత్వంలో బయలుదేరింది. ఉద్యోగుల్లో అసంతృప్తి మొదలయింది. లక్షలాది మంది ఉన్న ఉద్యోగులు ప్రభుత్వాన్ని బహిరంగంగా ఏమీ అనలేక లోలోపల అసంతృప్తి, అసహనంతో [more]
ఏదైతే రాకూడదో అదే జగన్ ప్రభుత్వంలో బయలుదేరింది. ఉద్యోగుల్లో అసంతృప్తి మొదలయింది. లక్షలాది మంది ఉన్న ఉద్యోగులు ప్రభుత్వాన్ని బహిరంగంగా ఏమీ అనలేక లోలోపల అసంతృప్తి, అసహనంతో [more]
ఏదైతే రాకూడదో అదే జగన్ ప్రభుత్వంలో బయలుదేరింది. ఉద్యోగుల్లో అసంతృప్తి మొదలయింది. లక్షలాది మంది ఉన్న ఉద్యోగులు ప్రభుత్వాన్ని బహిరంగంగా ఏమీ అనలేక లోలోపల అసంతృప్తి, అసహనంతో రగిలిపోతున్నారు. వారు తమ డిమాండ్లను పక్కన పెట్టిందన్న నిరాశతో ఉన్నారు. రానున్న కాలంలో ఉద్యోగ సంఘాలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే కొన్ని ఉద్యోగ సంఘాలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళం విప్పుతున్నాయి.
ప్రభుత్వాన్ని మార్చేయగల….
ప్రభుత్వ ఉద్యోగులు ప్రభుత్వాన్ని శాసిస్తారంటారు. ముఖ్యంగా ఎన్నికల్లో వీరిది ముఖ్యమైన భూమిక. వీరి మౌత్ టాక్ తోనే ప్రభుత్వంపై పాజిటివ్ గాని నెగిటివ్ గాని వేగంగా ప్రజల్లోకి వెళుతుంది. ప్రభుత్వాన్ని మార్చేయగల సత్తా ఉద్యోగులకు ఉందంటారు. గత ప్రభుత్వంలో చంద్రబాబును ఉద్యోగులు వ్యతిరేకించారు. డీఏ, అలవెన్సులు మాత్రమే కాకుండా ఉద్యోగులపై పనిభారం మోపారని వారు గత ఎన్నికల్లో వైసీపీ వైపు మొగ్గు చూపారు. ఫలితంగా చంద్రబాబు ఓటమికి అనేక కారణాల్లో ఉద్యోగులు కూడా ఒకటయ్యారు.
జీతాలు కూడా….
ఉద్యోగ సంఘాలు ఎక్కువగా బదిలీలు, టీఏ, డీఏ, అలవెన్సులు వంటివి కోరుకుంటాయి. దీంతో పాటు ఆంధ్రప్రదేశ్ లో సీపీఎస్ విధానాన్ని కూడా జగన్ తీసేస్తానని చెప్పారు. ఇది కూడా ప్రధాన అంశంగా మారనుంది. అయితే జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉద్యోగులకు ఖచ్చితమైన సమయంలో జీతాలు అందకపోవడం కూడా వారి అసంతృప్తికి కారణమయింది. కనీసం నెలలో పదో తేదీ కూడా జీతాలు ఇవ్వడం లేదన్న అసహనం వారిలో కన్పిస్తుంది.
కదలిక మొదలయింది….
దీంతో ఉద్యోగ సంఘాల్లో కదలిక మొదలయింది. ప్రధానంగా ఉపాధ్యాయులు, ఎన్జీవోలు తీవ్ర అసంతృప్తిలో ఉన్నారంటున్నారు. సీపీఎస్ ను రద్దు చేయకుంటే జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడతామని కొన్ని సంఘాలు ఇప్పటికే స్పష్టం చేశాయి. ప్రభుత్వ కార్యాలయాల మెయిన్ టెయిన్ బడ్జెట్ కూడా విడుదల కావడం లేదు. దీంతో ఇలాగే కొనసాగితే తమ భవిష్యత్ ప్రయివేటు ఉద్యోగుల కంటే హీనంగా మారే అవకాశముందన్న ఆందోళన వ్కక్తమవుతుంది. ముఖ్యమంత్రి జగన్ ఉద్యోగుల్లో అసంతృప్తి మరింత పెరగక ముందే వారి సమస్యలపై దృష్టి సారించడం బెటరేమో.