అక్కడ ఎనిమిది దశలు ఎందుకు? అందుకేగా?
అయిదు రాష్రాలు సహా ఒక కేంద్ర పాలిత ప్రాంతానికి ఎన్నికల ప్రకటన అందరూ ఊహించినదే. దక్షిణాదిన తమిళననాడు, కేరళ, కేంద్ర పాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో ఒకే దఫా [more]
అయిదు రాష్రాలు సహా ఒక కేంద్ర పాలిత ప్రాంతానికి ఎన్నికల ప్రకటన అందరూ ఊహించినదే. దక్షిణాదిన తమిళననాడు, కేరళ, కేంద్ర పాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో ఒకే దఫా [more]
అయిదు రాష్రాలు సహా ఒక కేంద్ర పాలిత ప్రాంతానికి ఎన్నికల ప్రకటన అందరూ ఊహించినదే. దక్షిణాదిన తమిళననాడు, కేరళ, కేంద్ర పాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో ఒకే దఫా ఏప్రిల్ 6న ఎన్నికలు జరగనున్నాయి. ఈ మూడు చోట్ల కలిపి మొత్తం 404 (తమిళనాడు 234, కేరళ 140, పుదుచ్చేరి 30) అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. మిగిలన రెండు రాష్టాల్లో ఒకటైన పశ్చిమ బెంగాల్ ఎనిమిది దశల్లో ఎన్నికల నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించింది. ఈ తూర్పు రాష్టంలో మొత్తం 294 స్థానాలు ఉన్నాయి. ప్రస్తుతం ఎన్నికలు జరగనున్న రాష్టాల్లో ఇదే పెద్దది కావడం గమనార్హం. ఇక్కడ మార్చి 27న మొదటి దశ ప్రారంభమవుతుంది. ఆ తరువాత ఏప్రిల్ 1,6,10,17,22, 26,29 తేదీల్లో రెండు, మూడు, నాలుగు, అయిదు, ఆరు, ఏడు, ఎనిమిది దశల్లో ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకుంటారు.
అసోంలోనూ అంతే….?
ఇక మిగిలిన ఈశాన్య భారతంలోని అసోంలో 126 సీట్లకు మూడు దశల్లో (మార్చి 27, ఏప్రిల్ 1, 6 తేదీల్లో ఎన్నికలు నిర్వహిస్తారు. స్థూలంగా చూస్తే ఎన్నికల ప్రకటనలో ఎవరికీ ఎలాంటి అభ్యంతరాలు కనపడవు. కానీ లోతుగా తరచి చూస్తే ఎన్నికల షెడ్యూల్ ప్రకటనలో కేంద్ర ఎన్నికల సంఘం (సీఈసీ) ఒకింత మేరకు కేంద్ర ప్రభుత్వ ప్రభావానికి గురైనట్లు కనపడుతుంది. ఈ అభిప్రాయాన్ని పూర్తిగా తోసిపుచ్చలేం. ఇతర రాష్రాలు ఎలా ఉన్నప్పటికీ తమిళనాడు, బెంగాల్ షెడ్యూల్ ప్రకటన చూసిన తరవాత ఈ అనుమానం బలపడక మానదు. 234 స్థానాలున్న తమిళనాడులో ఏకకాలంలో ఏప్రిల్ 6న ఎన్నికల నిర్వహణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సీఈసీ అంతకన్నా 60 సీట్లు ఎక్కువున్న బెంగాల్ లో ఎందుకు 8 దశలకు వెళ్లిందన్న ప్రశ్నకు సరైన సమాధానం దొరకదు. ఈ విషయంలో కేంద్రం ప్రభావానికి సీఈసీ లోనైందన్న విమర్శ, ఆరోపణ, అభిప్రాయం రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతోంది. ఇందులో సహేతుకత లేకపోలేదు.
బెంగాల్ లో పాగా వేసేందుకే…?
కేంద్రంలో చక్రం తిప్పుతున్న బీజేపీ ఈ దఫా బెంగాల్లో పాగా వేసేందుకు పట్టుదలతో పోరాడుతోంది. అక్కడి మమతా సర్కారును గద్దె దించేందుకు సర్వశక్తులూ ఒడ్డుతోంది. ఎక్కువ దశల్లో ఎన్నికల నిర్వహణ ద్వారా బెంగాల్ పై భాజపా పెద్దలు దృష్టి సారించడానికి అవకాశం ఉంటుంది. ప్రతి దశలో ప్రధాని మోదీ, పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా, హోంమంత్రి అమిత్ షా వంటి దిగ్గజాలు ప్రచారం చేసేందుకు అవకాశం కలుగుతుంది. క్షేత్రస్థాయిలో కార్యక ర్తలను మోహరించడానికి వీలు కలుగుతుంది. అందువల్లే బెంగాల్లో 8 దశల ఎన్నికలకు సీఈసీని కేంద్ర సర్కారు ప్రభావితం చేసిందన్న అభిప్రాయం ఢిల్లీ రాజకీయ వర్గాల్లో బలంగా వినపడుతోంది. అదే 234 సీట్లున్న తమిళనాడుపై భాజపాకు ఎలాంటి ఆశలు లేవు. అందువల్లే అక్కడ ఒకేదఫాలో ఎన్ని
కలకు ఈసీ వెళ్లిందన్న వాదన వినపడుతోంది.
పైకి శాంతిభద్రతలు అంటున్నా….?
పైకి మాత్రం బెంగాల్లో శాంతిభద్రతలు, అక్కడ నెలకొన్న సున్నిత పరిస్థితుల వల్లే 8 దశల్లో ఎన్నికలకువెళ్లామని ఈసీ చెబుతోంది. పైకి చెప్పడానికి ఇది బాగానే ఉన్నప్పటికీ అసలు కారణం మాత్రం రాజకీయమే. ఇక 126 సీట్లున్న అసోంలో అధికారాన్ని కాపాడుకోవడం బీజేపీకి కీలకం. అదే 140 సీట్లున్న దక్షిణాదిన కేరళపై కమలానికి ఎలాంటి ఆశలు లేవు. అందువల్లే అసోంలో మూడు దశల్లో ఎన్నికలు జరిపే విధంగా ఈసీపై కేంద్రం ప్రభావం చూపిందన్న అభిప్రాయం రాజకీయ వర్గాల్లో వినపడుతోంది. మూడు దశల్లో ఎన్నికల వల్ల యావత్ పార్టీ యంత్రాంగాన్ని ఈ ఈశాన్య భారత రాష్ర్టంలో మోహరించడానికి అవకాశం కలుగుతుంది. ఇప్పటికే మోదీ, షా, నడ్డా వంటి అతిరథ మహారథులు అసోం ను అనేకమార్లు చుట్టివచ్చారు. మూడు దశల ద్వారా వారికి మరింత అవకాశం కలుగుతుంది. మొత్తానికి బీజేపీ పెద్దలు ముందుచూపుతోనే ముందుకు సాగుతున్నట్లు స్పష్టమవుతోంది.
-ఎడిటోరియల్ డెస్క్