మధురైలో ఆయన వ్యూహమేంటి?
తమిళనాడులో ఎన్నికలు దగ్గరపడుతున్నాయి. అన్ని పార్టీలూ ఎన్నికలకు సిద్దమవుతున్నాయి. అన్నాడీఎంకే, డీఎంకేలు ఇప్పటికే అనధికరికంగా కొందరిని అభ్యర్థులుగా ప్రకటించారు. ఇక ప్రతిపక్షంలో ఉన్న డీఎంకే అధినేత స్టాలిన్ [more]
తమిళనాడులో ఎన్నికలు దగ్గరపడుతున్నాయి. అన్ని పార్టీలూ ఎన్నికలకు సిద్దమవుతున్నాయి. అన్నాడీఎంకే, డీఎంకేలు ఇప్పటికే అనధికరికంగా కొందరిని అభ్యర్థులుగా ప్రకటించారు. ఇక ప్రతిపక్షంలో ఉన్న డీఎంకే అధినేత స్టాలిన్ [more]
తమిళనాడులో ఎన్నికలు దగ్గరపడుతున్నాయి. అన్ని పార్టీలూ ఎన్నికలకు సిద్దమవుతున్నాయి. అన్నాడీఎంకే, డీఎంకేలు ఇప్పటికే అనధికరికంగా కొందరిని అభ్యర్థులుగా ప్రకటించారు. ఇక ప్రతిపక్షంలో ఉన్న డీఎంకే అధినేత స్టాలిన్ ఈసారి ఎలాగైనా అధికారంలోకి రావాలని గట్టి పట్టుదలతో ఉన్నారు. పార్టీని సమాయత్తం చేసేందుకు వీడియోకాన్ఫరెన్స్ ల ద్వారా ప్రయత్నిస్తున్నారు. మరోవైపు కూటమిలోని పార్టీలకు సీట్ల సర్దుబాటు చేసే పనిలో ఉన్నారు. అయితే స్టాలిన్ కు ఇబ్బందిగా మారింది మధురై ప్రాంతమే.
ఆళగిరి వల్లనే….
మధురై ప్రాంతంలో డీఎంకే కు పట్టు ఉంది. అది స్టాలిన్ సోదరుడు ఆళగిరి వల్లనే. ఆళగిరి సొంత బలంతో డీఎంకేకు గతంలో సీట్లు సాధించిపెట్టారు. ఇప్పటికీ డీఎంకే, అన్నాడీఎంకేల కంటే మధురై ప్రాంతంలో ఆళగిరికే ఎక్కువ బలం ఉంది. ఇది గమనించే అధికార అన్నాడీఎంకే మధురై రాష్ట్ర రెండో రాజధానిని చేయాలన్న డిమాండ్ పెట్టింది. ప్రధానంగా మంత్రులే ఈ నినాదాన్ని ఎత్తుకోవడానికి కారణం రానున్న ఎన్నికల్లో లబ్దిపొందేందేకే మధురై, తిరుచ్చి రెండో రాజధానులు చేయాలని డిమాండ్ చేశారు. దీనిపై పళనిస్వామి స్పందించకపోవడానికి కూడా కారణం ఎన్నికలే.
డీఎంకే నేతలున్నా…..
ఇక స్టాలిన్ మధురైై ప్రాంతంలో తమకు గట్టి దెబ్బ తగిలే అవకాశముందని భావిస్తున్నారు. మధురై ప్రాంతంలో ఉన్న డీఎంకే నేతలు చాలా మంది ఆళగిరికి సన్నిహితులే. కొత్తగా నియమించిన వారికి అంత శక్తి సామర్థ్యాలు లేవు. మరి ఈ ప్రాంతంలో పట్టు సాధించేందుకు స్టాలిన్ తన సోదరుడు ఆళగిరితో సయోధ్య కుదుర్చుకుంటారా? అన్న చర్చ జరుగుతోంది. కరుణానిధి కుటుంబంలోని కొందరు ఇద్దరి మధ్య సయోధ్య కుదిర్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు కూడా టాక్ వినపడుతోంది.
ససేమిరా అంటున్న……
అయితే స్టాలిన్ మాత్రం సోదరుడితో సయోధ్యకు ససేమిరా అంటున్నారు. తిరిగి ఆళగిరి వస్తే డీఎంకేలో అలజడి ప్రారంభం కావడం ఖాయమంటున్నారు. ఇప్పటి వరకూ డీఎంకేలో గ్రూపులు లేవని, ఆళగిరి రాకతో పార్టీ ఇబ్బందుల్లో పడుతుందని స్టాలిన్ వద్దే వదంటున్నారు. దీంతో మధురై ప్రాంతంలోని ఎక్కువ స్థానాలను కూటమిలోని పార్టీలకు సర్దుబాటు చేయాలన్న యోచనలో కూడా స్టాలిన్ ఉన్నారని చెబుతున్నారు. మరి మధురై ప్రాంతంలో స్టాలిన్ పార్టీని ఎలా బలోపేతం చేయగలుగుతారో చూడాల్సి ఉంది.