గురుమూర్తిపై భారీగా బెట్టింగుల పర్వం… మెజారిటీపైనే?
తిరుపతి పార్లమెంటు స్థానానికి జరుగుతున్న ఎన్నికల ప్రక్రియ జోరందుకుంది. నిన్న మొన్నటి వరకు అభ్యర్థుల విషయంలోను, పార్టీల విషయంలోనూ పెద్దగా క్లారిటీ లేకపోవడంతో ఒకింత స్తబ్దుగాఉన్న రాజకీయ [more]
తిరుపతి పార్లమెంటు స్థానానికి జరుగుతున్న ఎన్నికల ప్రక్రియ జోరందుకుంది. నిన్న మొన్నటి వరకు అభ్యర్థుల విషయంలోను, పార్టీల విషయంలోనూ పెద్దగా క్లారిటీ లేకపోవడంతో ఒకింత స్తబ్దుగాఉన్న రాజకీయ [more]
తిరుపతి పార్లమెంటు స్థానానికి జరుగుతున్న ఎన్నికల ప్రక్రియ జోరందుకుంది. నిన్న మొన్నటి వరకు అభ్యర్థుల విషయంలోను, పార్టీల విషయంలోనూ పెద్దగా క్లారిటీ లేకపోవడంతో ఒకింత స్తబ్దుగాఉన్న రాజకీయ వేడి.. ఇప్పుడు అభ్యర్థుల ఖరారు… నామినేషన్ల పర్వం ముగియడంతో రాజకీయంగా కూడా తిరుపతి నియోజకవర్గంపై రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు దృష్టి పెట్టారు. ఇప్పటికే ఇక్కడ విజయం తమదేనని వైసీపీ గంటాపథంగా చెబుతోంది. అదేసమయంలో టీడీపీ తరఫున పోటీ చేస్తున్న పనబాక లక్ష్మి.. కూడా గెలుపుపై ధీమానే వ్యక్తం చేస్తున్నారు.
అన్నీ విషయాలు పక్కన పెడితే….
మరోవైపు.. బీజేపీ తరఫున రాజకీయ అరంగేట్రం చేసిన సీనియర్ ఐఏఎస్ అధికారి రత్నప్రభ.. కూడా గెలుపు వన్ సైడ్ అవుతుందని చెబుతున్నారు.. ఇంకోవైపు.. కాంగ్రెస్ తరఫున పోటీకి దిగుతున్న మాజీ ఎంపీ, కేంద్ర మాజీ మంత్రి చింతా మోహన్ కూడా గెలుపు గుర్రం ఎక్కుతానని అంటున్నారు. అసలు గెలుపు ఎవరిది అన్నది పక్కన పెట్టేస్తే ప్రధాన పార్టీల తరపున పోటీ చేస్తోన్న అభ్యర్థులు అందరూ కూడా గెలుపు విషయంలో తమదే అన్న ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇక ప్రచార పర్వంలో ఎవరి వ్యూహాలు వారు అనుసరిస్తున్నారు. ఈ క్రమంలో ఎవరు గెలుస్తారనే విషయం పక్కన పెడితే. వైసీపీ తరఫున తొలిసారి రాజకీయ అరంగేట్రం చేసిన డాక్టర్ గురుమూర్తి విషయంలో మాత్రం బెట్టింగులు పెరుగుతున్నాయి.
మెజారిటీపైనే….
తెలంగాణకు చెందిన కీలక బెట్టింగు వీరులు రంగంలోకి దిగినట్టు సమాచారం. ఇక, ఏపీకి చెందిన వారు కూడా బెట్టింగులు కడుతున్నారు. ఇక్కడ బెట్టింగులు అన్నీ గురుమూర్తి కేంద్రంగానే నడుస్తున్నాయి. గురుమూర్తి గెలుపు మాత్రమే కాదు.. ఆయనకు వచ్చే మెజార్టీ ఏ స్థాయిలో ఉంటుంది అనేదానిపై ఒకటికి రెండు, మూడు రూపాయల వరకు పెచ్చు ఇచ్చి మరీ బెట్టింగ్లు కాస్తున్నారు. బెట్టింగ్ రాయుళ్లు ఇప్పటికే పలు ప్రైవేటు సర్వేల ఏజెన్సీలతో నిత్యం టచ్లో ఉంటూ ఏడు నియోజకవర్గాల్లో ఎక్కడ ఎంత మెజార్టీ వస్తుందన్నది కూడా లెక్కలు వేసుకునీ మరి బెట్టింగ్లకు దిగుతున్నారు.
అన్నింగా ఏకపక్షంగా…..
ఒకటి రెండు సెగ్మెంట్లు మినహా అన్ని చోట్లా వైసీపీ అభ్యర్థి గురుమూర్తికి పూర్తి ఏకపక్ష మెజార్టీ వస్తుందనే సర్వేలు చెపుతున్నాయి. ప్రస్తుతం తిరుపతిలో ఎక్కడా చిన్న హోటల్ రూం కూడా లభించడం లేదు. దీనికి కారణం.. బెట్టింగు రాయుళ్లు దాదాపు 50 మంది వరకు తిరుపతిలోనే మకాం వేసి మరీ.. బెట్టింగులకు తెరదీశారు. ఎక్కువ మంది బెట్టింగు రాయుళ్లు.. 3 – 3.50 లక్షల మెజారిటీ వైపు మొగ్గు చూపుతుండడం గమనార్హం.