పనికి రాదని వదిలేశాడు
నాటో…. నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్… దీని సంక్షిప్త స్వరూపం. తెలుగులో ఉత్తర అట్లాంటిక్ సైనిక కూటమి అని స్థూలంగా వ్యవహరిస్తారు. “నాటో” గురించి ఈ తరానికి [more]
నాటో…. నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్… దీని సంక్షిప్త స్వరూపం. తెలుగులో ఉత్తర అట్లాంటిక్ సైనిక కూటమి అని స్థూలంగా వ్యవహరిస్తారు. “నాటో” గురించి ఈ తరానికి [more]
నాటో…. నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్… దీని సంక్షిప్త స్వరూపం. తెలుగులో ఉత్తర అట్లాంటిక్ సైనిక కూటమి అని స్థూలంగా వ్యవహరిస్తారు. “నాటో” గురించి ఈ తరానికి తెలిసి ఉండకపోవచ్చు. అసలు తెలియాల్సిన పరిస్థితులు కూడా లేవు. ప్రచ్ఛన్న యుద్థ కాలంలో అమెరికా ఆధ్వర్యంలో ఏర్పాటైన ఈ కూటమి ఈ నెల నాలుగో తేదీతో 70 వసంతాలు పూర్తి చేసుకుంది. ఏడు పదుల ప్రస్థానం పూర్తయిన సందర్భంగానే “నాటో” మళ్లీ వార్తల్లోకి ఎక్కింది. ఇంతకు మించి దాని గురించి ప్రస్తావించుకోవాల్సిన సందర్భం ప్రత్యేకంగా ఏమీ లేదు. నాటో 70 ఏళ్ల ప్రయాణం సందర్భంగా ఇటీవల బ్రిటన్ రాజధాని లండన్ లో కూటమి దేవాల అధినేతలు సమావేశమయ్యారు. అమెరికా, ఫ్రాన్స్, కెనడా అధినేతలు డొనాల్డ్ ట్రంప్, మెక్రాన్, జస్టిస్ ట్రుడో తదితరులు ఈ శిఖరాగ్ర సమావేశంలో పాల్గొననున్నారు.
ఆధిపత్యాన్ని అడ్డుకునేందుకు….
నాటి సోవియట్ యూనియన్ (నేటి రష్యా) ఆధిపత్యాన్ని అడ్డుకునేందుకు, ఆ దేశం నుంచి యావత్ దేశాలను కాపాడుకునేందుకు అమెరికా ఆధ్వర్యంలో “నాటో” ఆవిర్భవించింది. 1949 డిసెంబరు 4న 29 దేశాలతో బెల్జియం రాజధాని బ్రస్సెల్స్ లో పురుడు పోసుకున్న ఈ కూటమిలో అమెరికా, ఫ్రాన్స్, బ్రిటన్, కెనడా ప్రధాన దేశాలు. బెల్జియం, డెన్మార్క్, నార్వే, పోర్చుగల్, నెదర్లాండ్స్, గ్రీస్, టర్కీ, జర్మనీ, స్పెయిన్, లగ్జెంబర్గ్, హంగేరీ, చెక్ రిపబ్లిక్ తదితర దేశాలు ఇందులో సభ్యత్వాన్ని కలిగి ఉన్నాయి. ఇవన్నీ ఉత్తర అమెరికా, ఐరోపా ప్రాంత దేశాలే కావడం గమనార్హం. వీటికి అప్పటి సోవియట్ యూనియన్ నుంచి ప్రమాదం ఉందనే అభిప్రాయం ఉంది. అప్పట్లో సోవియట్ యూనియన్ అమెరికాకు ధీటుగా బలంగా ఉండేది. నాటో ఆవిర్భావం తర్వాత దానిక పోటీగా 1955 మే 14న “వార్సా” కూటమి ఆవిర్భవించింది. దీనికి సోవియట్ యూనియన్ సారథ్యం వహించేది. పోలండ్ రాజధాని వార్సా నగరంలో ఈ కూటమి ఆవిర్భవించడంతో దానికి వార్సా కూటమి అని పేరు పెట్టారు. 1991లో సోవియట్ యూనియన్ విచ్ఛిన్నం కావడంతో వార్సా ముక్క చెక్కలయింది. అమెరికా ఏకధ్రువ ప్రపంచంలో అసలు వార్సా కూటమి అవసరమే లేకుండా పోయింది.
అది పతనం కావడంతోనే…..
సోవియట్ యూనియన్ పతనంతో నాటో కూటమి ప్రాధాన్యం కోల్పోయింది. ప్రమాదమనుకున్న సోవియట్ యూనియన్ కకావికలం కావడంతో క్రమంగా నాటో కూటమి నిర్వీర్యం కాసాగింది. నిజానికి ఇప్పుడు నాటో నామమాత్రమే. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సయితం దీని పట్ల పూర్తిగా అనాసక్తిని ప్రదర్శిస్తున్నారు. దీనికి నిధులు సమకూర్చడం తమకు భారంగా మారిందని, సభ్యదేవాలు పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. లండన్ లో జరిగిన కూటమి సమావేశంలో ఈ విషయాన్ని బహిరంగంగానే చెప్పారు. సమావేశంలో ఇతర సభ్యదేశాల నాయకుల అపహాస్యానికి గురైన ట్రంప్ ఇతర కార్యక్రమాలను రద్దు చేసుకుని వెనక్కు వెళ్లిపోయారు. ప్రస్తుత పరిస్థితుల్లో నాటో ప్రాధాన్యం కోల్పోయిందని, దానిని కొనసాగించాల్సిన అవసరం ఉందా? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్ దీనిని “బ్రెయిన్ డెడ్” అని ఎప్పుడో అభివర్ణించారు. మాక్రాన్ తో పాటు కెనడా ప్రధాని జస్టిన్ ట్రుడో, బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ లు ట్రంప్ ను పరోక్షంగా ప్రస్తావిస్తూ నవ్వుతూ మాట్లాడుకోవడాన్ని చూస్తే నాటో ను బలోపేతం చేయాలన్న ఆలోచన వారికి లేదన్న విషయం అర్థమవుతోంది. వాస్తవ పరిస్థితి కూడా అదేవిధంగా ఉందన్న అభిప్రాయం దౌత్య వర్గాల్లో వ్యక్తమవుతోంది.
నాడు బలంగా…..
1950 నుంచి 1980 మధ్య కాలంలో “నాటో” “వార్సా” కూటములు బలంగా ఉండేవి. యుద్ధానికి కూడా సిద్ధంగా ఉండేవి. ఏ క్షణాన ఏమి జరుగుతుందోనన్న భయం అంతర్జాతీయ సమాజాన్ని వెంటాడేది. ప్రస్తుతం నాటో నాయకత్వ బాధ్యతల నుంచి అమెరికా వైదొలగడంతో ఈ సంస్థ నిర్వీర్యమయింది. ఇప్పుడు అమెరికా దృష్టి కూడా ఒకప్పటి తన ప్రత్యర్థి రష్యా కన్నా చైనా పైనే ఉంది. చైనా ఎదుగుదల అగ్రరాజ్యాన్ని బెంబేలెత్తిస్తోంది. దానిని అడ్డుకునేందుకు తన శక్తియుక్తులను కేంద్రీకరిస్తుంది. ఇందులో భాగంగానే భారత్ ను చేరదీస్తుంది. మారిన పరిస్థితుల్లో యూరప్ కన్నా ఆసియాపైనే అమెరికా దృష్టి పెట్టింది. ఇరాక్, ఇరాన్, ఆప్ఫనిస్థాన్ వ్యవహారాలను నిశితంగా గమనిస్తోంది. ఈ పరిస్థితుల్లో “నాటో” నిర్వీర్యమైనట్లే. అంతర్జాతీయంగా దాని ప్రభావం దాదాపు శూన్యం.
-ఎడిటోరియల్ డెస్క్
- Tags
- nato
- నాà°à±