ముందే ఓటమిని ఒప్పేసుకున్నారా? అందుకేనా?
ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్ధి ఎవరైనా విజయంపై విశ్వాసం కలిగి ఉంటాడు. తనగెలుపు నల్లేరుపై నడకేనని ధీమా వ్యక్తం చేస్తాడు. ప్రత్యర్ధి తన ముందు తేలిపోతాడని చెబుతాడు. ఏ [more]
ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్ధి ఎవరైనా విజయంపై విశ్వాసం కలిగి ఉంటాడు. తనగెలుపు నల్లేరుపై నడకేనని ధీమా వ్యక్తం చేస్తాడు. ప్రత్యర్ధి తన ముందు తేలిపోతాడని చెబుతాడు. ఏ [more]
ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్ధి ఎవరైనా విజయంపై విశ్వాసం కలిగి ఉంటాడు. తనగెలుపు నల్లేరుపై నడకేనని ధీమా వ్యక్తం చేస్తాడు. ప్రత్యర్ధి తన ముందు తేలిపోతాడని చెబుతాడు. ఏ శక్తి తన విజయాన్ని అడ్డకోలేదని అదే పనిగా వల్లెవేస్తాడు. తగిన బలం లేదని తెలిసి, ఓడిసోయే అభ్యర్ధి కూడా పై మాటలే మాట్లాడతాడు. అంతే తప్ప ఏ అభ్యర్ధి ఓటమి గురించి మట్లాడనే మాట్లాడడు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీచేస్తున్న ప్రస్తుత అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ నో టివెంట ఇలాంటి మాటలు రావడం అందరినీ ఆశ్చర్య పరిచింది. నవంబరు 3 న జరిగే అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించలెకపోతే ఇతర పనుల్లోకి వెళతానని ఇటీవల ఆయన వ్యాఖ్యానించారు.
సంచలన వ్యాఖ్యలు చేసి….
ఫాక్స్ న్యూస్’ కు ఇచ్చిన ఇంటర్వులో ట్రంప్ చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టించాయి. నవంబరు 3 న జరగనున్న అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్ధిగా ట్రంప్, డేమెుక్రటిక్ పార్టీ అభ్యర్ధిగా జోబైడెన్ బరిలోకి దిగనున్న సంగతి తెలిసిందే. ఇప్పటివరకు గెలుపుపై అదే పనిగా ధీమా వ్యక్తంచేసిన ట్రంప్ ఒక్కసారిగా మాట మార్చడం అమెరికా రాజకీయ వర్గాల్లో విస్తృత చర్చ జరుగుతోంది. అంతర్జాతీయ స్ధాయిలోనూ చర్చ నడుస్తోంది. విజయం సాధించకపోతే ఎలాంటి శషభిషలు లెకుండా శ్వేతసౌధం నుచి నిష్క్రమిస్తానని, ఇతర వ్యాపకాలతో తలమునకలవుతామన్న ట్రంప్ వ్యాఖ్యలు పరోక్షంగా ఆయన ఓటమిని ఒప్పుకున్నట్లేనని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. తను మళ్ళీ ఎన్నిక కాకపోతే అది దేశానికే చేదు విషయమన్న అధ్యక్షుడి వ్యాఖ్యలు ఆయన నిరుత్సాహానికి అద్దం పడుతున్నాయి. హాట్ ఫేవరేట్ గా ఎప్పుడో ఎన్నికలబరి లోకి దిగిన అధ్యక్షుడు నోట వెంట ఇలాంటి వ్యాఖ్యలు రావడం నిజంగా ఆశ్చర్యకరమే. భవిష్యత్ పరిణామాలకు సంకేతంగా పేర్కొనవచ్చు.
ఇవే కారణాలు….
ట్రంప్ వ్యాఖ్యల్లో ఆశ్చర్యపడాల్సిన విషయం ఏమీలేదని భవిష్యత్తును ఆయన ముందే ఊహించారని అందుకే అలా మాట్లాడుతున్నారని రాజకీయ విశ్లషకులు చెబుతున్నారు. కరోనాను ఎదుర్కొనడంలో ఘోరమైన వైఫల్యంన, జార్జిఫ్లాయిడ్ మృతిఘటన, అంతర్జాతీయ శక్తిగా చైనా ఎదుగుదలను అడ్డుకోలేకపోవడం, నానాటికి పెరుగుతున్న నిరుద్యోగ సమస్య, కుదేలవుతున్న ఆర్ధిక వ్వవస్ధ కారణంగా ట్రంప్ గ్రాఫ్ ఇటీవల కాలంలో రాదుణంగా పడిపోయింది. కరోనాపట్టడిలో వైఫల్యాన్ని అంగీకరించలేక, చైనాపైనా, ప్రపంచ ఆరోగ్యసంస్ధ పైనా ఆయన నెపం మెాపుతున్నారన్న విమర్శలున్నాయి. ఐరాస కార్యాలయం ఉన్న అంతర్జాతీయ నగరం న్యూయార్క్ కరోనాతో కలవరం చెందుతోంది. దేశంలో నానాటికి పెరుగుతున్న పాజిటివ్ కేసులు, మరణాలు ప్రజలను ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఆఫ్రో అమెరికన్ జార్జి ఫ్లాయిడ్ ను కర్కశంగా హతమార్చిన తీరుపై ఆ వర్గం ఓటర్లు ఆగ్రహంతో ఉన్నారు. స్వేచ్చాసమాజానికి మారుపేరైన అమెరికాలో ఓ నల్లజాతీయుడికి ఎదురైన చేదు అనుభవాన్ని ఆలోచనాపరులైన అమెరికన్లు సైతం జీర్లించుకోలేకపోతున్నారు.
నినాదం మారింది…..
అమెరికాను గొప్పదేశంగా ‘మలచండి’ అన్న పిలుపుతో 2016 ఎన్నికల బరిలోకి దిగిన ట్రంప్ ఇపుడు అమెరికాను గొప్పదేశంగా ‘మిగల్చండి’ అనే స్ధితికి తీపుకువచ్చారని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. సోవియట్ యుానియన్ 1990 ల్లో పతనమైన తరువాత అంతర్జాతీయ యవనికపై అమెరికాకు తిరుగు లేకుండాపోయింది. ఆ తరువాత పుతిన్ హయంలో రష్యా కొంతవరకు కోలుకున్నప్పటికీ అమెరికా అంత శక్తివంతం కాలేదు. ఇదే సమయంలో చైనా రోజురోజుకి శక్తిమంతమవుతోంది. అంతర్జాతీయంగా బలోపేతపమవుతోంది. సైనికంగా, ఆర్ధికంగా, పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతోంది. అనేక అంశల్లో అగ్రరాజ్యాన్ని నేరుగా ఢీకొంటోంది. సవాల్ విసురుతోంది. చైనా ఎదుగుదలను అడ్డుకోవడంలో ట్రంప్ వఫలమయ్యారని మెజారిటీ అమెరికన్లు భావిస్తున్నారు. రానున్న రోజుల్లో తమదేశాన్ని బీజింగ్ సవాల్ చెయగలదని వారు ఆందోళన చెందుతున్నారు. ఇది ట్రంప్ విజయాన్ని ప్రభావితం చేసే అంశమే. కరోనా కారణంగా దెబ్బతిన్న ఆర్ధికవ్యవస్ధను గాడిన పెట్టడంలోనుా ట్రంప్ ఏమీచేయలేకపోయారన్న అభిప్రాయం వ్యవక్తమవుతోంది. ఆర్ధిక వ్యవస్ధ దెబ్బతినడంతో పాటు నానాటికి తీవ్రమవుతున్న నిరుద్యోగ సమస్య పెను సవాల్ గా మారుతోంది.
వ్యతిరేకిస్తున్న వారి శాతం….
కరోనా కారణంగా ఉన్న ఉద్యోగాలు ఊడాయి. ఇక కొత్త ఉద్యోగాల సమస్య లేనేలేదు. తాజా అంచనాల ప్రకారం ట్రంప్ ను వ్యతిరేకిస్తున్నవారు 55 శాతం పైమాటే. ఆయన విధానాలను ఆమోదిస్తున్నవారి సంఖ్య 40 శాతానికి మించడంలేదు. ఈ అంచనాలు ట్రంప్ నకు కంటిమీద కునుకు పట్టనీయడం లేదు. 2016 ఎన్నికల్లోనూ డెమెుక్రటిక్ పార్టీ వైఫల్యం వల్లనే ట్రంప్ గెలిచారన్నది కొందరు విమర్శకుల వాదన. బలమైన నేత బెర్నీశాంగర్స్ ను కాదని, పలు వివాదాల్లో చెక్కుకున్న హిల్లరీ క్లింటన్ ను డెమెుక్రటిక్ పార్టీ బరిలోకి దించడం వల్లనే ట్రంప్ విజయం సులభతరమైంది. అప్పట్లో శాండర్స్ కు యువకుల్లో, కార్మిక వర్గాల్లో మంచి పలుకుబడిఉంది. ఆయన సౌమ్యవాద భావాలను జీర్లించుకోలేని పార్టీలోని కొందరు పెద్దలు శాండర్స్ ను తప్పించారు. ఇందులో నాటి అధ్యక్షుడు బరాక్ ఒబామా పాత్ర కూడా ఉందని చెబుతారు. వివిధ అంతర్జాతీయ ఒప్పందాల నుంచి వైదొలగడం ద్వారా ట్రంప్ చెడ్డపేరు తెచ్చుకున్నారు. ఒబామా హయంలో కుదిరిన పారిస్ వాతావరణ ఒప్పందం, ఇరాన్ అణు ఒప్పందం, 12 కీలక దేశాలతో కలసిన ట్రాన్స్ పసిఫిక్ పార్టనర్ షిప్ ఒప్పందం నుంచి వైదొలగడం వల్ల ట్రంప్ చపలచిత్తుడని పేరు తెచ్చుకున్నారు. ఇవన్నీ రేపటి ఎన్నికల్లో ట్రంప్ కు గుదిబండగా మారనున్నది. హెచ్ వన్ బి వీసాలను నియంత్రించడం ద్వారా స్ధానిక అమెరికన్లను ఆకట్టుకుని పై సమస్యలను అధిగమించవచ్చన్నది ట్రంప్ ఆలోచన. అయితే అదంత తేలిక కాదు. అందుకే ఆయన వైరాగ్యంతో మాట్లాడుతున్నారు.
-ఎడిటోరియల్ డెస్క్