కొన్ని అంతేబాస్.. అడక్కూడదు.. వైసీపీ నేతల గుసగుస
రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందనే విషయం ఎవరూ ఊహించలేదు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తప్పులుగా అనిపించిన, కనిపించిన విషయాలు.. తర్వాత పరిణామ క్రమంలో అధికారంలోకి వచ్చినప్పు డు ఒప్పులుగా [more]
రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందనే విషయం ఎవరూ ఊహించలేదు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తప్పులుగా అనిపించిన, కనిపించిన విషయాలు.. తర్వాత పరిణామ క్రమంలో అధికారంలోకి వచ్చినప్పు డు ఒప్పులుగా [more]
రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందనే విషయం ఎవరూ ఊహించలేదు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తప్పులుగా అనిపించిన, కనిపించిన విషయాలు.. తర్వాత పరిణామ క్రమంలో అధికారంలోకి వచ్చినప్పు డు ఒప్పులుగా అనిపించవచ్చు. అయితే.. ఈ విషయాలపై ప్రతిపక్షాలు మళ్లీ రాద్ధాంతం చేయనూ వచ్చు. ఇక, అదేసమయంలో ఒకింత పారదర్శకంగా ఉండే.. ఎమ్మెల్యేలు కానీ.. ఎంపీలు కానీ..(చాలా తక్కువ మందే ఉన్నారు) 'గతంలో ఇలా చేసినందుకు మనమే విమర్శించాం.. ఇప్పుడు అదే తప్పును మనం ఎలా చేస్తాం“ అని అంటున్నారు. ఇంతకీ ఈ చర్చ అధికార పార్టీ వైసీపీలోనే జరుగుతుండడం గమనార్హం.
అంచనాలను పెంచి….
అయితే.. వీరు కూడా చాలా జాగ్రత్తగా ఆచితూచి వ్యవహరిస్తున్నారు. ఎక్కడా బయటపడడం లేదు. సరే. ఇంతకీ విషయం ఏంటంటే.. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి రాత్రికి రాత్రి రూ.2500 కోట్ల మేరకు అం చనాలు పెంచారు. వాస్తవానికి పోలవరం ప్రాజెక్టును పాడి గేదె మాదిరిగా టీడీపీ భావించిందని.. అంచనాలను ఎప్పటికప్పుడు పెంచుకుని, భారీ ఎత్తున లంచాలు, కమీషన్లు పిండుకున్నారని.. ఆరోపణలు చేసిన వైసీపీ పెద్దలు.. దీనిని ప్రజల్లోకి కూడా భారీ ఎత్తున తీసుకువెళ్లారు. అయితే.. ఇప్పుడు మాత్రం అదే పెద్దలు.. పోలవరం ప్రాజెక్టు విషయంలో ద్వంద్వం ప్రమాణాలు పాటిస్తున్నారని.. ఇటీవల మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు తీవ్రస్థాయిలో దుయ్యబట్టారు.
అన్నింటా దోపిడీనే….
తాము రివర్స్ టెండరింగ్ పద్దతి లో కొత్తగా టెండర్లు పిలిచి పోలవరంలో రూ.750 కోట్లు ఆదా చేశామని బీరాలు పలికాడు. ఇప్పుడు తానే రూ.3,200 కోట్ల మేర అంచనాలు పెంచుతూ రాత్రికి రాత్రి జీవో ఇచ్చేశాడు. అడ్డగోలుగా దోచుకుతినడానికే ఈ వ్యవహారం. ఇప్పటికే మద్యం, ఇసుక, మట్టి, సిమెంట్ సహా దేనినీ వదలకుండా వేల కోట్ల మేర దోచుకుంటున్నారు. విశాఖలో భూములు కొట్టేశారు. తిరుపతిలో స్వామివారి భూములు మింగేశారు. ఇంకా చాలడం లేదా? చివరకు ప్రజలకు ప్రాణాధారమైన పోలవరం కూడా మింగాలా అని అయ్యన్న వ్యాఖ్యలు చేశారు.
వారంతా మౌనంగా…?
యితే.. ఎంతైనా.. సొంత పార్టీని విమర్శించిన నేపథ్యంలో కొందరు ఎమ్మెల్యేలు వాటికి కౌంటర్లు ఇవ్వాలని అనుకున్నారు. కానీ, ఎవరికి వారు మౌనంగా ఉన్నారు. దీనికి ప్రధాన కారణం.. రివర్స్ టెండరింగ్ తో రు. 750 కోట్లు ఆదా చేశామని గొప్పలు చెప్పిన ప్రభుత్వం 3200 కోట్ల మేరకు అంచనాలు పెంచిన విషయం వాస్తవం. దీంతో.. పారదర్శకంగా ఉండే ఎమ్మెల్యేలు.. అంటే.. వితండ వాదం చేయని వారు.. ఈ విషయంలో జోక్యం చేసుకునేందుకు ముందుకు రాలేక పోయారు. దీనికితోడు.. ఇలాంటి వారు.. ఎవరైనా.. నోరు విప్పుతారేమోనని.. ముందుగానే.. ఓ పెద్ద సలహాదారు.. విశాఖ, కృష్ణాజిల్లాల ఎమ్మెల్యేలకు, ఎంపీలకు ఫోన్ చేసి.. ' కొన్ని విషయాలు అంతే.. మీరు మాట్లాడొద్దు!' అని సూటిగా.. సుత్తిలేకుండా చెప్పేశారట. ఇదీ.. సంగతి!!