స్టాలిన్ మరింత స్ట్రాంగ్ గా…?
ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ.. ఇంకా ఎన్నికలకు రెండేళ్లు గడువు ఉన్నప్పటికీ డీఎంకే పార్టీ దూసుకుపోతోంది. తమిళనాడులో ఆధిపత్యం తనదేనని డీఎంకే చాటిచెబుతోంది. డీఎంకే అధినేతగా బాధ్యతలను చేపట్టిన తర్వాత [more]
ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ.. ఇంకా ఎన్నికలకు రెండేళ్లు గడువు ఉన్నప్పటికీ డీఎంకే పార్టీ దూసుకుపోతోంది. తమిళనాడులో ఆధిపత్యం తనదేనని డీఎంకే చాటిచెబుతోంది. డీఎంకే అధినేతగా బాధ్యతలను చేపట్టిన తర్వాత [more]
ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ.. ఇంకా ఎన్నికలకు రెండేళ్లు గడువు ఉన్నప్పటికీ డీఎంకే పార్టీ దూసుకుపోతోంది. తమిళనాడులో ఆధిపత్యం తనదేనని డీఎంకే చాటిచెబుతోంది. డీఎంకే అధినేతగా బాధ్యతలను చేపట్టిన తర్వాత స్టాలిన్ సారథ్యంలో వరస విజయాలు అందుకుంటోంది. దీంతో స్టాలిన్ పై పెద్ద బాధ్యతే పడింది. తాజాగా వేలూరు పార్లమెంటు స్థానాన్ని కూడా డీఎంకే కైవసం చేసుకుంది. డీఎంకే దెబ్బకు అన్నాడీఎంకే తమిళనాడులో దాదాపుగా కుదేలైపోయింది.
అన్నాడీఎంకే బలహీనతను…
తమిళనాడులో ఒకసారి ఒక పార్టీ అధికారంలోకి వస్తే మరొకసారి మరొక పార్టీకి అవకాశమిస్తారు అక్కడి ప్రజలు కానీ జయలలిత సారథ్యంలోని అన్నాడీఎంకే రెండుసార్లు వరసగా అధికారంలోకి వచ్చింది. అయితే జయలలిత మరణం తర్వాత అన్నాడీఎంకే లో నాయకత్వ సమస్య ఏర్పడింది. దీనిని డీఎంకే అధినేత స్టాలిన్ తనకు అనుకూలంగా మలచుకున్నారు. ఇటీవల జరిగిన లోక్ సభ, అసెంబ్లీ ఉప ఎన్నికల్లో డీఎంకే ఘన విజయం సాధించడంతో డీఎంకే శిబిరంలో ఆనందోత్సహాలు వెల్లువెత్తుతున్నాయి.
పూర్తి నమ్మకం….
ఈ ఎన్నికలు స్టాలిన్ కు ఒకరకంగా ప్రయోజనం చేకూర్చాయి. ఆయన నాయకత్వానికి పరీక్షగా మారిన ఈ ఎన్నికల్లో విజయం ఆయనపై శ్రేణుల్లో పూర్తి నమ్మకం ఏర్పడింది. తమిళ ప్రజలు కూడా స్టాలిన్ నాయకత్వాన్ని నమ్ముతున్నారన్నది ఈ ఎన్నికల ఫలితాల ద్వరా వెల్లడయింది. నిజానికి కరుణానిధి మరణం తర్వాత స్టాలిన్ పార్టీని సమర్థవంతంగా నడుపుతారా? లేదా? అన్న అనుమానాలు కూడా తలెత్తాయి.
వచ్చే ఎన్నికలకు….
ఈ ఎన్నికల తర్వాత స్టాలిన్ పై మరింత బాధ్యత పెరిగింది. 2021లో తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో విజయం సాధించడమే స్టాలిన్ ముందున్న లక్ష్యం. అందుకోసం ఇప్పటి నుంచే అభ్యర్థుల ఎంపికలో ఉన్నారు స్టాలిన్. ఈసారి కేవలం కొన్ని పార్టీలతోనే పొత్తు పెట్టుకోవాలన్న నిర్ణయానికి వచ్చారు. అందుకోసం ఇప్పటి నుంచే నియోజకవర్గాల పర్యటనలకు స్టాలిన్ శ్రీకారం చుట్టారు. వచ్చే ఏడాదే అభ్యర్థులను ముందుగానే ప్రకటించి ప్రజల్లోకి పంపాలని స్టాలిన్ భావిస్తున్నారు. మొత్తం మీద స్టాలిన్ మరింత స్ట్రాంగ్ అయినట్లే కన్పిస్తున్నారు.