తమ్ముడు..తమ్ముడే.. పీకే కు జగన్ ఝలక్
ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ బీజేపీకి వ్యతిరేకంగా బలమైన కూటమిని ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతున్నారు. బీజేపీని వ్యతిరేకించే శక్తులన్నింటినీ కూడగట్టాలని నిర్ణయించుకున్నారు. వచ్చే లోక్ సభ ఎన్నికల్లో [more]
ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ బీజేపీకి వ్యతిరేకంగా బలమైన కూటమిని ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతున్నారు. బీజేపీని వ్యతిరేకించే శక్తులన్నింటినీ కూడగట్టాలని నిర్ణయించుకున్నారు. వచ్చే లోక్ సభ ఎన్నికల్లో [more]
ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ బీజేపీకి వ్యతిరేకంగా బలమైన కూటమిని ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతున్నారు. బీజేపీని వ్యతిరేకించే శక్తులన్నింటినీ కూడగట్టాలని నిర్ణయించుకున్నారు. వచ్చే లోక్ సభ ఎన్నికల్లో 400 పార్లమెంటు స్థానాలను గుర్తించి అక్కడ బీజేపీని అడ్డుకునే పార్టీలకు అన్ని రకాలుగా సాయం చేయాలన్నది పీకే ప్లాన్ గా ఉంది. అయితే దక్షిణాది రాష్ట్రాల్లో తాను వ్యూహకర్తగా ఉండి గెలిపించిన జగన్ ప్రశాంత్ కిషోర్ చెప్పినట్లు బీజేపీ వ్యతిరేక కూటమిలో చేరతారా? అన్నదే ప్రశ్న.
వైసీపీని గెలిపించినా…?
గత ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అఖండ మెజారిటీతో విజయం సాధించడానికి జగన్ కష్టంతో పాటు ప్రశాంత్ కిషోర్ వ్యూహం కూడా కారణం. ఇది ఎవరూ కాదనలేని వాస్తవం. అందుకే ప్రశాంత్ కిషోర్ అంటే జగన్ కు గౌరవం, అభిమానం. అయితే బీజేపీకి వ్యతిరేకంగా ఏర్పడనున్న కూటమిలో జగన్ చేరతారనుకోవడం అనుమానమే. ఎందుకంటే జగన్ కు బీజేపీ కంటే కాంగ్రెస్ శత్రువు. తనపై అక్రమ కేసులు బనాయించి 16 నెలల పాటు జైలులో ఉంచిన కాంగ్రెస్ తో జగన్ చేయి కలపరు.
ఆ డీల్ ముగిసినట్లే….
నిజానికి ప్రశాంత్ కిషోర్ ఎన్నికల వ్యూహకర్తగా జగన్ కు సాయం చేశారు. ఊరికే సాయం చేయలేదు. కోట్ల రూపాయల ఫీజు తీసుకుని ఎన్నికల వ్యూహాలను అందించారు. అంతటితో ఆ డీల్ పూర్తయింది. అయితే ఇప్పుడు మోదీకి, బీజేపీకి వ్యతిరేకంగా జగన్ ను కాంగ్రెస్ కూటమిలోకి రావాలని ప్రశాంత్ కిషోర్ వత్తిడి తెచ్చినా అది కుదరని పని. ఎందుకంటే జగన్ కు బీజేపీ లో తగిన గౌరవం, గుర్తింపు లభిస్తుంది.
అతి పెద్ద పార్టీగా….
వచ్చే ఎన్నికల్లో పూర్తి స్థాయి మెజారిటీ రాకపోయినా బీజేపీ ఏకైక అతి పెద్ద పార్టీగా రానుంది. దీనిని ఎవరూ కాదనలేరు. కాంగ్రెస్ నాయకత్వ సమస్యతో కొట్టుమిట్టాడుతుంది. ప్రాంతీయ పార్టీలది తలో దారి. అందుకే కిచిడీ ప్రభుత్వం ఏర్పడటం కష్టం. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే తనకు మళ్లీ సమస్య అవుతుందని జగన్ కు తెలియంది కాదు. అందుకే ప్రశాంత్ కిషోర్ తనకు బెస్ట్ ఫ్రెండ్ అయినా బీజేపీ వ్యతిరేక కూటమిలో చేరాలని వత్తిడి తెచ్చినా, జగన్ విషయంలో అది సాధ్యం కాదు.