అక్కడ కూడా కవ్వింపు చర్యలేనా?
భారత్-చైనా సరిహద్దు వివాదం అనగానే ముందు గుర్తుకు వచ్చేది ఈశాన్య రాష్ట్రంలోని అరుణాచల్ ప్రదేశ్. ఇక్కడే ఇరు దేశాలను విభజించే వాస్తవాధీన రేఖ (ఎల్ ఏ సీ [more]
భారత్-చైనా సరిహద్దు వివాదం అనగానే ముందు గుర్తుకు వచ్చేది ఈశాన్య రాష్ట్రంలోని అరుణాచల్ ప్రదేశ్. ఇక్కడే ఇరు దేశాలను విభజించే వాస్తవాధీన రేఖ (ఎల్ ఏ సీ [more]
భారత్-చైనా సరిహద్దు వివాదం అనగానే ముందు గుర్తుకు వచ్చేది ఈశాన్య రాష్ట్రంలోని అరుణాచల్ ప్రదేశ్. ఇక్కడే ఇరు దేశాలను విభజించే వాస్తవాధీన రేఖ (ఎల్ ఏ సీ – లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్) ఉంది. దీనినే మక్ మహన్ లైన్ అని కూడా వ్యవహరిస్తారు. నాటి బ్రిటీష్ అధికారి ఉభయ దేశాలను విడదీస్తూ నిర్థరించిన ప్రాంతం కావడంతో ఆయన పేరుతోనూ పిలుస్తుంటారు. ఇది అత్యంత కీలకమైన సరిహద్దు. అందుకే ఎప్పుడూ వార్తల్లోకి ఎక్కుతూ ఉంటుంది. ఇరు దేశాల బలగాల మోహరింపు కూడా ఇక్కడే ఎక్కువగా ఉంటుంది.
దేశ సరిహద్దుల్లో……
అరుణాచల్ ప్రదేశ్ కాకుండా మరో నాలుగు భారత రాష్ట్రాలు చైనాతో సరిహద్దును పంచుకుంటున్నాయి. మొత్తం సుమారు 3,486 కిలోమీటర్ల సరిహద్దులో జమ్ము కశ్మీర్ అత్యధికంగా 1597 కిలోమీటర్ల సరిహద్దును కలిగి ఉంది. ఆ తరవాత అరుణాచల్ ప్రదేశ్ 1,126 కిలోమీటర్లు, సిక్కిం 220,ఉత్తరాఖండ్ 345, హిమాచల్ ప్రదేశ్ 200 కిలోమీటర్ల సరిహద్దును కలిగి ఉన్నాయి. ఉత్తరాఖండ్ రాష్ట్రం నేపాల్ తోనూ 275 కిలోమీటర్ల సరిహద్దును పంచుకుంటోంది. కశ్మీర్, అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దుల్లో డ్రాగన్ నిత్యం చొరబాట్లకు, కవ్వింపులకు పాల్పడుతుండటం తెలిసిందే. దీంతో భారత్ సైతం ఈ రెండు ప్రాంతాలపై ప్రత్యేకంగా శ్రద్ధ పెడుతుంటుంది. బలగాల మోహరింపు, సరిహద్దుల్లో రహదారుల నిర్మాణం, చిన్నపాటి విమానాశ్రయాల ఏర్పాటు, పటిష్టమైన గూడారాల నిర్మాణం వంటి మౌలిక సౌకర్యాల కల్పనపై దష్టి పెడుతుంది. మిగిలిన రాష్ట్రాల సరిహద్దులపై అంతగా అప్రమత్తత కనబరచదు.
అవకాశంగా తీసుకున్న చైనా….
దీనిని అవకాశంగా తీసుకుంటున్న డ్రాగన్ ఈ ప్రాంతాలలోనూ చిచ్చు పెట్టేందుకు పావులు కదుపుతుండటం తాజా పరిణామం. ఇది ఆందోళన కలిగించే అంశం. సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్ ల్లోని చైనా సరిహద్దులను తూర్పు లడాఖ్ అని, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్ల్లోని చైనా సరిహద్దును పశ్చిమ లడాఖ్ అని వ్యవహరిస్తారు. హిమాచల్ ప్రదేశ్ లోని ధర్మశాలలో బౌద్ధ గురువు దలైలమా నాయకత్వంలో ప్రవాస టిబెట్ ప్రభుత్వం పని చేస్తున్న విషయం తెలిసిందే. తూర్పు లడఖ్ ప్రాంతంలో గత ఆరు నెలలుగా భారీగా బలగాలను దింపి ఉద్రిక్తలకు కారణమైన చైనా తాజాగా ఉత్తరాఖండ్ సరిహద్దుల్లోనూ బలగాలను మోహరించి కవ్వింపు చర్యలకు పాల్పడుతోం ది. ఆ దేశానికి చెందిన 150 లైట్ కంబాట్ ఆర్స్మ్ బ్రిగేడ్కు చెందిన సైనికులు సరిహద్దుకు అతి చేరువలో గుడారాల ఏర్పాటు చేశారు. రాష్ట్రంలోని చమోలీ జిల్లా బరహోటి ప్రాంతంలో నూ చైనా సైనికుల సంచారం మొదలైంది. అక్కడే తిష్ట వేసేందుకు తగిన సౌకర్యాలపై చర్యలు తీసుకున్నారు. చంపో మైదాన్, జోజో గ్రామాల సమీపంలో చైనా నిర్మాణాలు చేపడుతోంది. ఈ గ్రామాలు ఉత్తరాఖండ్ లోని లిపూలేఖ్ కు కేవలం ఏడు కిలోమీటర్ల దూరంలోనే ఉండటం గమనార్హం. ఈ విషయాన్ని అక్కడి ప్రజలు పత్రికా ప్రతినిధులకు నేరుగా తెలియజేశారు.
చైనా సైనికుల సంచారంతో….
అయితే ఈ విషయం తమ దష్టికి రాలేదని చమోలీ జిల్లా అధికార యంత్రాంగం చెబుతోంది. మరోపక్క పితోర్ ఘర్ జిల్లాలోని లిపూలేఖ్ ప్రాంతంలోనూ చైనా సైనికుల సంచారం అధికమైంది. ఈ ప్రాంతం అటు చైనా, ఇటు నేపాల్ సరిహద్దులకు చేరువలో ఉంటుంది. ఈ ప్రాంతం తమదేనని ఇటీవల నేపాల్ హడావిడి చేసిన సంగతి తెలిసిందే. చైనా, నేపాల్, భారత్ కు కూడలిగా ఉండటంతో లిపూలేఖ్ ను ట్రై జంక్షన్ గా పిలుస్తంటారు. తాజాగా ఈ ప్రాంతాన్ని నేపాల్ తమ దేశ చిత్రపటంలో ముద్రించింది. పాఠ్యంశంలో భాగం చేసింది. చైనా దన్నే ఇందుకు కారణమని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
అడ్డుకట్ట వేసేందుకు…..
ఉత్తరాఖండ్ లోని మొత్తం 13 జిల్లాల్లో అయిదు చైనా, నేపాల్ తో సరిహద్దులు కలిగి ఉన్నాయి. చమోలీ, ఉత్తరకాశీ చైనాతో, ఉధంసింగ్ నగర్, చంపావత్, పితోర్ ఘర్ జిల్లాలు నేపాల్ తో సరిహద్దులు పంచుకుంటున్నాయి. నేపాల్ సరిహద్దుల్లో 130 పోస్టులు పని చేస్తున్నాయి. ఉత్తరాఖండ్ సరిహద్దుల్లో చైనా, నేపాల్ చర్యలను భారత్ గమనిస్తూనే ఉంది. వాటిని నియంత్రించేందుకు తగిన చర్యలు చేపడుతూనే ఉంది. ఇందులో భాగంగానే ఈ ఏడాది మే 8న రక్షణ మంత్రి రాజనాధ్ సింగ్ 80 కిలోమీటర్ల రహదారిని ఈ ప్రాంతంలో ప్రారంభించారు. సరిహద్దులకు త్వరగా చేరుకోవడానికి ఈ రహదారి ఉపయోగపడుతుంది. ఇంకా అదనపు బలగాల మోహరింపునకు, మౌలిక వసతుల కల్పనకు చర్యలు చేపడుతోంది. తద్వారా అటు నేపాల్, ఇటు చైనా దుందుడుకు చర్యలకు అడ్డుకట్ట వేయనుంది.
-ఎడిటోరియల్ డెస్క్