సత్తా లేకుండా దిగితే పత్తా లేకుండా పోతారు
డీఎంకే అధినేత స్టాలిన్ కు ఈసారి శాసనసభ ఎన్నికలు అగ్ని పరీక్షగానే చెప్పుకోవాలి. వచ్చే ఏడాది జరగనున్న శాసనసభ ఎన్నికల్లో డీఎంకే విజయం సాధించడం అంత తేలిక [more]
డీఎంకే అధినేత స్టాలిన్ కు ఈసారి శాసనసభ ఎన్నికలు అగ్ని పరీక్షగానే చెప్పుకోవాలి. వచ్చే ఏడాది జరగనున్న శాసనసభ ఎన్నికల్లో డీఎంకే విజయం సాధించడం అంత తేలిక [more]
డీఎంకే అధినేత స్టాలిన్ కు ఈసారి శాసనసభ ఎన్నికలు అగ్ని పరీక్షగానే చెప్పుకోవాలి. వచ్చే ఏడాది జరగనున్న శాసనసభ ఎన్నికల్లో డీఎంకే విజయం సాధించడం అంత తేలిక కాదన్నది స్టాలిన్ కు తెలియంది కాదు. ఇప్పటికే పదేళ్ల పాటు అధికారానికి దూరంగా ఉన్న డీఎంకే మరోసారి అపజయాన్ని మూటగట్టుకుంటే పార్టీ మనుగడ కష్టమే. అందుకే ప్రశాంత్ కిషోర్ లాంటి వ్యూహక ర్తలను నియమించుకుని స్టాలిన్ ఈసారి ఎలాగైనా విజయం సాధించాలని పట్టుదలతో ఉన్నారు. ఇప్పటికే ప్రశాంత్ కిషోర్ టీం రంగంలోకి దిగి సర్వేలను ప్రారంభించింది.
అన్ని స్థానాల్లో ఒంటరిగా?
తమిళనాడులలో మొత్తం 234 శాసనసభ స్థానాలున్నాయి. అయితే తాజాగా ప్రశాంత్ కిషోర్ ఈసారి ఒంటరిగా పోటీ చేయడం బెటరని సలహా ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. తమిళనాడులో డీఎంకే కూటమి మొన్నటి పార్లమెంటు ఎన్నికల్లో బలంగా కన్పించింది. ఇప్పుడు కూటమిని కాదని ఒంటరిగా పోటీ చేస్తే గెలుపు ఎంతవరకూ సాధ్యమన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈసారి అభ్యర్థుల ఎంపిక బాధ్యతనంతా స్టాలిన్ ప్రశాంత్ కిషోర్ కే అప్పగించారు. ఆయన టీం ఇప్పటికే అన్ని నియోజకవర్గాల్లో సర్వేలు చేస్తూ అభ్యర్థుల జాబితాను రూపొందించే పనిలో ఉంది.
పీకే టీం సర్వేలతో…..
సీనియర్లను పక్కన పెట్టి జూనియర్లకు ఎక్కువ అవకాశం ఇవ్వాలని ప్రశాంత్ కిషోర్ సలహా ఇచ్చినట్లు తెలిసింది. సీనియర్లకు పార్టీ బాధ్యతలను అప్పగించాలని సూచించారని చెబుతున్నారు. ఇక సంస్థాగతంగా పార్టీని బలోపేతం చేసేందుకు మూడు జిల్లాలకు ఒక కార్యదర్శిని నియమించాలని కూడా ప్రశాంత్ కిషోర్ స్టాలిన్ కు సలహా ఇచ్చారు. దీంతో పాటు తమిళనాడు వ్యాప్త పర్యటనకు కూడా స్టాలిన్ కోసం ప్రశాంత్ కిషోర్ రూట్ మ్యాప్ ను సిద్ధం చేస్తున్నారు. ఇది పాదయాత్ర రూపంలో ఉంటుందా? లేక బస్సుయాత్ర అన్నది తేలాల్సి ఉంది.
కరుణానిధి కూడా….
ఇప్పటి నుంచే జనంలో ఉండాలని ప్రశాంత్ కిషోర్ ఇచ్చిన సూచనతో స్టాలిన్ తమిళనాడు వ్యాప్తంగా యాత్రకు సిద్ధమవుతున్నారు. రజనీకాంత్ పార్టీ ఈ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశముండటంతో ఆ దిశగా కూడా ప్రశాంత్ కిషోర్ వ్యూహాలను రచిస్తున్నట్లు చెబుతున్నారు. అయితే ప్రశాంత్ కిషోర్ ఇచ్చిన ఒంటరి పోటీ విషయంలో మాత్రం స్టాలిన్ ఎటూ తేల్చుకోలేకపోతున్నారు. కరుణానిధి కూడా ఒంటరిగా పోటీ చేసే ధైర్యం చేయలేకపోయారన్న విషయాన్ని ఈ సందర్భంగా కొందరు గుర్తు చేస్తున్నారు. స్టాలిన్ కు ఆ సత్తా లేదని విపక్షాలు సయితం కొట్టి పారేస్తున్నాయి.