అంతా వ్యూహం ప్రకారమే.. ఎటువంటి ఇబ్బంది లేకుండా?
శాసనమండలిలో బిల్లులు ఆమోదం పొందకపోయినా పెద్దగా ప్రభుత్వానికి వచ్చిన నష్టమేమీ లేదంటున్నారు నిపుణులు. రాజ్యాంగం ప్రకారం ద్రవ్య వినిమయ బిల్లు శాసనమండలిలో ఆమోదం పొందకపోయినా 14 రోజుల్లో [more]
శాసనమండలిలో బిల్లులు ఆమోదం పొందకపోయినా పెద్దగా ప్రభుత్వానికి వచ్చిన నష్టమేమీ లేదంటున్నారు నిపుణులు. రాజ్యాంగం ప్రకారం ద్రవ్య వినిమయ బిల్లు శాసనమండలిలో ఆమోదం పొందకపోయినా 14 రోజుల్లో [more]
శాసనమండలిలో బిల్లులు ఆమోదం పొందకపోయినా పెద్దగా ప్రభుత్వానికి వచ్చిన నష్టమేమీ లేదంటున్నారు నిపుణులు. రాజ్యాంగం ప్రకారం ద్రవ్య వినిమయ బిల్లు శాసనమండలిలో ఆమోదం పొందకపోయినా 14 రోజుల్లో ఆమోదం దానికదే పొందుతుందంటుననారు. అంటే వచ్చే నెల జీతాలు రెండు రోజులు ఆలస్యమవుతాయన్నది అంచనా. ప్రభుత్వోద్యోగులకు ఒకటో తేదీ వచ్చే జీతం మూడో తేదీ వస్తుందన్న మాట.
జీతాలు రెండు రోజులు లేట్….
శాసనమండలిలో ద్రవ్యవినిమయ బిల్లుతో పాటు సీఆర్డీఏ రద్దు, మూడు రాజధానుల బిల్లులపై ఎటువంటి నిర్ణయం తీసుకోకుండానే నిరవధిక వాయిదా పడింది. అయితే ఇది రాజ్యాంగ సంక్షోభానికి దారి తీస్తుందని తొలుత భావించారు. కానీ రాజ్యాంగ నిపుణుల అభిప్రాయం ప్రకారం దీనివల్ల కేవలం కొద్ది రోజులు మాత్రమే ప్రభుత్వం ఇబ్బంది పడుతుందంటున్నారు. జీతాలకు ఎటువంటి ఇబ్బంది ఉండదని చెబుతున్నారు.
రాజధాని అంశం కూడా….
ిఇక సీఆర్డీఏ రద్దు, మూడు రాజధానుల ప్రతిపాదన బిల్లు సయితం ఆటోమేటిక్ గా నెల రోజుల తర్వాత ఆమోదం పొందినట్లేనని చెబుతున్నారు. అంటే వైసీపీ వ్యూహం ప్రకారమే ఈ రెండు బిల్లులను మళ్లీ చట్ట సభల్లోకి ప్రవేశ పెట్టిందని చెబుతున్నారు. శాసనమండలికి రెండోసారి బిల్లులు వెళితే దానిని ఆమోదించినా, ఆమోదించకపోయినా బిల్లులు చెల్లుబాటు అయినట్లేనని అంటున్నారు.
వచ్చే నెల చివరి వారంలో….
దీంతో మూడు రాజధానుల బిల్లు జులై చివరి వారంలో ఓకే అవుతుంది. అప్పటి నుంచి జగన్ రాజధాని తరలింపు ప్రక్రియను చేపడతారంటున్నారు. న్యాయస్థానంలోనూ ఇక ఎటువంటి ఇబ్బందులు ఉండవన్నది వైసీపీ నేతల అంచనాగా ఉంది. మొత్తం మీద మూడు నెలలు గ్యాప్ ఇచ్చిన తర్వాత జగన్ రాజధాని అమరావతి విషయంలో తీసుకున్న ఈ నిర్ణయం వర్క్ అవుట్ అవుతుందని చెబుతున్నారు.