తెలుగు రాష్ట్రాలు తొందర పడుతున్నాయా …?
కరోనా వీర విజృంభణ ఆగడం లేదు. ఆగస్టు, సెప్టెంబర్ లలో కరోనా ఒక రేంజ్ లో ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రతి ఒక్కరు మరింత [more]
కరోనా వీర విజృంభణ ఆగడం లేదు. ఆగస్టు, సెప్టెంబర్ లలో కరోనా ఒక రేంజ్ లో ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రతి ఒక్కరు మరింత [more]
కరోనా వీర విజృంభణ ఆగడం లేదు. ఆగస్టు, సెప్టెంబర్ లలో కరోనా ఒక రేంజ్ లో ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రతి ఒక్కరు మరింత అప్రమత్తంగా ఉండాలిసి ఉంది. అలాంటి పరిస్థితుల్లో తెలుగు రాష్ట్రాలు ఒక కీలక అంశంపై నిర్ణయం తీసుకోబోతుండటం ఆందోళన వ్యక్తం అవుతుంది. తెలుగు రాష్ట్రాల్లో సెప్టెంబర్ లో స్కూల్ బెల్స్ మోగించాలి అని ప్రభుత్వాలు కార్యాచరణ సిద్ధం చేస్తూ ఉండటమే ఇప్పుడు తల్లితండ్రుల్లో ఆందోళన పెంచుతుంది. ఇప్పటికే ఎపి లో వైఎస్ సర్కార్ సెప్టెంబర్ 5 నుంచి స్కూల్స్ రీ ఓపెన్ అని ప్రకటించేశారు. మరో పక్క తెలంగాణ సర్కార్ దీనిపై కుస్తీ పడుతుంది.
దక్షిణ కొరియా అనుభవాలు … ?
విద్యా సంస్థలను ప్రారంభిస్తే ఎలా ఉంటుంది అన్న అంశంలో దక్షిణ కొరియా లో చేదు అనుభవాలు హెచ్చరిస్తున్నాయి. తొందరపడి అక్కడ విద్యా సంస్థలను తెరిచిన ఫలితంగా కేసుల సంఖ్య ఒక్కసారిగా పెరిగింది. వైరస్ బారిన పడిన చిన్నారులు ఇళ్లల్లో పెద్ద వయసు ఉన్నవారికి ఇది అంటించడంతో వారు ప్రమాదాల్లో పడినట్లు దక్షిణ కొరియా చెప్పకనే చెప్పింది. సహజంగా చిన్నారుల్లో వ్యాధినిరోధక శక్తి బాగానే ఉంటుంది. అయితే వీరికి వైరస్ సోకితే విద్యార్థులు క్యారియర్స్ గా మారుతున్నారు.
విదేశాల్లోనే వెనకడుగు….
ఈ అనుభవాల రీత్యానే ప్రపంచ వ్యాప్తంగా ఏ దేశం స్కూల్స్ తెరిచే అంశంలో మాత్రం తొందరపాటు ప్రదర్శించడం లేదు. వైద్య సౌకర్యాల పరంగా భారత్ కన్నా ఎంతో ముందు ఉన్న విదేశాల్లో వెనుకడుగు వేస్తున్నా ఇక్కడ మాత్రం ఎందుకు తొందరపాటు అన్నదానిపై తీవ్ర చర్చే నడుస్తుంది. కేసుల సంఖ్య నిజంగానే తగ్గుముఖం పట్టాకా కార్యాచరణ చేయడంలో తప్పులేదని అయితే ముందుగానే హడావిడి చేయడం ఎవరికోసం అన్నదే ప్రశ్న. అందుకే పాఠశాలలు తిరిగి తెరిచే విషయంపై ప్రభుత్వాలు పునరాలోచించాలని నిపుణులు కోరుతున్నారు.