రాజులుగానే తరలిపోయారు
రాజు అంటేనే ఒక దర్పం, దర్జా. గర్వం. పక్కన మంత్రి ఏమిటి మరీ చీప్ గా. అందుకేనేమో ఆ విధి తండ్రీకొడుకులు ఇద్దరినీ రాజులుగానే శాశ్వతంగా ఉంచేసింది. [more]
రాజు అంటేనే ఒక దర్పం, దర్జా. గర్వం. పక్కన మంత్రి ఏమిటి మరీ చీప్ గా. అందుకేనేమో ఆ విధి తండ్రీకొడుకులు ఇద్దరినీ రాజులుగానే శాశ్వతంగా ఉంచేసింది. [more]
రాజు అంటేనే ఒక దర్పం, దర్జా. గర్వం. పక్కన మంత్రి ఏమిటి మరీ చీప్ గా. అందుకేనేమో ఆ విధి తండ్రీకొడుకులు ఇద్దరినీ రాజులుగానే శాశ్వతంగా ఉంచేసింది. అలాగే కాలంతో కలిపేసింది. ఉత్తరాంధ్రా రాజకీయాల్లో మేరు నగధీరుదు అనదగ్గవారు స్వర్గీయ ద్రోణంరాజు సత్యనారాయణ. ఆయనది నాలుగున్నర దశాబ్దాల రాజకీయం. దేశంలో ఎక్కడైనా కాంగ్రెస్ అధ్యక్షుడి అధికారాలు చెల్లేవి కానీ ఉత్తరాంధ్రాలో మాత్రం ద్రోణంరాజే కర్త, కర్మ, క్రియ. ఆయనను దాటుకుని టికెట్ తెచ్చుకునే సాహసం ఎవరూ చేయలేరు. ఆయన అశీస్సులు లేకుండా అసెంబ్లీ గేటు దాటి వెళ్ళలేరు. ఇంతచేసిన ఆయన తన కుమారుడు, రాజకీయ వారసుడు ద్రోణంరాజు శ్రీనివాస్ ని మాత్రం బతికుండగా ఎమ్మెల్యేగా చూడలేకపోయారు. తాను సైతం మంత్రి కాలేకపోయారు.
విధి విచిత్రమే:
తండ్రి చనిపోయాక జరిగిన ఉప ఎన్నికలో వారసుడు శ్రీనివాస్ గెలిచారు, ఎమ్మెల్యే అయ్యారు. మళ్ళీ రెండవమారు కూడా అయన గెలిచారు. మొత్తానికి శ్రీనివాస్ పొలిటికల్ కెరీర్ లో అయిదు సార్లు పోటీ చేస్తే రెండు సార్లు విజయం ఆయనని పలకరించింది. ఓడినా ప్రజల కోసం పాటుపడే నేతగా ఆయన గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక ఆయనను చేరదీసి మరీ 2019 ఎన్నికల్లో జగన్ టికెట్ ఇచ్చారు. స్వల్ప తేడాతో విశాఖ సౌత్ నుంచి ఓడి బ్యాడ్ లక్ అనిపించుకున్నారు శ్రీనివాస్. ఒకవేళ ఆయనే కనుక గెలిచి ఉంటే మంత్రి పదవి పక్కాగా దక్కేది అంటారు. అయితే మంత్రి పదవికి సరిసాటిగా విశాఖ మెట్రో రీజియన్ డెవలప్మెంట్ అధారిటీ చైర్మన్ పదవిని ఇచ్చి జగన్ తన ఉదారత చూపారు. ఆ పదవికి ఏడాది పూర్తి అయింది.మళ్ళీ రెన్యూవల్ చేస్తారని అనుకుంటున్నారు కూడా.
ఎమ్మెల్సీగా :
ఇక మరో వైపు ఈ పదవి కాకపోతే ఎమ్మెల్సీగా శ్రీనివాస్ ని చేసి చట్టసభల్లో ఆయన వాణిని వినిపించాలని జగన్ ఆశించినట్లుగా కూడా చెబుతారు. వచ్చే మార్చి వరకూ ఆగితే ఆయనే ఎమ్మెల్సీగా ఉండేవారు. ఆ మీదట కొత్త జిల్లాల ఏర్పాటు, సామాజిక సమీకరణల కూర్పు కలసివస్తే మంత్రి కూడా అయ్యేవారు. అంటే ఒక విధంగా ఆలోచిస్తే ఆయనకు రాజకీయంగా మంచి భవిష్యత్తు ఉందని అభిమాన జనం సహా అంతా నమ్ముతూ వచ్చిన వేళ విధి వక్రించి కరోనాతో కన్నుమూశారు. జగన్ వంటి నేత మన్ననలు నిండుగా అందుకున్న శ్రీనివాస్ కి పదవులు చాలా సులువుగా వస్తాయని కూడా అంతా అనుకుంటున్న వేళ ఆయన ఈ లోకాన్నే వీడిపోవడం క్యాడర్ జీర్ణించుకోలేకపోతోంది.
ఎప్పటికీ అలాగే :
సరే ఎంతమందికి ఆ అద్రుష్టం వరిస్తుంది. వారి ఇంటి పేరే రాజు. వంటిలోనూ ఉంది రాజ దర్పం, అందుకే ద్రోణంరాజులుగా తండ్రీ కొడుకులు ఇద్దరూ జనాభిమానాన్ని గెలుచుకున్నారు. తాము మంత్రులం, సామంతులం ఎప్పటికీ కామూ, కాబోమంటూ భువి నుంచి దివికేగారు అని అభిమానులు సంత్రుప్తి పడుతున్నారు. మంత్రి కాకపోతేనేమి రాజులుగా జనం గుండెల్లో చిరస్థాయిగా ఉన్నారని కూడా అంటున్నారు. ఏది ఏమైనా అయిదున్నర దశాబ్దాల పాటు సుదీర్ఘ ప్రయాణం చేసిన రాజకీయ కుటుంబం ఇక తెర మరుగు అయింది. ఉత్తరాంధ్రా జిల్లా రాజకీయాల్లో ద్రోణంరాజు శకం అంతరించిందనే చెప్పాలి.