ఈటెల… అప్ సెట్ అయ్యారా..?
2001లో తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభించినప్పుడు కేసీఆర్ తో ఉన్న కొంతమందిలో ఈటెల రాజేందర్ ఒకరు. టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం నుంచీ ఆయన కేసీఆర్ వెన్నంటే ఉన్నారు. పార్టీ [more]
2001లో తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభించినప్పుడు కేసీఆర్ తో ఉన్న కొంతమందిలో ఈటెల రాజేందర్ ఒకరు. టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం నుంచీ ఆయన కేసీఆర్ వెన్నంటే ఉన్నారు. పార్టీ [more]
2001లో తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభించినప్పుడు కేసీఆర్ తో ఉన్న కొంతమందిలో ఈటెల రాజేందర్ ఒకరు. టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం నుంచీ ఆయన కేసీఆర్ వెన్నంటే ఉన్నారు. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు పార్టీ తరపున బలమైన గొంతుక వినిపించారు. 2014కి ముందు టీఆర్ఎస్ శాసనసభా పక్ష నేతగా కూడా ఉన్నారు. టీఆర్ఎస్ లోని ముఖ్య నేతల్లో ఒకరిగా ఉన్న ఈటెల రాజేందర్ ఇప్పుడు కొంత అసంతృప్తితో ఉన్నారనే ప్రచారం జరుగుతుంది. ముఖ్యంగా ఆయన రెండు విషయాల్లో అధినేత వైఖరిపై నొచ్చుకున్నారని అంటున్నారు. అందుకే ఆయన ప్రగతి భవన్ కి, తెలంగాణ భవన్ కి కొంత దూరం మెయింటైన్ చెస్తున్నట్లు తెలుస్తోంది.
స్పీకర్ పదవి ఇస్తారనే ప్రచారంతో…
గత క్యాబినెట్ లో ఈటెల రాజేందర్ కి ముఖ్యమంత్రి కేసీఆర్ మంచి ప్రాధాన్యతనే ఇచ్చారు. ఆయనకు ఆర్థిక శాఖ మంత్రిగా అవకాశం కల్పించారు. ఆయన పనితీరుకు కూడా ముఖ్యమంత్రి అనేక సార్లు మంచి మార్కులే వేశారు. ఇక, హుజురాబాద్ నుంచి ఈ ఎన్నికల్లోనూ భారీ మెజారిటీతో గెలిచిన ఈటెల రాజేందర్ కి ఈసారి మంత్రి పదవి దక్కుతుందా లేదా అనే అనుమానాలు వస్తున్నాయి. ముఖ్యంగా ఈటెల రాజేందర్ కి ఈసారి స్పీకర్ పదవి అప్పగిస్తారనే ప్రచారం బాగా జరిగింది. వరుసగా ఐదుసార్లు గెలిచిన ఈటెలను స్పీకర్ ను చేసే ఆలోచనలో కేసీఆర్ ఉన్నట్లు చెప్పారు. దీంతో ఈ ప్రచారం పట్ల ఈటెల రాజేందర్ కొంత అసంతృప్తితో ఉన్నరని అంటున్నారు. మంత్రి పదవిపైనే ఎక్కువగా ఆశలు పెట్టుకున్న ఈటెలకు స్పీకర్ పదవిపై ఆంతగా ఆసక్తి చూపించడం లేదని అంటున్నారు.
జిల్లా ఏర్పాటు కాకపోవడంతో…
ఇక, జిల్లాల ఏర్పాటు విషయంలోనూ ఈటెల రాజేందర్ కొంత అసంతృప్తితో ఉన్నారంటున్నారు. రెండేళ్ల క్రితం కొత్త జిల్లాల ఏర్పాటు సమయంలో ఈటెల రాజేందర్ ప్రతినిథ్యం వహిస్తున్న హుజురాబాద్ జిల్లాగా ఏర్పాటు కాలేదు. అదే సమయంలో టీఆర్ఎస్ ముఖ్యులు ప్రతినిథ్యం వహిస్తున్న నియోజకవర్గ కేంద్రాలు ప్రత్యేక జిల్లాలుగా మారాయి. ఇక, ఇటీవల కూడా డిమాండ్లు ఉన్న నారాయణపేట, ములుగు జిల్లాలు ఏర్పాటు చేసేందుకు కేసీఆర్ నిర్ణయించారు. ఇదే సమయంలో హుజురాబాద్ జిల్లా ఏర్పాటుపై ఎటువంటి నిర్ణయమూ తీసుకోలేదు. ఇక, హుజురాబాద్ జిల్లాగా ఏర్పాటు చేయాలనే డిమాండ్ కూడా మళ్లీ మొదలైంది.
కేసీఆర్ టూర్ లో మిస్సింగ్
హుజురాబాద్, హుస్నాబాద్ నియోజకవర్గాలను కలిపి ప్రత్యేక జిల్లాగా ఏర్పాటు చేయాలనే డిమాండ్ తెరపైకి వచ్చింది. దీంతో ఇది ఈటెల రాజేందర్ కు స్వంత నియోజకవర్గంలో కొంత ఇబ్బందికరంగా మారింది. ఈటెల తన నియోజకవర్గాన్ని జిల్లా చేసుకోలేకపోయారనే ఒక ఆరోపణ కూడా వస్తోంది. ఈ రెండు అంశాలు ఈటెల రాజేందర్ ను బాగానే ఇబ్బంది పెడుతున్నాయట. దీంతో ఆయన ప్రగతి భవన్, తెలంగాణ భవన్ కి దూరంగా ఉంటున్నారని అంటున్నారు. ఇటీవల ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ముఖ్యమంత్రి కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టుల సందర్శనకు వెళ్లినప్పుడు కూడా ఈటెల రాజేందర్ లేరు. మరి, ఈటెల రాజేందర్ అసంతృప్తిని కేసీఆర్ ఎలా తొలగిస్తారో చూడాలి.