ఫేక్ ఫార్మర్స్ దొరికితే చాలట
అమరావతి రాజధాని ప్రాంతంలో నిజమైన రైతులు ఎవరు ? వ్యాపారం కోసం పెట్టుబడులు పెట్టి రైతుల పేరిట వారినోట్లో మట్టి కొట్టింది ఎవరు ? ఇదే ఇప్పుడు [more]
అమరావతి రాజధాని ప్రాంతంలో నిజమైన రైతులు ఎవరు ? వ్యాపారం కోసం పెట్టుబడులు పెట్టి రైతుల పేరిట వారినోట్లో మట్టి కొట్టింది ఎవరు ? ఇదే ఇప్పుడు [more]
అమరావతి రాజధాని ప్రాంతంలో నిజమైన రైతులు ఎవరు ? వ్యాపారం కోసం పెట్టుబడులు పెట్టి రైతుల పేరిట వారినోట్లో మట్టి కొట్టింది ఎవరు ? ఇదే ఇప్పుడు వైసీపీ సర్కార్ కి ఛాలెంజ్ గా నిలిచిన అంశం. పాలు – నీరు వేరు చేస్తే రైతుల సమస్యకు పరిష్కారం లభించినట్లే అని జగన్ నియమించిన హై పవర్ కమిటీ భావిస్తుండటంతో దీనిపై కూడా టిడిపి పెద్ద ఎత్తున రచ్చ మొదలు పెట్టె అవకాశాలే కనిపిస్తున్నాయి. అమరావతిలో భూముల ధరలకు రెక్కలు వచ్చి తాము పెట్టిన పెట్టుబడికి పదింతలు సంపాదిద్దాం అన్న ఆశ పడేవారి కి మాత్రం చేదు గుళికలు మింగించాలన్నదే సర్కార్ లక్ష్యంగా పెట్టుకున్నట్లు స్పష్టం అవుతుంది.
ఆ లెక్కలు తీస్తారుట …
అమరావతిలో రాజధాని ప్రకటించకముందు అంటే 2014 లో భూములు కలిగి వున్న వారి చిట్టా విప్పే పనిలో ఇప్పటికే అధికార యంత్రాంగం పడింది. ఆ లెక్కలు తేలితే ప్రస్తుత రైతు ఉద్యమాన్ని చాలావరకు చల్లార్చాలని అలాగే ఇన్ సైడ్ ట్రేడింగ్ చేసిన వారు చేసే ఆందోళనకు విలువ ఇవ్వలిసిన పనిలేదన్నది సర్కారీ వ్యూహం గా తేలుతుంది. రైతులకు అభివృద్ధి చేసి ప్లాట్ లు అక్కడే ఇవ్వడం సాధ్యం కాదు కనుక వారికి నష్టం లేకుండా కోరిన న్యాయమైన కోర్కెలు తీర్చేందుకు కమిటీ సూచనలు చేసింది.
సీఆర్డీఏ ను రద్దు చేస్తే …
చంద్రబాబు ఏర్పాటు చేసిన సీఆర్డీఏ ను రద్దు చేస్తే సరిపోతుందని చట్టపరంగా వచ్చే ఇబ్బందులు తొలగిపోతాయని హై పవర్ కమిటీ సూచించినట్లు సమాచారం. అమరావతి అభివృద్ధి మండలి ని ఏర్పాటు చేసి ఆ ప్రాంతం పై ప్రత్యేక దృష్టి పెట్టాలని కమిటీ అభిప్రాయపడింది అంటున్నారు. అయితే రాజధానిలో ఆందోళన చేస్తున్న రైతులను పూర్తి స్థాయిలో బుజ్జగించే ఫార్ములా పై ఇంకా పూర్తి స్థాయిలో కసరత్తు సాగుతూనే వుంది. దీనికోసం మరికొన్ని సార్లు హై పవర్ కమిటీ భేటీ కావాలని నిర్ణయించడంతో త్వరలోనే జగన్ ఈ సమస్యకు పరిష్కారం కనిపెడతారా? లేక రాజకీయ ఎత్తుగడలకే ప్రాధాన్యం ఇస్తారా అన్నది వేచి చూడాలి.