పళని స్వామి చేతులెత్తేసినట్లేనా?
తమిళనాడు ప్రభుత్వం పూర్తిగా చేతులెత్తేసింది. దేశ వ్యాప్తంగా ఐదో విడత లాక్ డౌన్ అమలులో ఉన్నా మినహాయింపులు కూడా అధికంగానే ఉన్నాయి. బార్లు, మెట్రో రైళ్లు తప్ప [more]
తమిళనాడు ప్రభుత్వం పూర్తిగా చేతులెత్తేసింది. దేశ వ్యాప్తంగా ఐదో విడత లాక్ డౌన్ అమలులో ఉన్నా మినహాయింపులు కూడా అధికంగానే ఉన్నాయి. బార్లు, మెట్రో రైళ్లు తప్ప [more]
తమిళనాడు ప్రభుత్వం పూర్తిగా చేతులెత్తేసింది. దేశ వ్యాప్తంగా ఐదో విడత లాక్ డౌన్ అమలులో ఉన్నా మినహాయింపులు కూడా అధికంగానే ఉన్నాయి. బార్లు, మెట్రో రైళ్లు తప్ప అన్ని చోట్ల వ్యాపార కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి. అయితే తమిళనాడులో మాత్రం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య ఆగడం లేదు. తమిళనాడులో కరోనా వ్యాప్తి చెందడానికి లాక్ డౌన్ నిబంధనలను ప్రజలు పట్టించుకోక పోవడమే కారణమంటున్నారు. అలాగే సామాజిక వ్యాప్తి కూడా కారణమన్న సంకేతాలు ఉన్నాయి.
మరోసారి లాక్ డౌన్….
ఈ నేపథ్యంలో తమిళనాడులో మరోసారి లాక్ డౌన్ విధించాలని ప్రభుత్వంనిర్ణయించింది. తొలుత నాలుగు జిల్లాల్లో లాక్ డౌన్ ను సంపూర్ణంగా విధించాలని తమిళనాడు మంత్రి వర్గం నిర్ణయం తీసుకుంది. తమిళనాడులోని చెన్నై, కంచి, చంగల్ పట్టు, తిరువెళ్లూరు జిల్లాల్లో ఈ నెల 30వ తేదీ వరకూ లాక్ డౌన్ ను విధించాలని నిర్ణయం తీసుకుంది. ఈ నాలుగు జిల్లాల్లోనే కరోనా వైరస్ ఎక్కువగా ఉంది.
యాభై వేలకు చేరువలో…
తమిళనాడులో కరోనా వైరస్ కేసుల సంఖ్య యాభై వేలకు చేరువలో ఉంది. రోజుకు రెండు వేల కేసులు తగ్గకుండా నమోదవుతుండటం ఆందోళన కల్గిస్తుంది. ఈ నాలుగు జిల్లాల్లో అన్ని కార్యకలాపాలను నిలిపివేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. లాక్ డౌన్ అమలులో ఉన్న జిల్లాల్లో కేవలం మధ్యాహ్నం రెండు గంటల వరకే నిత్యావసర వస్తువుల కొనుగోళ్లకు అనుమతిస్తారు. మిగిలిన సమయంలో కర్ఫ్యూ అమలులో ఉంటుంది.
వైరస్ విజృంభిస్తుండటంతో….
ఇక హోటళ్లు, రెస్టారెంట్లు కూడా మూసిివేయాల్సి ఉంటుంది. అయితే పార్సిళ్లకు మాత్రం అనుమతి ఇస్తారు. తమిళనాడులో ప్రస్తుతం యాభై వేల కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అందులో అత్యధిక భాగం చెన్నైలోనే ఉన్నాయి. చెన్నైలోనే ఇరవై ఐదు వేల కేసులు ఉన్నాయి. కరోనా కారణంగా తమిళనాడులో దాదాపు 450 మంది చనిపోయారు. దీంతో తమిళనాడు ప్రభుత్వం మరోసారి లాక్ డౌన్ విధించడం దేశ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది.