2024 తర్వాత ఏపీకి గుడ్ డేస్ అట
వచ్చే సార్వత్రిక ఎన్నికలు ఆంధ్రప్రదేశ్ కు కొంత మేలు చేకూర్చనున్నాయి. 2024 లో జరిగే ఎన్నికల్లో ఏపీలో ఎవరు గెలిచినా కొంత రాష్ట్రానికి ప్రయోజనం చేకూరే అవకాశముంది. [more]
వచ్చే సార్వత్రిక ఎన్నికలు ఆంధ్రప్రదేశ్ కు కొంత మేలు చేకూర్చనున్నాయి. 2024 లో జరిగే ఎన్నికల్లో ఏపీలో ఎవరు గెలిచినా కొంత రాష్ట్రానికి ప్రయోజనం చేకూరే అవకాశముంది. [more]
వచ్చే సార్వత్రిక ఎన్నికలు ఆంధ్రప్రదేశ్ కు కొంత మేలు చేకూర్చనున్నాయి. 2024 లో జరిగే ఎన్నికల్లో ఏపీలో ఎవరు గెలిచినా కొంత రాష్ట్రానికి ప్రయోజనం చేకూరే అవకాశముంది. కేంద్ర ప్రభుత్వం నుంచి పూర్తి స్థాయిలో సహాయ సహకాలు అందుతాయని అంచనాలు ఉన్నాయి. మరో మూడేళ్లు ఓపిక పడితే విభజన చట్టంలో ఉన్న హామీలన్నీ అమలు జరిగే అవాకశముంది. ప్రత్యేక హోదా విషయంలోనూ సానుకూలత వస్తుందంటున్నారు.
లోక్ సభ ఎన్నికల్లో…..
ఆంధ్రప్రదేశ్ శాసనసభతో పాటు లోక్ సభ ఎన్నికలు కూడా 2024లో జరగనున్నాయి. ఈ ఎన్నికలలో ఏపీలో వైఎస్ జగన్ మళ్లీ గెలవవచ్చు. లేకుంటే చంద్రబాబు అధికారంలోకి రావచ్చు. ఇది అప్రస్తుతం. అయితే కేంద్రంలో మాత్రం కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశముంది. కేంద్రంలో బలమైన ప్రభుత్వం వచ్చే అవకాశం లేదంటున్నారు. సుస్థిర ప్రభుత్వం ఏర్పడే సూచనలు లేవని చెబుతున్నారు. పూర్తి స్థాయి మెజారిటీ అవకాశం లేదు.
మోదీ పై వ్యతిరేకత….
నరేంద్ర మోదీపై దేశ వ్యాప్తంగా వ్యతిరేకత మొదలయింది. మరో మూడేళ్లలో అది మరింత పెరిగే అవకాశముంది తప్పించి తగ్గే సూచనలు లేవు. దీంతో బీజేపీకి 2024 ఎన్నికలు అగ్నిపరీక్ష. మిత్ర పక్షాలు సయితం బీజేపీని వదలి వెళ్లిపోయాయి. దీంతో ఒంటరిగా గత ఎన్నికల్లో వచ్చినట్లు 300 స్థానాలకు పైగా వచ్చే ఛాన్స్ లేదు. దీంతో బీజేపీ ఇతర ప్రాంతీయ పార్టీలపై ఆధారపడాలి. అప్పుడు ఆంధ్రప్రదేశ్ కీలకంగా మారనుంది.
బీజేపీయేతర ప్రభుత్వం ఏర్పడినా?
ఒకవేళ బీజేపీ అధికారంలోకి రాలేకపోయినా, కాంగ్రెస్ తో కలసి ప్రాంతీయ పార్టీలు కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేేసే అవకాశముంది. అప్పడు కూడా ఆంధ్రప్రదేశ్ ప్రధాన పాత్ర పోషించనుంది. గత ఏడేళ్లుగా విభజన హామీలు అమలు పర్చకుండా ఏపీకి కేంద్ర ప్రభుత్వం అన్యాయం చేస్తుంది. అయితే వచ్చే ఎన్నికలలో కేంద్ర ప్రభుత్వం ఏపీ పై ఆధారపడే అవకాశాలు స్పష్టంగా కన్పిస్తున్నాయి. అందుకే ఏపీకి 2024 తర్వాత మంచిరోజులేనన్నది విశ్లేషకుల అంచనా.