గల్లా సరైన సమయంలో హ్యాండ్ ఇచ్చారా?
గుంటూరు ఎంపీ, సూపర్ స్టార్ కృష్ణ అల్లుడు గల్లా జయదేవ్ ఇప్పుడు నియోజకవర్గంలో చూద్దామన్నా కని పించడం లేదట. పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా జయదేవ్ ఇక్కడ [more]
గుంటూరు ఎంపీ, సూపర్ స్టార్ కృష్ణ అల్లుడు గల్లా జయదేవ్ ఇప్పుడు నియోజకవర్గంలో చూద్దామన్నా కని పించడం లేదట. పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా జయదేవ్ ఇక్కడ [more]
గుంటూరు ఎంపీ, సూపర్ స్టార్ కృష్ణ అల్లుడు గల్లా జయదేవ్ ఇప్పుడు నియోజకవర్గంలో చూద్దామన్నా కని పించడం లేదట. పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా జయదేవ్ ఇక్కడ విజిటింగ్ ఎంపీగా ఎప్పుడైనా గుంటూరులో హాజరు వేయించుకోవడమే తప్ప చేసిందేమి లేదు. ఇక గతేడాది ఎన్నికల్లో చావుతప్పి కన్నులొట్టబోయిన చందంగా వరుసగా రెండోసారి ఎంపీగా గెలిచిన ఆయన రాజధాని మార్పు ప్రకటన తర్వాత కాస్త యాక్టివ్ అయ్యి అందరికి షాక్ ఇచ్చారు. అసలు గల్లా జయదేవే ఇంత పోరాటం చేస్తున్నారా ? అని సొంత పార్టీ నేతలే ఆశ్చర్యపోయారు. రాజధాని అమరావతి ఆందోళనలకు తనదైన శైలిలో మద్దతిచ్చారు. అసెంబ్లీ ముట్టడికి సహకరించిన నేరంపై ఆయనను జైల్లో కూడా పెట్టారు. ఇక, రాత్రి వేళ మారు వేషంలో తప్పించుకుని మరీ రాజధాని ఉద్యమానికి బాసటగా మారారు. నేను విన్నాను.. ఉన్నాను.. అనే డైలాగును తనకు అన్వయించుకుని రాజధాని ప్రాంత రైతుల సమస్యలపై పోరాటం చేశారు.
విరాళాలు ఇచ్చి…..
అలాంటి నాయకుడు.. ఇప్పుడు కీలక సమయంలో ప్రజలకు అందుబాటులో లేకుండా పోవడం గమనార్హం. ఓ వైపు కరోనా నేపథ్యంలో ఏ నియోజకవర్గంలో ప్రజాప్రతనిధులు ఆ నియోజకవర్గంలో హడావిడి చేస్తున్నారు. ప్రజలకు నిత్యావసరాలు పంచుతూ వార్తల్లో ఉంటున్నారు. ఇక గల్లా జయదేవ్ అస్సలు ప్రజలు వైపే చూడడం లేదు. రాష్ట్రంలో లాక్డౌన్ నేపథ్యంలో ప్రజలు ఇబ్బంది పడుతున్నా.. నియోజకవర్గంలో ప్రజలు పనులు లేక.. తిప్పలు పడుతుంటే.. వారిని ఆదుకునేందుకు మాత్రం ఆయన ముందుకు రావడం లేదనే విమర్శలు జోరందుకున్నాయి. అయితే, ఆయన తన వ్యాపార సంస్థ అమరరాజా తరఫున రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలకు మాత్రం విరాళాలు అందించారు.
ప్రజలకు దూరంగా….
నిజానికి ఎన్ని విరాళాలు అందించినా.. ప్రజల మధ్య ఉంటూ.. వారికి సాయం చేస్తే.. ఇదే ప్రజల్లో నిలుస్తుంది. అదే సమయంలో ప్రజలకు ధైర్యం చెప్పడంలోనూ ఆయన తన మార్కు సాధించే వారు.కానీ, ఇవేవీ పట్టనట్టుగా ఆయన నియోజకవర్గంలో ఉన్నా ప్రజల వద్దకు రావడం లేదు. టీడీపీకి చెందిన మరో ఎంపీ కేశినేని నాని, కింజరాపు రామ్మోహన్ వంటివారు వారి వారి నియోజకవర్గాల్లో దూకుడుగానే ఉన్నారు. పేదలకు ఏదో ఒక రూపంలో సాయం చేస్తున్నారు. కానీ, గల్లా జయదేవ్ మాత్రం సీఎం, ప్రధానులకు విరాళాలు ఇచ్చి.. ఇక ఇంతే.. దీంతో సర్దుకోండి! అన్నట్టుగా వ్యవహరించడంపై మాత్రం తీవ్ర విమర్శలు వస్తున్నాయి.
నియోజకవర్గంలో పర్యటించకుండా….
కేశినేని నాని విజయవాడలోనే ఉంటూ తన కుమార్తె శ్వేతతో కలిసి పేదలకు నిత్యావసరాలు, మాస్క్‌లు పంపిణీ చేయడమో లేదా ? విలేకర్లకు ఏదో ఒక సాయం చేయడంలోనో లేదా నగరంలో పర్యటిస్తూనో వార్తల్లో నిలుస్తున్నారు. అటు రామ్మోహన్ నాయుడు కూడా చారిటబుల్ ట్రస్ట్ ద్వారా పేదలకు ఏదో ఒక సాయం చేస్తున్నారు. ఇటు గల్లా జయదేవ్ మాత్రం గుంటూరులో సాయం చేయడం లేదు. మరో ట్విస్ట్ ఏంటంటే జయదేవ్ ఒకవేళ తన లోక్‌సభ నియోజకవర్గ పరిధిలో పర్యటించినా ఆయన వెంట వచ్చే ఎమ్మెల్యేనో లేదా నియోజకవర్గాల ఇన్‌చార్జ్‌లు కూడా లేని పరిస్థితి.
గల్లా వెంట నడిచేందుకు….
గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యే గిరి ఇప్పటికే వైసీపీకి దగ్గరయ్యారు. పొన్నూరులో నరేంద్ర, మంగళగిరిలో లోకేష్ జయదేవ్‌ను పట్టించుకోరు. ప్రత్తిపాడులో డొక్కా పార్టీ మారిపోవడంతో అక్కడ టీడీపీ అనాథ అయ్యింది. ఇక మహా అయితే తెనాలి, తాడికొండ లాంటి చోట్ల మాత్రమే జయదేవ్ వెంట నడిచేందుకు మాజీ ఎమ్మెల్యేలు రెడీగా ఉన్నారేమో ? అనుకోవాలి.