ట్రంప్ గెలవడానికి అదొక్కటే కారణమవుతుందా?
కరోనా ప్రభావం నుంచి ప్రపంచం క్రమక్రమంగా బయటపడుతున్న తరుణంలో ఇప్పుడు అంతర్జాతీయ సమాజం దృష్టి అమెరికా ఎన్నికలపై కేంద్రీకృతమైంది. విపక్ష డెమెుక్రటిక్ పార్టీ అభ్యర్ధిగా జో బైడెన్ [more]
కరోనా ప్రభావం నుంచి ప్రపంచం క్రమక్రమంగా బయటపడుతున్న తరుణంలో ఇప్పుడు అంతర్జాతీయ సమాజం దృష్టి అమెరికా ఎన్నికలపై కేంద్రీకృతమైంది. విపక్ష డెమెుక్రటిక్ పార్టీ అభ్యర్ధిగా జో బైడెన్ [more]
కరోనా ప్రభావం నుంచి ప్రపంచం క్రమక్రమంగా బయటపడుతున్న తరుణంలో ఇప్పుడు అంతర్జాతీయ సమాజం దృష్టి అమెరికా ఎన్నికలపై కేంద్రీకృతమైంది. విపక్ష డెమెుక్రటిక్ పార్టీ అభ్యర్ధిగా జో బైడెన్ అభ్యర్ధిత్వం అధికారికంగా ఖరారవ్వడంతో ఎన్నికల ఘంటారావం మెుదలైనట్లయింది. రిపబ్లికన్ అభ్యర్ధిగా ప్రస్తుత అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ పేరు ఎప్పుడో ఖరారైన సంగతి తెలిసిందే. ట్రంప్ ఫ్లోరిడా రాష్ట్రానికి చెందిన వారు కాగా జో బైడెన్ డెలావర్ రాష్ట్ర నివాసి. సాధారణంగా అమెరికా ఎన్నికలంటే ఆ దేశానికే కాకుండా యావత్ ప్రపంచానికి ఆసక్తి ఉంటుంది. అది అనుసరించే ఆర్ధిక, పారిశ్రామిక, విదేశాంగ విధానాలు, ఆయాదేశాలపై వాటిప్రభావం గురించి విస్తృతంగా చర్చ జరుగుతుంది. అందువల్లే అక్కడి అభ్యర్ధుల ప్రబావం, గెలుపు ఓటములపై ఆసక్తి నెలకొంటుంది. నవంబరు 3న అంటే మరో నాలుగు నెలల తరువాత జరగనున్న ఈ ఎన్నికలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
ట్రంప్ విజయావకాశాలపై….
ప్రస్తుత ప్రభుత్వం కరోనాను ఎదుర్కొంటున్న తీరు, చైనా, అమెరికా వాణిజ్య యుద్ధం, వలస విధానాలు, ఆరోగ్య విధానాలు, అంతర్జాతీయంగా అమెరికా ప్రాభవం కొడిగడుతుండటం తదితర అంశాలు ప్రధానంగా ప్రచారంలోకి రానున్నాయి. గత నాలుగేళ్ళలో ట్రంప్ అనుసరించిన విధానాలు, సాధించిన విజయాలు, ఎదుర్కొన్న వైఫల్యాలు, ఆయన వ్యక్తిత్వం, పనితీరుపైనా నిశితంగా విశ్లేషణలు జరుగుతున్నాయి. కరోనాను ఎదుర్కోవడంలో వైఫల్యం ట్రంప్ విజయావకాశాలను దేబ్బతీస్తుందని కొన్న అధ్యయనాలు చాటుతున్నాయి. అదే సమయంలో నల్లజాతీయుడైన ఆఫ్రో-అమెరికన్ జార్జిఫ్లాయిడ్ హత్య ట్రంప్ కు పెద్ద ఎదురుదెబ్బ కాగలదన్న అంచనాలు ఉన్నాయి. కానీ ఈ ఘటన ట్రంప్ తనకు అనుకూలంగా మలచుకుని శ్వేతజాతీయులను రెచ్చగొట్టడం ద్వారా లబ్ధి పొందగలరని కుాడా కొంతమంది నిపుణులు వాదిస్తున్నారు.
నిక్సన్ కూడా అంతే….
గతంలో రిచర్డ్స్ నిక్సన్ కుాడా ఇలానే ప్రయెాజనాలు పొందారని వారు గుర్తుచేస్తున్నారు. అప్పట్లో నిక్సన్ రెండో దఫా పోటీ చేసే సమయంలో దేశంలో అశాంతి నెలకొంది. ప్రజలు ఆగ్రహంగా ఉన్నారు. శాంతిభద్రతలు క్షీణించాయి. కానీ మెజార్టీ శ్వేత జాతీయులను ఆకట్టుకోవడం ద్వారా నిక్సన్ రెండోసారి అధినేత పీఠాన్ని అధిష్టించారు. ఇప్పుడు కుాడా ట్రంప్ అలా లబ్ధిపొందగలరని ఆయన అభిమానులు అభిప్రాయపడుతున్నారు. నల్లజాతీయుడు ఫ్లాయిడ్ హత్యకు నిరసనగా జరుగుతున్న ఆందోళనలకు వ్యతిరేకంగా శ్వేతజాతీయులైన అసలైన అమెరికన్లను ట్రంప్ రెచ్చగొడుతున్నారన్న అభిప్రాయం ఉంది. నిరసనలు తెలపడం అమెరికా సమాజంలో హక్కు అయినప్పటికి ఆస్తుల విధ్వంసాన్ని అక్కడి సమాజం అంగీకరించదు. శాంతిభద్రతలు అదుపు తప్పడాన్ని వారు ఆమెాదించరు. ఇప్పుడు దేశవ్యాప్తంగా జరుగుతున్న అల్లర్లను రిపబ్లికన్లు, ట్రంప్ అభిమానులు వ్యతిరేకిస్తున్నారు. కొన్ని రాష్ట్రాల డెమెుక్రటిక్ గవర్నర్లు అల్లర్లను పరోక్షంగా ప్రోత్సహిస్తున్నారని వారు ఆరోపిస్తున్నారు. ఫ్లాయిడ్ ఘటన క్షమార్హం కానప్పటికీ, అదేపనిగా ఆందోళనలు కొనసాగడాన్ని కొందరు జీర్లించుకోలేకపోతున్నారు. దీన్ని ట్రంప్ అవకాశంగా తీసుకుంటున్నారు. అమెరికన్స్ ఫస్ట్ అన్న నినాదంతో అధికాంలోకి వచ్చిన ట్రంప్ ఇప్పటికీ అదే నినాదాన్ని వినిపిస్తున్నారు. విద్య, ఉద్యోగాల్లో గత నాలుగేళ్ళుగా వలస ప్రజలకు చుక్కలు చుాపించారు. ఇది తనకు మేలుచేకుారుస్తుందని ట్రంప్ అభిప్రాయం.
ప్రతికూల అంశాలు కూడా….
ట్రంప్ నకు ప్రతికూల అంశాలు కుాడా పుష్కలంగా ఉన్నాయి. కరోనాను ఎదుర్కోవడంలో ఆయన వైఫల్యం ప్రస్పుటంగా కనపడుతోంది. కరోనా కేసులు 20 లక్షలకు చేరువయ్యాయి. మరణాలు, లక్షా పదివేలు దాటాయి. దేశంలోని పెద్దనగరాల్లో ఒకటైన న్యూయార్క్ శవాల దిబ్బగా మారింది. మృతదేహాలను ఖననం చేసేందుకు కుాడా వేచి ఉండాల్సిన దయనీయ పరిస్ధితి అక్కడ నెలకొంది. శాంతిభ్రతలు క్షీణించడం కుాడా ట్రంప్ నకు ప్రతికూలంగా మారనుంది. స్వయంగా అధ్యక్షుడు బంకరులో తలదాచుకోవాల్సిన పరిస్ధితి ఏర్పడిందంటే శాంతిభద్రతలు ఏస్ధాయిలో ఉన్నాయెా అర్ధంచేసుకోవచ్చు. 2001 లో వరల్గ్ ట్రేడ్ ఆఫీస్ పై ఉగ్రదాడి సందర్భంగా అప్పటి అధ్యక్షుడు జార్జిబుష్ బంకరులోకి వెళ్ళారు. మళ్ళీ దాదాపు 20 ఏళ్ళ తరువాత ఈ పరిస్ధితి ఏర్పడటానికి ట్రంప్ వైఖరే కారణమన్న విమర్శలున్నాయి.
సమర్థంగా వ్యవహరించలేకపోతున్నారని….
అల్లర్లు పెరగడానికి ట్రంప్ మెుండివైఖరే కారణమన్న వాదన లేకపోలేదు. ఇక అంతర్జాతీయంగా చైనా ఎదుగుదలను అడ్డుకోవడంలో అధినేత ట్రంప్ వైఫల్యంపై అమెరికాలో చర్చ జరుగుతోంది. ఒకప్పటి కమ్యూనిస్టు దేశం సోవియట్ యుానియన్ ముక్కచెక్కలవడంతో ముాడుదశాబ్ధాలుగా అమెరికాకు ఎదురు లేకుండాపోయింది. కానీ ప్రస్తుతం చైనా నాటి రష్యా స్ధానాన్ని భర్తీ చేసేందుకు ఆరాటపడుతోంది. అమెరికాను అన్ని రకాలుగా డీకొంటున్న చైనాను నిలువరించడంలో ట్రంప్ సమర్ధంగా వ్యవహరించలేకపోతున్నారన్న అభిప్రాయం ఉంది. ఇక కరోనా కారణంగా దేశ ఆర్ధికవ్యవస్ధ కుదేలైంది. వచ్చే పదేళ్ళలో ఆర్ధిక వ్యవస్ధ 15.7 ట్రిలియన్ డాలర్లకు కుంచించుకు పోతుందని కాంగ్రెస్ బడ్జెట్ ఆఫీస్ అంచనా వేసింది. ఇది అమెరికా కాంగ్రెస్ కు ఆర్ధిక వ్యవహారాలకు సంబందించి సమాచారాన్ని అందిస్తుంది. కరోనా కారణంగా ధేశంలో నిరుద్యోగ సమస్య తీవ్రరుాపం దాలుస్తోంది. ఉద్యోగం లేనివారి సంఖ్య 3.5 శాతం నుంచి 20 శాతానికి పెరిగింది. తనవైఫల్యాలను జాతీయవాదంతో ట్రంప్ అధిగమించగలరా? అన్నది ఇప్పుడు ప్రశ్న. విజయావకాశాలపై స్పష్టత రావాలంటే మరి కొద్ది కాలం వేచి చూడక తప్పదు.
-ఎడిటోరియల్ డెస్క్