డీకే బయట ఉండి ఉంటే?
ఉప ఎన్నికలు ముంచుకొస్తున్నాయి. కర్ణాటక కాంగ్రెస్ పార్టీ డీకే శివకుమార్ కోసం ఆశగా ఎదురు చూస్తుంది. ఎన్నికల వ్యూహకర్తగా, ట్రబుల్ షూటర్ గా డీకే శివకుమార్ కు [more]
ఉప ఎన్నికలు ముంచుకొస్తున్నాయి. కర్ణాటక కాంగ్రెస్ పార్టీ డీకే శివకుమార్ కోసం ఆశగా ఎదురు చూస్తుంది. ఎన్నికల వ్యూహకర్తగా, ట్రబుల్ షూటర్ గా డీకే శివకుమార్ కు [more]
ఉప ఎన్నికలు ముంచుకొస్తున్నాయి. కర్ణాటక కాంగ్రెస్ పార్టీ డీకే శివకుమార్ కోసం ఆశగా ఎదురు చూస్తుంది. ఎన్నికల వ్యూహకర్తగా, ట్రబుల్ షూటర్ గా డీకే శివకుమార్ కు పేరు. ఆయన గతంలో పార్టీని అనేక సంక్షోభాల నుంచి గట్టెక్కించారు. ప్రస్తుతం ఆయన మనీ ల్యాండరింగ్ కేసులో తీహార్ జైలులో ఉన్నారు. కర్ణాటకలో పదిహేను అసెంబ్లీ నియోజకవర్గాల్లో వచ్చే నెలలో ఉప ఎన్నికలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ నెలాఖరుకు నామినేషన్ గడువు కూడా పూర్తవుతుంది. డీకే శివకుమార్ ఉండి ఉంటే పార్టీ అభ్యర్థుల ఎంపికలో కీలక పాత్ర పోషించేవారని సీనియర్ నేతలు సయితం అభిప్రాయపడుతున్నారు.
సంక్షోభ సమయంలో…..
గతంలో బళ్లారి ప్రాంతంలోనూ డీకే శివకుమార్ పార్టీకి విజయం సాధించి పెట్టిన విషయాన్ని ఈ సందర్భంగా కొందరు గుర్తు చేస్తున్నారు. పదిహేను స్థానాల్లో ఎక్కువ మంది కాంగ్రెస్ సిట్టింగ్ శాసనసభ్యులే పార్టీని విడిచి వెళ్లిపోయారు. వారి స్థానాల్లో కొత్తవారిని ఎంపిక చేయడం కాంగ్రెస్ కు కొంత ఇబ్బందిగా మారింది. అప్పటి వరకూ అక్కడ ద్వితీయ శ్రేణి నాయకత్వమే ఉంది. కొత్త తరం నేతలు ఆ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ లో ఎదగలేదు. దీంతో అభ్యర్థుల అన్వేషణలో కాంగ్రెస్ పెద్దలు బిజీగా ఉన్నారు.
ఇతర పార్టీల నేతలకు…..
ఇదే సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇతర పార్టీల నుంచి నేతలను తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంది. అక్కడే గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయి ద్వితీయ స్థానంలో నిలిచిన అభ్యర్థుల జాబితాను రూపొందించింది. వారిని పార్టీలోకి తీసుకొస్తే వారిపై ఉన్న సానుభూతి కూడా పనిచేస్తుందని పార్టీ నాయకత్వం భావిస్తుంది. ఇదే సమయంలో డీకే శివకుమార్ బయట ఉండి ఉంటే వారిని పార్టీలోకి సులువుగా తెచ్చి ఉండేవారని ఒక సీనియర్ నేత వ్యాఖ్యానించారు. ఇప్పుడు ఆ బాధ్యత సిద్ధరామయ్య తనపై పెట్టుకున్నారు.
ధీటైన అభ్యర్థుల కోసం….
కాంగ్రెస్ కేవలం బీజేపీ మాత్రమే కాకుండా జనతాదళ్ ఎస్ ను కూడా టార్గెట్ చేసినట్లు కనపడుతుంది. రెండు పార్టీల్లో ఆ నియోజకవర్గాల్లో ఉన్న అసంతృప్తులకు టిక్కెట్లు ఇస్తే ఎలా ఉంటుందన్న చర్చ పార్టీలో సీరియస్ గానే నడుస్తుంది. ప్రస్తుతం నాలుగు స్థానాల్లో జేడీఎస్, బీజేపీలకు చెందిన అభ్యర్థులను బరిలోకి దించాలని సూత్రప్రాయంగా నిర్ణయించారు. అయితే వీరిని పార్టీలోకి తీసుకురావాల్సి ఉంది. డీకే శివకుమార్ బయట ఉండి ఉంటే ఈ ఆపరేషన్ సక్సెస్ ఫుల్ గా చేసేవారన్న వ్యాఖ్యలు పార్టీలోనే విన్పిస్తున్నాయి. బ్యాడ్ డీకే శివకుమార్ ఇప్పుడు జైలులో ఉండటం కాంగ్రెస్ కు దెబ్బే అని చెప్పక తప్పదు.