Andhra : సారూ… కారుకు ఇక్కడ ఛాన్సే లేదట
ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ శూన్యత ఉందా? మరో కొత్త పార్టీకి అవకాశముందా? అంటే సమాధానం లేదనే వస్తుంది. ఆంధ్రప్రదేశ్ కు, తెలంగాణకు పోలిక లేదు. తెలంగాణలో రాజకీయ [more]
ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ శూన్యత ఉందా? మరో కొత్త పార్టీకి అవకాశముందా? అంటే సమాధానం లేదనే వస్తుంది. ఆంధ్రప్రదేశ్ కు, తెలంగాణకు పోలిక లేదు. తెలంగాణలో రాజకీయ [more]
ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ శూన్యత ఉందా? మరో కొత్త పార్టీకి అవకాశముందా? అంటే సమాధానం లేదనే వస్తుంది. ఆంధ్రప్రదేశ్ కు, తెలంగాణకు పోలిక లేదు. తెలంగాణలో రాజకీయ శూన్యత ఉండటంతో అనేక పార్టీలు రోజుకొకటి పుట్టుకొస్తున్నాయి. కానీ ఏపీలో 2014 తర్వాత కొత్తగా పుట్టుకొచ్చిన పార్టీ ఏదీ లేదనే చెప్పాలి. వచ్చే ఎన్నికల నాటికి కూడా ఏపీలో కొత్త పార్టీ వచ్చే అవకాశం లేదు. తెలంగాణ ముఖ్యమంత్రి తనను టీఆర్ఎస్ పార్టీని ఏపీలో పెట్టాలని డిమాండ్ చేస్తున్నారని కామెంట్స్ చేయడంతో దీనిపై పెద్దయెత్తున చర్చజరుగుతోంది.
బలంగా ప్రాంతీయ పార్టీలు…
ఆంధ్రప్రదేశ్ లో ప్రాంతీయ పార్టీలు బలంగా ఉన్నాయి. ఇక్కడ వైసీపీ, టీడీపీ, జనసేన వంటి ప్రాంతీయ పార్టీలే ఏపీని మరికొంత కాలం శాసిస్తాయి. అయితే వైసీపీ లేకుంటే టీడీపీ అన్న రీతిలోనే క్షేత్రస్థాయి పరిస్థితులున్నాయి. జనసేన కూడా కొన్ని ప్రాంతాల్లో ప్రభావం చూపే అవకాశముంది. ఇక ఆంధ్రప్రదేశ్ లో జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ, కమ్యునిస్టులకు అసలు చోటు లేకుండా పోయింది. ఏదో ఒక పార్టీతో అవి ముందుకు సాగాల్సిందే.
జాతీయ పార్టీలు….
తెలంగాణ ను చూసుకుంటే ఇక్కడి పరిస్థితులు వేరు. ఇక్కడ రెండు జాతీయ పార్టీలు బలంగా ఉన్నాయి. కాంగ్రెస్ కొంత బలహీనంగా కన్పిస్తున్నా తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన ఆ పార్టీకి రాజకీయంగా ఎప్పటికైనా అవకాశం ఉంటుంది. నాయకత్వ లేమి తప్ప పార్టీ బలంగానే ఉంది. బీజేపీ కూడా బలం పుంజుకుంటోంది. అందుకే ఇక్కడ ప్రాంతీయ పార్టీలకు అవకాశం ఉందంటున్నారు. బీజేపీ, కాంగ్రెస్ లకు ప్రత్యామ్నాయంగా ఎదిగేందుకు వైఎస్ షర్మిలయినా, మాజీ ఐపీఎస్ ప్రవీణ్ కుమార్ అయినా, కోదండరామ్ అయినా పార్టీ పెట్టారంటున్నారు.
ఇక్కడ అవకాశమే లేదట…
కానీ ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ పరిస్థితులు భిన్నమే. ఇక్కడ కులాలు శాసిస్తాయి. కులాల ఆధారంగానే అధికారం దక్కుతుంది. అందుకే ఏపీలో మరో రాజకీయ పార్టీకి అవకాశమే లేదన్నది విశ్లేషకుల అభిప్రాయం. ప్రస్తుతం బలంగా ఉన్న వైసీపీ, టీడీపీ, జనసేనలను కాదని కొత్త పార్టీ వచ్చి ఇక్కడ చేయగలిగిందేమీ లేదు. కేసీఆర్ వచ్చి పార్టీ పెట్టినా ఏపీలో చేసేదేమీ లేదని, ఇక్కడ కులాల ఆధారంగానే ఎన్నికలు జరుగుతాయని రాజకీయ విశ్లేషకులు సయితం అభిప్రాయపడుతున్నారు.