పైసా లేదు..పని చేయకుండా జీతాలు ఎలా?
మే 1వ తేదీ కార్మిక దినోత్సవం. ప్రతి ఏడాది ఆర్భాటంగా కార్మిక దినోత్సవం జరుపుకుంటాం. కానీ ఈ ఏడాది మాత్రం కరోనా వైరస్ కారణంగా కార్మికులు ఉపాధి [more]
మే 1వ తేదీ కార్మిక దినోత్సవం. ప్రతి ఏడాది ఆర్భాటంగా కార్మిక దినోత్సవం జరుపుకుంటాం. కానీ ఈ ఏడాది మాత్రం కరోనా వైరస్ కారణంగా కార్మికులు ఉపాధి [more]
మే 1వ తేదీ కార్మిక దినోత్సవం. ప్రతి ఏడాది ఆర్భాటంగా కార్మిక దినోత్సవం జరుపుకుంటాం. కానీ ఈ ఏడాది మాత్రం కరోనా వైరస్ కారణంగా కార్మికులు ఉపాధి లేక అవస్థలు పడుతున్నారు. ఫ్యాక్టరీలు మూత పడ్డాయి. షాపులు తెరవలేదు. వృత్తిపనికి చెక్ పడింది. ఇలా అన్ని రంగాలకు లాక్ డౌన్ చీకట్లు కమ్మేశాయి. ఇలాంటి పరిస్థితిలో నెల గడిచి అంతా రెండో మాసానికి వచ్చేశారు. ఇప్పుడు ప్రయివేట్ రంగాల్లో ఉన్నవారికి జీతాలు చెల్లించాలి. ఏ వ్యాపారం చేయకపోయినా తమపై ఆధారపడ్డ వారిని కష్టకాలంలో చూసుకోక తప్పదు. కనీసం 50 శాతం వేతనాలైనా ఇవ్వక తప్పదు. అద్దెలు కొంతకాలం వాయిదా వేసుకున్నా జీతాలే ఇప్పుడు యజమానులకు అసలు సిసలు పరీక్షను ముందు ఉంచాయి.
అప్పులు చేయాలిసిందే …?
ఇలాంటి దీనపరిస్థితుల్లో బ్యాంక్ లలో అప్పులకు వ్యాపార వర్గాలు క్యూ కట్టక తప్పదు. ఆర్ధికంగా మంచి స్థితిలో ఉన్నవారు సైతం వైరస్ దెబ్బతో కుదేలయిపోయారు. అందరికి గడ్డుకాలం దాపురించినప్పుడు బయట వడ్డీకి ఇచ్చేవారు వుండరు. అధిక వడ్డీలకు అప్పులు చెల్లించే సాహసం ఏ ఒక్కరు చేయలేరు. ఎందుకంటే లాక్ డౌన్ పూర్తిగా ఎత్తివేశాకా ఎవరి వ్యాపారాలు ఎలా సాగుతాయో అగమ్యగోచరంగానే ఉంది.
బ్యాంకింగ్ రంగమైనా?
ఇలాంటి దుస్థితిలో దేశంలో బ్యాంకింగ్ రంగమే ఆదుకోవాలిసిన బాధ్యత వుంది. అయితే దేశ బ్యాంకింగ్ రంగం ధృడంగా ఏమీ లేదు. మూడు వాయిదాలు చేసిన అప్పులపై మారటోరియం విధించడంతో బ్యాంక్ లకు రికవరీ శాతం ఢమాల్ మంది. అందువల్ల వారుకూడా విరివిగా అప్పులు ఇచ్చే మార్గం లేకుండా పోతుంది. ఈ పరిస్థితుల్లో కిం కర్తవ్యం అన్నదే ఇప్పుడు వ్యాపార, పారిశ్రామిక వర్గాలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తుంది. మరోవైపు ఉద్యోగులు తమకు జీతాలు చెల్లించాలని వత్తిడి తెస్తున్నారు. ఈ పరిస్థితుల్లో వ్యాపారులకు ఏం చేయాలో పాలుపోవడం లేదు.