కత్తి మీద సామే
రాజ్యసభ ఎన్నికలు అధికార, ప్రతిపక్ష పార్టీలో చిచ్చు రేపే అవకాశముంది. సార్వత్రిక ఎన్నికలకు ఇంకా ఏడాదిన్నర మాత్రమే సమయం ఉండటంతో అన్ని వర్గాలను సంతృప్తి పర్చాల్సి ఉంది. [more]
రాజ్యసభ ఎన్నికలు అధికార, ప్రతిపక్ష పార్టీలో చిచ్చు రేపే అవకాశముంది. సార్వత్రిక ఎన్నికలకు ఇంకా ఏడాదిన్నర మాత్రమే సమయం ఉండటంతో అన్ని వర్గాలను సంతృప్తి పర్చాల్సి ఉంది. [more]
రాజ్యసభ ఎన్నికలు అధికార, ప్రతిపక్ష పార్టీలో చిచ్చు రేపే అవకాశముంది. సార్వత్రిక ఎన్నికలకు ఇంకా ఏడాదిన్నర మాత్రమే సమయం ఉండటంతో అన్ని వర్గాలను సంతృప్తి పర్చాల్సి ఉంది. అలాగే మిత్రులను కూడా దగ్గరకు తీసుకోవాల్సి ఉంది. తమిళనాడులో మొత్తం ఆరు రాజ్యసభ స్థానాలు ఖాళీ కానున్నాయి. వచ్చే ఏప్రిల్ నెలలో రాజ్యసభ ఎన్నికలు జరగనున్నాయి. శాసనసభలో ఉన్న బలాబలాల ప్రకారం అధికార అన్నాడీఎంకే, ప్రతిపక్ష డీఎంకే పార్టీలకు చెరి మూడు స్థానాలు దక్కే అవకాశముంది.
పొత్తులపైనే…..
తమిళనాడులోని అధికార, ప్రతిపక్ష పార్టీలు రెండూ పొత్తులపైనే ఆధారపడి ఉన్నాయి. పొత్తులు లేకుండా వచ్చే సార్వత్రిక ఎన్నికలకు వెళ్లలేని పరిస్థితి. సరైన నాయకత్వం లేకపోవడం కారణం కావచ్చు. లేదంటే కొత్త పార్టీలు దెబ్బతీస్తాయన్న ఆందోళన కావచ్చు. అందుకే తమిళనాడులో అన్నాడీఎంకే, డీఎంకేలు చిన్నా చితకా పార్టీలను కలుపుకుని వెళ్లాల్సి ఉంటుంది. అందుకు కొన్ని సీట్లను త్యాగాలు చేయాల్సి ఉంటుంది. అందుకు సిద్ధమయితేనే ఎన్నికలకు ధైర్యంగా వెళ్లగలుగుతారు.
ఆశావహులు ఎక్కువ…..
అయితే సార్వత్రిక ఎన్నికలకు ముందుగానే రాజ్యసభ ఎన్నికలు వస్తున్నాయి. ఆరేళ్ల పాటు పదవిలో ఉండే అవకాశం ఉండటంతో ఎక్కువ మంది ఆశావహులు రాజ్యసభ పదవి కోసం పోటీ పడుతున్నారు. అధికార అన్నాడీఎంకేలో సీనియర్ నేతలైన మైత్రేయన్, తంబిదురైలు తమకు రాజ్యసభ పదవి ఇవ్వాల్సిందేనంటూ వత్తిడి తెస్తున్నారు. మరోవైపు ఎన్నికల సమయం దగ్గరపడటంతో ముస్లిం అభ్యర్థి పేరును అన్నాడీఎంకే పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఇంకా అనేక మంది పోటీ పడుతుండటం, పన్నీర్, పళనిస్వామిలు తమ వారికే దక్కాలని భావిస్తుండటంతో ఇది పార్టీకి ఇబ్బందిగా మారే అవకాశముంది. మరోవైపు అన్నాడీఎంకే కూటమిలో పార్టీలు కూడా వత్తిడి తెచ్చే అవకాశముంది.
ఎవరికి ఇచ్చినా….
ఇక డీఎంకేలోనూ ఇదే పరిస్థితి కన్పిస్తోంది. ఎన్నికల సంవత్సరం కావడంతో ఆచితూచి రాజ్యసభ పదవులు భర్తీ చేయాలని డీఎంకే అధినేత స్టాలిన్ భావిస్తున్నారు. ఈసారి మూడు పదవులను డీఎంకే తీసుకోవాలని భావిస్తుంది. తిరుచ్చి శివకు మరోసారి రాజ్యసభ పదవిని రెన్యువల్ చేసే అవకాశముంది. డీఎంకే న్యాయవాది ఇళంగో కు ఒకటి ఖరారయిందంటున్నారు. మూడో పదవిని ఈసారి డీఎంకే ముస్లిం సామాజికవర్గానికి ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. మొత్తం మీద సార్వత్రిక ఎన్నికలకు ముందే వచ్చిన రాజ్యసభ ఎన్నికలు అధికార, ప్రతిపక్ష పార్టీలకు సవాల్ గా మారాయని చెప్పొచ్చు.