టీడీపీలో ఆ నలుగురు.. నమ్మకమైన నేతలే?
ఏపీ ప్రధాన ప్రతిపక్షం టీడీపీకి ఇప్పుడు చంద్రబాబుతో కలిపి 21 మంది ఎమ్మెల్యేలు మిగిలారు. అయితే,వీరిలో కొందరు మౌనంగా ఉంటే..మరికొందరు తమ వ్యాపారాలు, తమ పనులు తాము [more]
ఏపీ ప్రధాన ప్రతిపక్షం టీడీపీకి ఇప్పుడు చంద్రబాబుతో కలిపి 21 మంది ఎమ్మెల్యేలు మిగిలారు. అయితే,వీరిలో కొందరు మౌనంగా ఉంటే..మరికొందరు తమ వ్యాపారాలు, తమ పనులు తాము [more]
ఏపీ ప్రధాన ప్రతిపక్షం టీడీపీకి ఇప్పుడు చంద్రబాబుతో కలిపి 21 మంది ఎమ్మెల్యేలు మిగిలారు. అయితే,వీరిలో కొందరు మౌనంగా ఉంటే..మరికొందరు తమ వ్యాపారాలు, తమ పనులు తాము చక్కబెట్టుకుంటున్నారు. ఈ క్రమంలో ఇంకొందరు ప్రభుత్వం తమపై కేసులు ఎక్కడ పెడుతుందో ? ఎక్కడ బెదిరింపులకు పాల్పడుతుందోననే బెరుకుతో మౌనంగా ఉంటున్నారు. మరికొందరు కేవలం తాము గెలిచింది జగన్ ప్రభుత్వంపై విరుచుకుపడడం కోసమే అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే రోజుకో ధర్నా.. నిరసనతో జగన్ ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నారు. మరో ఇద్దరు ఎమ్మెల్యేలు టీడీపీ తరఫున గెలిచినా పార్టీకి దూరంగా ఉంటున్నారు. ఇక ఇప్పటికే గన్నవరం ఎమ్మెల్యే వంశీ, గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మద్దాలి గిరి పార్టీకి దూరమయ్యారు.
నలుగురు మాత్రం….
ఇలా టీడీపీలో తలోరకంగా ఉన్నప్పటికీ ఓ నలుగురు మాత్రం తమ పనుల్లో ఎక్కడా తేడా రాకుండా చూసుకుంటున్నారు. ఎక్కడ ఎలా వ్యవహరించాలో.. ఎక్కడ ఎవరితో.. ఎలా మాట్లాడాలో.. ప్రజలకు, నియోజకవర్గానికి ఎప్పుడు ఎలా అందుబాటులో ఉండాలో ఉంటూ.. వారి సమస్యలను పరిష్కరించేందుకు ముందుంటున్నారు. ఈ నలుగురు ఎమ్మెల్యేలు అటు టీడీపీ వర్గాల్లోనూ ఇటు అధికార పార్టీ వర్గాల్లోనూ హైలెట్ అవుతున్నారు.
యాక్టివ్ గా ఉంటూ…..
వారిలో ఒకరు ప్రకాశం జిల్లాకు చెందిన పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు, రెండు కృష్ణాకు చెందిన విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, మూడు పశ్చిమ గోదావరికి చెందిన పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు, నాలుగు గుంటూరు జిల్లా రేపల్లెకు చెందిన అనగాని సత్యప్రసాద్. ఏ మాటకు ఆ మాటే చెప్పాలంటే.. ఈ నలుగురు కూడా ఎప్పుడు ఎక్కడ ఎలా వ్యవహరించాలో అలానే ఉంటూ అన్ని విధాలా భేష్ అనిపించుకుంటున్నారు. వీరంతా వరుస విజయాల వీరులే కావడం గమనార్హం.
నిమ్మల : నిమ్మల రామానాయుడు పాలకొల్లులో తనదైన శైలిలో పని చేసుకుంటూ వెళుతున్నారు. సమస్య ఎక్కడ ఉంటే అక్కడ వాలిపోతారు. చంద్రబాబు ఏదైనా ప్రభుత్వంపై పోరాటం కార్యక్రమానికి పిలుపునిస్తే చేయడానికి ముందుంటారు. ఇటు నియోజకవర్గంలో ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాలపై పోరాటాలు చేయడంతో పాటు అటు అసెంబ్లీలో చంద్రబాబుకు వెన్నుముకగా ఉంటూ అధికార పార్టీపై గళం వినిపిస్తున్నారు. ఇప్పటకీ ఆయన నియోజకవర్గంలో ఆయనకు ధీటైన నేత కూడా లేని పరిస్థితి.
గద్దె రామ్మోహన్: గద్దె రామ్మోహన్ అయితే నిత్యం ప్రజల కోసం కష్టపడుతూనే ఉంటారు. ప్రభుత్వ నిధులు అందకపోయినా, తమ ఎంపీ కేశినేని నాని నిధులతో నియోజకవర్గంలో పని చేసుకుంటున్నారు. అలాగే అమరావతి ఉద్యమంలో యాక్టివ్గా పాల్గొంటున్నారు. ఇక అటు వైసీపీలో ఇప్పటికే ఇద్దరు లీడర్లు మారి కొత్తగా దేవినేని అవినాష్ వచ్చారు. అటు ఎమ్మెల్యేగా తన నిధులతో కొన్ని పనులు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇక ఎంపీ నిధులు కూడా క్కడే ఎక్కువుగా ఇస్తుండడంతో కూడా ఆయనకు కలిసి రానుంది.
ఏలూరి సాంబశివరావు: ఏలూరి పర్చూరులో దూసుకెళుతున్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ ప్రజలకు ఎలాంటి లోటు లేకుండా చూసుకుంటున్నారు. అవసరమైతే సొంత డబ్బులతో పనులు చేయడానికి కూడా వెనుకాడటం లేదు. నియోజకవర్గంలో రైతులకు సాయం చేస్తున్నారు. ఇక ఇటీవలే జాతీయ ఆదర్శ యువ ఎమ్మెల్యే అవార్డుని అందుకున్నారు. ఏలూరు దూకుడుతో చివరకు వైసీపీ రాష్ట్ర నాయకత్వం సైతం ఆయనకు ఎలా బ్రేకులు వేయాలో తెలియక సతమతమవుతోంది.
అనగాని: గుంటూరు జిల్లా రేపల్లె అనగాని సత్యప్రసాద్ కూడా ప్రజలకు చేరువగా ఉంటున్నారు. ఒకపక్క రాజధాని ఆందోళనలకు ప్రాధాన్యం ఇస్తూనే నిత్యం నియోజకవర్గంలో కనిపిస్తున్నారు. చంద్రబాబు ఇచ్చిన పిలుపు మేరకు ఆందోళనలు చేస్తూనే.. ప్రజలకు అందుబాటులో ఉంటున్నారు. ఇలా ఈ నలుగురు డిఫరెంట్ గురూ అనేలా వ్యవహరిస్తున్నారు.