గాంధీలకే నమ్మకం కలిగించాడుగా ?
గాంధీల పార్టీ కాంగ్రెస్. వారు పేర్లు లేకపోతే అది ఎపుడో చీలికలు, పేలికలు అయ్యేది. ఇప్పటికి అయిదవ తరం కాంగ్రెస్ ని ఏలుతోంది. రాజ్యాలు ఉన్నా పోయినా [more]
గాంధీల పార్టీ కాంగ్రెస్. వారు పేర్లు లేకపోతే అది ఎపుడో చీలికలు, పేలికలు అయ్యేది. ఇప్పటికి అయిదవ తరం కాంగ్రెస్ ని ఏలుతోంది. రాజ్యాలు ఉన్నా పోయినా [more]
గాంధీల పార్టీ కాంగ్రెస్. వారు పేర్లు లేకపోతే అది ఎపుడో చీలికలు, పేలికలు అయ్యేది. ఇప్పటికి అయిదవ తరం కాంగ్రెస్ ని ఏలుతోంది. రాజ్యాలు ఉన్నా పోయినా బేఖాతర్ కాంగ్రెస్ పార్టీ ఉంటే చాలు. అది కూడా ఎన్ని రాష్ట్రాల్లో ఉందని అడగవద్దు. ఎలా ఉన్నా ఫర్వాలేదు. దానికి జాతీయ నాయకత్వం మాత్రం గాంధీ కుటుంబానిదే. వద్దు అంటున్నా వారినే పట్టుకుని వేలాడుతారు నాయకులు. దాంతో వారికే పెత్తనం దక్కుతోంది. సరే దేశంలో రాజకీయాలు తమకు అనుకూలమా ప్రతికూలమా అని పరిశీలించి పార్టీని చక్కదిద్దుకునే తీరిక, ఓపిక గాంధీలకు లేదంటే అది పచ్చి వాస్తవమేమో.
షాక్ ఇచ్చేశారుగా…?
కాంగ్రెస్ పార్టీ ఏపీలో అధికారికంగా భూస్థాపితం అయి ఇప్పటికి అక్షరాలా ఆరున్నర సంవత్సరాలు. కాంగ్రెస్ తిరిగి కోలుకుంటుందని ఎవరికీ నమ్మకాలు లేవు. కాంగ్రెస్ ని చరిత్రలో చూసుకోవడమే అని కూడా సోషల్ మీడియాలో జోకులు పేల్చే సీన్ ఉంది. అంటువంటి కాంగ్రెస్ పార్టీలో తీసివేతలు అన్నీ కూడా పూర్తి అయిపోయాయి. ఇక ఉన్న అరకొర బ్యాచ్ కి రాజకీయాల మీదనే విరక్తి కలిగి వేరే పనుల్లో బిజీగా ఉన్నారు. అలాంటి పార్టీలో చేరికలు అంటే వింతల్లో కెల్లా వింత. కానీ అద్భుతాలు ఒక్క రాజకీయాల్లోనే జరుగుతాయి అని మాజీ ఎంపీ జీవీ హర్ష కుమార్ నిరూపించారు. ఆయన తాను కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నానని చెప్పి పార్టీ పెద్దలకే షాక్ ఇచ్చేశాడు.
దళితుల పార్టీగా…..
కాంగ్రెస్ దళితుల పార్టీ అని హర్ష కుమార్ అంటున్నారు. అటువంటి పార్టీ దేశంలో మరోటి లేదని కూడా చెబుతున్నారు. దేశంలో దళితుల మీద అత్యాచారాలు బీజేపీ హయాంలో బాగా పెరిగిపోయాయని కూడా ఆయన అంటున్నారు. ఈ నేపధ్యంలో కాంగ్రెస్ ఒక్కటే దళితుల ప్రయోజనాలను కాపాడగలదని కూడా ఆయన నమ్మకంగా నొక్కి వక్కాణిస్తున్నారు. ఏపీ కూడా దళితుల మీద దాడులలో దేశంలో రెండవ స్థానంలో ఉందని హర్షకుమార్ అతి పెద్ద ఆరోపణే చేస్తున్నారు. అందువల్ల తాను కాంగ్రెస్ లో చేరి ఏపీ దళితుల తరఫున పోరాడుతాను అంటున్నారు. రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీల నాయకత్వంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని కూడా ఆయన ధీమా వ్యక్తం చేస్తున్నారు.
వదిలేసిన చోటనే….
ఏపీలో కాంగ్రెస్ పార్టీని పట్టించుకోవడం ఎపుడో గాంధీలు మరచిపోయారు. అక్కడ గత ఏడాది 151 సీట్లతో వైసీపీ అధికారంలోకి వచ్చాక కూడా బీజేపీ అయినా మళ్ళీ తన వంతు ప్రయత్నం చేసుకుంటోంది కానీ కాంగ్రెస్ లో ఎలాంటి కదలిక కూడా లేదు. కానీ ఇపుడు అర్జంటుగా హర్ష కుమార్ ఢిల్లీ గాంధీలకే అతి పెద్ద నమ్మకాన్ని అరువిచ్చాడు. ఏపీ ఏడారి కాదు, మళ్ళీ కాంగ్రెస్ పువ్వులు పూయవచ్చు. గుర్రం ఎగరావచ్చు అని ఆయన ఆశలు కలిగిస్తున్నారు. మరి దళితులలో కాస్తా పేరున్న నోరున్న మాజీ ఎంపీ హర్షకుమార్ కాంగ్రెస్ లో చేరుతానని ముందుకు రావడం శుభ పరిణామమే కదా. ఇప్పటికైనా గాంధీలు ఏపీ వైపు కన్నెత్తి చూస్తారా.