ఎప్పుడు…ఏమైనా జరగొచ్చా…?
నిజంగా కన్నడనాట రాజకీయ సంక్షోభం ఇంకా తొలగిపోలేదు. యడియూరప్ప ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసినప్పటికీ ఆయన బలపరీక్షలో నెగ్గేంతవరకూ సంక్షోభం సశేషమేనని చెప్పక తప్పదు. రాజకీయాల్లో ఎప్పుడు ఏదైనా [more]
నిజంగా కన్నడనాట రాజకీయ సంక్షోభం ఇంకా తొలగిపోలేదు. యడియూరప్ప ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసినప్పటికీ ఆయన బలపరీక్షలో నెగ్గేంతవరకూ సంక్షోభం సశేషమేనని చెప్పక తప్పదు. రాజకీయాల్లో ఎప్పుడు ఏదైనా [more]
నిజంగా కన్నడనాట రాజకీయ సంక్షోభం ఇంకా తొలగిపోలేదు. యడియూరప్ప ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసినప్పటికీ ఆయన బలపరీక్షలో నెగ్గేంతవరకూ సంక్షోభం సశేషమేనని చెప్పక తప్పదు. రాజకీయాల్లో ఎప్పుడు ఏదైనా జరగొచ్చన్న రీతిలో ఇప్పుడు కన్నడ రాజకీయాలు కొనసాగుతున్నాయి. నిన్నటి వరకూ మిత్రులుగా మిగిలిన వారు పాలిటిక్స్ లో క్షణాల్లో శత్రువులుగా మారతారు. ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి సయితం కాంగ్రెస్ పైన కసి తీర్చుకునే పనిలోనే ఉన్నారని చెబుతున్నారు.
ఆరు ఓట్ల తేడాతో….
కేవలం ఆరు ఓట్లతో ఓటమి పాలు కావడంతో కుమారస్వామి బాగా కుంగిపోయి ఉన్నారు. ఇందుకు ప్రధాన కారణం కాంగ్రెస్ నేతలే కావడంతో ఆయన కాంగ్రెస్ కు కటీఫ్ చెప్పాలన్న యోచనలోనే ఉన్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే ఇంకా నాలుగేళ్ల వరకూ ఎన్నికలకు సమయం ఉంది. కేంద్రంలోనూ కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేదు. ఇక్కడి కాంగ్రెస్ నేతలకు తనంటే గిట్టదు. గ్రూపుల గోలతో వారితో వెళ్లేకన్నా బీజేపీతో సఖ్యతగా ఉండటమే మేలన్నది ఆయన అభిప్రాయంగా విన్పిస్తుంది.
కటీఫ్ చెప్పేయాలని….
కుమారస్వామి జనతాదళ్ ఎస్ ఎమ్మెల్యేలతో భేటీ అయినప్పుడు కూడా ఎక్కువ మంది ఎమ్మెల్యేలు బీజేపీ తో సఖ్యతగా ఉండేందుకే మొగ్గు చూపినట్లు వార్తలు వస్తున్నాయి. అనవసరమైన ఇబ్బందులను ఎదుర్కొనేకంటే బీజేపీకి స్నేహ హస్తం అందించడమే మేలన్న అభిప్రాయాన్ని ఎక్కువ మంది జేడీఎస్ ఎమ్మెల్యేలు అభిప్రాయపడినట్లు తెలుస్తోంది. అయితే దీనిపై దేవెగౌడ నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని, తాను కాదని కుమారస్వామి ఎమ్మెల్యేలతో చెప్పినట్లు సమాచారం.
సిద్ధూను టార్గెట్ చేయాలని….
మరోవైపు సిద్ధరామయ్యను టార్గెట్ చేయాలని కూడా ఎమ్మెల్యేలు ఎక్కువ మంది అభిప్రాపడుతున్నారు. ఆయనకు తెలిసే ఇదంతా జరిగిందని, సిద్ధరామయ్య ఆదేశాల మేరకే తాము మద్దతు ఉపసంహరించుకున్నామని ముంబయికి వెళ్లిన రెబల్ ఎమ్మెల్యేల శివరాం హెబ్బర్ చెప్పడాన్ని కూడా కొందరు గుర్తు చేస్తున్నారు. తాను ముఖ్యమంత్రిని కావాలనే సిద్ధరామయ్య ప్రభుత్వాన్ని కూలదోయడానికి స్కెచ్ వేశారని, అయితే దానిని బీజేపీ తెలివిగా తనవైపునకు తిప్పుకుందని జేడీఎస్ నేతల అనుమానం. మొత్తం మీద కర్ణాటకలో సంక్షోభానికి ఇంకా తెరపడలేదనే చెప్పాలి.