వైసీపీకి నాలుగు ఎమ్మెల్సీ సీట్లు.. పోటీలో చాలా మందే…!
అధికార పార్టీ వైసీపీలో మళ్లీ ఎమ్మెల్సీ ఎన్నికల కోలాహలం ప్రారంభమైంది. మొత్తంగా 4 స్థానాలను ఈ దఫా వైసీపీ తన ఖాతాలో వేసుకోనుంది. వాస్తవానికి వీటిలో రెండు [more]
అధికార పార్టీ వైసీపీలో మళ్లీ ఎమ్మెల్సీ ఎన్నికల కోలాహలం ప్రారంభమైంది. మొత్తంగా 4 స్థానాలను ఈ దఫా వైసీపీ తన ఖాతాలో వేసుకోనుంది. వాస్తవానికి వీటిలో రెండు [more]
అధికార పార్టీ వైసీపీలో మళ్లీ ఎమ్మెల్సీ ఎన్నికల కోలాహలం ప్రారంభమైంది. మొత్తంగా 4 స్థానాలను ఈ దఫా వైసీపీ తన ఖాతాలో వేసుకోనుంది. వాస్తవానికి వీటిలో రెండు ఇప్పటికే వైసీపీ నేతల అధీనంలోనే ఉన్నాయి. కొత్తగా మరో రెండు పార్టీకి దఖలు పడ నున్నాయి. దీంతో మొత్తం నలుగురు కొత్తగా ఎమ్మెల్సీలుగా ఎన్నికయ్యేందుకు అవకాశం ఏర్పడింది. ఇటీవలే.. ఒక్క ఎమ్మెల్సీ స్థానాన్ని కొత్తగా వైసీపీ దక్కించుకున్న విషయం తెలిసిందే. టీడీపీ నుంచి ఎమ్మెల్సీగా ఉన్న డొక్కా మాణిక్య వరప్రసాద్ తర్వాత రాజధానుల గొడవ నేపథ్యంలో టీడీపీ నుంచి బయటకు వచ్చి ఎమ్మెల్సీ పదవికి రిజైన్ చేసిన విషయం తెలిసిందే. అనంతరం .. వైసీపీ ఆయనకు అదే సీటును కేటాయించింది. దీంతో ఒక సీటు వైసీపీకి అదనంగా దక్కినట్టయింది.
ఈ రెండు ఖాళీలు…
ఇక, ఇప్పటికే వైసీపీలో ఉన్న ఇద్దరు ఎమ్మెల్సీలు మంత్రులుగా ఉన్న విషయం తెలిసిందే. వీరిని రాజ్యసభకు పంపుతున్నారు. మోపిదేవి వెంకట రమణ, పిల్లి సుభాష్ చంద్రబోస్ ఎంపీలు అవుతుండడంతో తాజాగా అధిష్టానం.. వారిని తమ ఎమ్మెల్సీ పదవులకు, మంత్రి పదవులకు కూడా రాజీనామా చేయాలని ఆదేశించింది. దీంతో వారు తమ పదవులకు రాజీనామా చేయనున్నారు. ఫలితంగా రెండు స్థానాల్లోనూ కొత్తవారికి అవకాశం ఇవ్వాల్సి ఉంటుంది. మరోపక్క, గవర్నర్ కోటాలో గతంలో ఎమ్మెల్సీలుగా పదవులు దక్కించుకున్న తాటిపర్తి రత్నాబాయి, కంతేటి సత్యనారాయణల పదవీ కాలం గత నెలలోనే ముగిసింది.
ఏదైనా జరగొచ్చు….
అయితే, అప్పటి నుంచి ఇప్పటి వరకు దీనికి నోటిఫికేషన్ విడుదల చేయలేదు. ఈ నేపథ్యంలో ఈ రెండు పదవులకు కూడా వైసీపీ నుంచే ఎంపిక చేయనున్నారు. అంటే.. మొత్తంగా నాలుగు ఎమ్మెల్సీ స్థానాలకు వచ్చేవారంలో నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉంది. వాస్తవానికి మండలి రద్దును ప్రతిపాదిస్తూ.. ప్రభుత్వం ఒక బిల్లును పాస్ చేసి.. పార్లమెంటుకు పంపినా.. ఇప్పటి వరకు ఆమోదం పొందలేదు. ఎప్పుడు ఆమోదం పొందుతుందో కూడా తెలియదు. ఏడాది పట్టొచ్చు.. లేదా రెండేళ్లయినా పట్టొచ్చు. లేదా అసలు రద్దు కాకనూ పోవచ్చు.
ఎవరిని వరిస్తాయో?
ఈ నేపథ్యంలో మండలిలో ఖాళీ అయిన నాలుగు స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసే యోచనలో జగన్ ఉన్నారు. దీనిపై సోమవారం ఒక నిర్ణయం తీసుకుంటారని, గతంలో తాను హామీ ఇచ్చిన నాయకులు, ప్రస్తుతం ఎమ్మెల్సీలుగా కోరుతున్న వారి జాబితాను సిద్ధం చేయాలని పార్టీ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డికి చెప్పినట్టు వైసీపీ వర్గాల నుంచి అప్పుడే వార్తలు గుప్పుమన్నాయి. దీంతో ఆశావహులు అందరూ సాయిరెడ్డికి ఫోన్లపై ఫోన్లు చేస్తున్నారు. మరి ఎవరిని ఈ పదవులు వరిస్తాయో చూడాలి.