దువ్వాడ దూకుడు…అచ్చెన్నలో అసహనం… అందుకేనా?
టెక్కలి నియోజకవర్గంలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడును కట్టడి చేసే ప్రయత్నం జరుగుతుంది. ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ దూకుడుతో అచ్చెన్న వర్గం కకా వికలం అవుతుంది. ముఖ్యంగా [more]
టెక్కలి నియోజకవర్గంలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడును కట్టడి చేసే ప్రయత్నం జరుగుతుంది. ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ దూకుడుతో అచ్చెన్న వర్గం కకా వికలం అవుతుంది. ముఖ్యంగా [more]
టెక్కలి నియోజకవర్గంలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడును కట్టడి చేసే ప్రయత్నం జరుగుతుంది. ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ దూకుడుతో అచ్చెన్న వర్గం కకా వికలం అవుతుంది. ముఖ్యంగా ఎమ్మెల్సఅ అయిన తర్వాత దువ్వాడ్ శ్రీనివాస్ మరింత స్పీడ్ పెంచడంతో అచ్చెన్నాయుడులో అసహనం పెరిగిపోతుంది. అందుకే ఆయన ఇటీవల విపక్ష నేతల నియోజకవర్గాల్లో మీ పెత్తనమేంటని వైసీపీని నిలదీస్తున్నారు.
ఎమ్మెల్సీ అయిన నాటి నుంచి…..
టెక్కలి నియోజకవర్గాన్ని గత ఎన్నికల్లోనే కైవసం చేసుకోవాలని భావించినా వైసీపీకి వీలు కుదరలేదు. వైసీపీ నేతలందరూ కలసి కట్టుగా పనిచేసినా దువ్వాడ శ్రీనివాస్ ఓటమి పాలయ్యారు. దీంతో అధికారంలోకి వచ్చిన తర్వాత దువ్వాడ శ్రీనివాస్ ను జగన్ ఎమ్మెల్సీ చేశారు. రెండు దశాబ్దాలుగా రాజకీయాల్లో ఉన్న ఆయన తొలిసారి చట్టసభల్లో ప్రవేశించారు. వచ్చే ఎన్నికలే టార్గెట్ గా దువ్వాడ శ్రీనివాస్ ఇప్పటి నుంచే పావులు కదుపుతున్నారు.
స్థానిక సంస్థల్లో…..
ఇప్పటికే టెక్కలి నియోజకవర్గంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో పట్టు సాధించారు. ఇక ఎంపీటీసీ, జడ్పీటీసీలు కూడా తమ పరమవుతాయనే విశ్వాసంతోనే ఉన్నారు. అచ్చెన్నాయుడు శిబిరంలోని ముఖ్య నేతలకు దువ్వాడ శ్రీనివాస్ వల వేసినట్లు తెలుస్తోంది. అచ్చెన్న శిబిరాన్ని చిన్నాభిన్నం చేస్తేనే ఆయన బలహీనం అవతారని భావించిన దువ్వాడ శ్రీనివాస్ ఆ దిశగా వేగంగా ప్రయత్నాలు మొదలు పెట్టారు.
ఆ శిబిరం మీద….
ఇటీవల కొందరు నేతలు వైసీపీలోకి వెళ్లడం ఇందుకు ఉదాహరణ. దీంతో పాటు టెక్కలి నియోజకవర్గంలో జరిగే అన్ని అభివృద్ధి కార్యక్రమాలను తానే దగ్గరుండి చూస్తున్నారు. గతంలో అచ్చెన్న ఇచ్చిన హామీలను కూడా దువ్వాడ శ్రీనివాస్ అమలు చేయాలని నిర్ణయించారు. టెక్కలిలో తన హయాంలోనే అభివృద్ధి జరిగిందని చెబుతన్న అచ్చెన్నకు ధీటుగా దువ్వాడ శ్రీనివాస్ పనులు చేపడుతుండటంతో అచ్చెన్నలో అసహనం పెరిగిపోయిందంటున్నారు. మొత్తం మీద టెక్కలిలో దువ్వాడ శ్రీనివాస్ వచ్చే ఎన్నికలే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు కనపడుతుంది.