ఆయన అనుకున్నది అనుకున్నట్లు జరిగితే?
70 మంది సభ్యులు గల ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ ఎన్నికల్లో తిరిగి అధికారంలోకి రావడానికి బీజేపీ ప్రయత్నిస్తుంది. ముఖ్యమంత్రి త్రివేంద్ర సింగ్ రావత్ నేతృత్వంలో [more]
70 మంది సభ్యులు గల ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ ఎన్నికల్లో తిరిగి అధికారంలోకి రావడానికి బీజేపీ ప్రయత్నిస్తుంది. ముఖ్యమంత్రి త్రివేంద్ర సింగ్ రావత్ నేతృత్వంలో [more]
70 మంది సభ్యులు గల ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ ఎన్నికల్లో తిరిగి అధికారంలోకి రావడానికి బీజేపీ ప్రయత్నిస్తుంది. ముఖ్యమంత్రి త్రివేంద్ర సింగ్ రావత్ నేతృత్వంలో ప్రభుత్వం తమ హయాంలో చేసిన అభివృద్ధి పనులు, సంక్షేమ కార్యక్రమాలు తమను ఒడ్డున పడేస్తాయని నమ్ముతున్నారు. మరోవైపు కాంగ్రెస్ కూడా ఈ చిన్న రాష్ట్రంలో అధికారంలోకి తిరిగి రావాలని కోరుకుంటోంది. అయితే తాజాగా ఆమ్ ఆద్మీ పార్టీ కూడా ఉత్తరాఖండ్ లో పోటీ చేస్తుందని అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించారు.
త్వరలోనే ఎన్నికలు…..
ఉత్తరాఖండ్ రాష్ట్రంలో త్వరలోనే ఎన్నికలు జరగనున్నాయి. కాంగ్రెస్, బీజేపీ కూటముల మధ్య ప్రధాన పోటీ ఉంటుంది. అయితే తాజాగా అరవింద్ కేజ్రీవాల్ పోటీకి దిగుతామని ప్రకటించడంతో త్రిముఖ పోటీ నెలకొనే అవకాశముంది. అయితే ఇప్పటికే పంజాబ్, గోవా రాష్ట్రాల్లో కొంత ఎదురు దెబ్బలు తగలడంతో ఉత్తరాఖండ్ విషయంలో అరవింద్ కేజ్రీవాల్ ముందు జాగ్రత్తగా సర్వే చేయించారంటున్నారు. ఈ సర్వేలో 62 శాతం మంది ప్రజలు ఆమ్ ఆద్మీ పార్టీ పోటీ చేయాలని కోరుకోవడంతోనే అరవింద్ కేజ్రీవాల్ ఈ నిర్ణయాన్ని ప్రకటించారంటున్నారు.
ఢిల్లీ స్థాయిలో అభివృద్ధి…..
తాము విజయం సాధిస్తే ఢిల్లీలో చేసిన అభివృద్ధిని చేసి చూపిస్తామని కేజ్రీవాల్ చెబుుతన్నారు. ప్రధానంగా ఉత్తరాంఖండ్ లో దశాబ్దాలుగా నెలకొన్న నిరుద్యోగం, విద్య, వైద్యం వంటి రంగాలను మెరుగుపరుస్తామని కేజ్రీవాల్ పార్టీ హామీ ఇస్తుంది. దశాబ్దకాలాల నుంచి ఈ రంగాలు పూర్తిగా నిర్లక్ష్యం చేయబడ్డాయని అరవింద్ కేజ్రీవాల్ చెప్పారు. ఖచ్చితంగా ఉత్తరాఖండ్ లో తాము విజయం సాధిస్తామన్న ఆశాభావంతో అరవింద్ కేజ్రీవాల్ ఉన్నారు.
గోవా తరహా అవమానం……
అయితే గతంలో పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో 20 స్థానాలను గెలుచుకుంది. పార్లమెంటు ఎన్నికల్లో ఒక్క స్థానానికే పరిమితమయింది. కానీ గోవా రాష్ట్రంలో డిపాజిట్లు కూడా ఆమ్ ఆద్మీ పార్టీకి దక్కలేదు. గోవా పరిణామాలు ఉత్తరాఖండ్ లో రిపీట్ కాకుండా ముందుగానే కేజ్రీవాల్ సర్వే చేయించి తమకు అనుకూలంగా ఉందని తేలిన తర్వాతనే బరిలోకి దిగుతున్నారన్నది స్పష్టమయింది. ఢిల్లీ మోడల్ అభివృద్ధినే తాము ప్రచారం చేస్తామని ఆ పార్టీ ఉత్తరాఖండ్ ఇన్ ఛార్జి దినేష మొహానియా తెలిపారు. మొత్తం మీద కేజ్రీవాల్ ఉత్తరాఖండ్ మీద కన్నేశారు. మరి ఫలితాలు ఎలా ఉంటాయో చూడాలి.