telangana : ఇన్ని పార్టీలు ఇక్కడ అవసరమా?
తెలంగాణ లో రాజకీయ శూన్యత ఉందా? మరో పార్టీ అవసరం ఇక్కడ ఉందా? అధికార టీఆర్ఎస్ కు సరైన ప్రత్యామ్నాయం లేదా? ఇవన్నీ ప్రశ్నలే. వీటికి జవాబులు [more]
తెలంగాణ లో రాజకీయ శూన్యత ఉందా? మరో పార్టీ అవసరం ఇక్కడ ఉందా? అధికార టీఆర్ఎస్ కు సరైన ప్రత్యామ్నాయం లేదా? ఇవన్నీ ప్రశ్నలే. వీటికి జవాబులు [more]
తెలంగాణ లో రాజకీయ శూన్యత ఉందా? మరో పార్టీ అవసరం ఇక్కడ ఉందా? అధికార టీఆర్ఎస్ కు సరైన ప్రత్యామ్నాయం లేదా? ఇవన్నీ ప్రశ్నలే. వీటికి జవాబులు మాత్రం కష్టం. కాంగ్రెస్ కోలుకోలేదు. దానిని జనం నమ్మే అవకాశం లేదు. బీజేపీని ప్రజలు ప్రత్యామ్నాయంగా చూడటం లేదు. ఇక వైఎస్సార్టీపీ వంటి పార్టీలను కూడా ప్రజలు పెద్దగా పరిగణనలోకి తీసుకోరు. ఈ నేపథ్యంలో మరో కొత్త పార్టీ పుట్టుకొస్తుందన్న ప్రచారం జోరుగా సాగుతోంది.
ఎన్నికల ముంగిట…
తెలంగాణలో కొత్త పార్టీలు పుట్టుకు రావడం కొత్తేమీ కాదు. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం నుంచి అనేక పార్టీలు వచ్చాయి. తెలంగాణ ఉద్యమంలో కీలక భూమిక పోషించిన ప్రొఫెసర్ కోదండరామ్ తెలంగాణ జనసమితి పేరిట పార్టీ పెట్టారు. ఆయన పార్టీ ఒక్క స్థానాన్ని కూడా గెలుచుకోలేకపోయింది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆయనే స్వయంగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఇక వైఎస్ షర్మిల వైఎస్సార్టీపీ పేరుతో కొత్త పార్టీ పెట్టి 119 నియోజకవర్గాల్లో పోటీకి దిగుతామంటున్నారు.
కొత్త పార్టీని…
తాజాగా మాజీ పార్లమెంటు సభ్యుడు కొత్త పార్టీ పేరిట తెరమీదకు రాబోతున్నారన్న వార్తలు వస్తున్నాయి. ఆయన టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలో చేరి బయటకు వచ్చారు. బీజేపీలో చేరేందుకు ఇష్టపడటం లేదు. ఈ నేపథ్యంలో మరో రాష్ట్రంలో ఉన్న ప్రాంతీయ పార్టీ శాఖను ఇక్కడ ప్రారంభించాలన్న ప్రయత్నంలో ఉన్నారు. దానివల్ల పార్టీ పరంగా ఆర్థిక ఇబ్బందులు పెద్దగా ఉండవు. గుర్తు సమస్య ఉండదు. అందుకే మరో రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీ శాఖను తెలంగాణలో పెట్టేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.
ఇతర పార్టీలు ఇక్కడ….
గతంలోనూ ఇక్కడ కొన్ని స్థానాలను ఇతర రాష్ట్రాల పార్టీలు తెలంగాణలో సొంతం చేసుకున్నాయి. సంజయ్ విచార్ మంచ్ 1980 వ దశకంలోనే సీటు సాధించుకుంది. ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలోని బీఎస్పీ అనేక సార్లు ఇక్కడ గెలుచుకుంది. సమాజ్ వాదీ పార్టీ తరుపున కూడా ఇక్కడ అభ్యర్థులు పోటీ చేయడం ఆనవాయితీగా వస్తుంది. అదే బాటలో ఇప్పుడు ఉత్తర భారతానికి చెందిన ఒక పార్టీ శాఖను తెలంగాణలో కూడా ప్రారంభించేందుకు సన్నాహాలు పూర్తయ్యాయి. ఈ పార్టీ వల్ల కేసీఆర్ కు లాభమా? నష్టమా? అన్నది తేలాల్సి ఉంది.