ఫ్యామిలీ సర్కస్ కు చెక్ పెట్టారా?
నెల్లూరు జిల్లా రాజకీయాల్లో ఏమాత్రం మార్పు లేదు. నేతల మధ్య ఆధిపత్య పోరుకు ఏమాత్రం తెరపడలేదు. ఇన్నాళ్లూ నెల్లూరు జిల్లాను కొన్ని కుటుంబాలే శాసించాయి. కొన్నాళ్లు నేదురుమిల్లి [more]
నెల్లూరు జిల్లా రాజకీయాల్లో ఏమాత్రం మార్పు లేదు. నేతల మధ్య ఆధిపత్య పోరుకు ఏమాత్రం తెరపడలేదు. ఇన్నాళ్లూ నెల్లూరు జిల్లాను కొన్ని కుటుంబాలే శాసించాయి. కొన్నాళ్లు నేదురుమిల్లి [more]
నెల్లూరు జిల్లా రాజకీయాల్లో ఏమాత్రం మార్పు లేదు. నేతల మధ్య ఆధిపత్య పోరుకు ఏమాత్రం తెరపడలేదు. ఇన్నాళ్లూ నెల్లూరు జిల్లాను కొన్ని కుటుంబాలే శాసించాయి. కొన్నాళ్లు నేదురుమిల్లి ఆ తర్వాత నల్లపురెడ్డి, అనంతరం ఆనం… ఇలా కుటుంబాలు నెల్లూరు రాజకీయాలను శాసించాయి. ఏ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ ఆ కుటుంబాలు చెప్పిందే వేదంగా ఉండేది. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు నేదురుమిల్లి, ఆనం, టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు నల్లపురెడ్డి, సోమిరెడ్డి కుటుంబాలు ఆధిపత్యాన్ని ప్రదర్శించేవి.
కొన్ని కుటుంబాలు….
గత ప్రభుత్వ హయాంలోనూ సోమిరెడ్డిదే ఆధిపత్యంగా ఉండేది. అయితే ఇప్పుడు వైసీపీ అధికారంలోకి వచ్చని తర్వాత ఏ కుటుంబానికి ప్రాధాన్యత లేకుండా పోయింది. నిజానికి వైసీపీలోనే ఆనం కుటుంబం ఉంది. అయినా ఆనం రామనారాయణరెడ్డికి మంంత్రి పదవి దక్కలేదు. నల్లపురెడ్డి కుటుంబానికి చెందిన ప్రసన్న కుమార్ రెడ్డి సయితం ఎమ్మెల్యేగానే ఉన్నారు. దీంతో ఈ రెండు కుటుంబాలు తమ పార్టీ అధికారంలో ఉన్నా ప్రేక్షకపాత్రనే పోషిస్తున్నారు.
మేకపాటి పెద్దగా….
ఇక నెల్లూరు జిల్లాలో మంత్రులుగా మేకపాటి గౌతమ్ రెడ్డి, అనిల్ కుమార్ యాదవ్ లు ఉన్నారు. మేకపాటి కుటుంబం రాజకీయ ఆధిపత్యం కోసం పెద్దగా తాపత్రయ పడటం లేదు. ఇద్దరు ఎమ్మెల్యేలు ఆ కుటుంబం నుంచి ఉన్నప్పటికీ వారి పనేదో వారు చూసుకుంటున్నారు. నియోజకవర్గాలకే పరిమితమవుతున్నారు. జిల్లా రాజకీయాలను పట్టించుకోవడం లేదు. దీంతో అనిల్ కుమార్ యాదవ్ కొంత దూకుడుగా ఉన్నారు.
వీరిద్దరూ కలసి…..
నెల్లూరు జిల్లాలో కుటుంబాల ఆధిపత్యానికి చెక్ పెట్టేందుకు అనిల్ కుమార్ యాదవ్ తో పాటు ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిలు ఒక వర్గంగా ఏర్పడి జిల్లా రాజకీయాలను శాసిస్తున్నారనే చెప్పాలి. ఇప్పటికే నెల్లూరు పట్టణ, రూరల్ నియోజకవర్గాల నుంచి పెద్దయెత్తున టీడీపీ నేతలు చేర్చుకున్నారు. అంతేకాకుండా టీడీపీ సీనిియర్ నేత బీద మస్తాన్ రావును పార్టీలోకి తీసుకురావడం వెనక కూడా వీరి ప్రమేయం ఉందంటున్నారు. కాకాణి గోవర్థన్ రెడ్డి జిల్లా అధ్యక్షుడిగా ఉండటంతో పార్టీ కార్యాలయానికి కూడా వీరు వెళ్లడం లేదు. తమంతట తాము ప్రత్యేక వర్గంగా వీరిద్దరూ ప్రకటించుకున్నారన్న టాక్ పార్టీలోనే విన్పిస్తుంది. మొత్తం మీద నెల్లూరు జిల్లా వైసీపీలో మాత్రం విభేదాలు తగ్గకపోగా మరింత పెరగాయనే చెప్పాలి.