డబుల్ బెడ్ రూం ఇళ్ల పేరిట టోకరా
పేదల ప్రయోజనం కోసం ప్రభుత్వం చేపడుతున్న డబుల్ బెడ్ రూమ్ ఇండ్లపై డేగలు కన్నేశాయి. ఇప్పటికే ప్రతి పక్షాలు దీనిపై రాద్ధాంతం చేస్తూ ఉంటే.. డబుల్ బెడ్ [more]
పేదల ప్రయోజనం కోసం ప్రభుత్వం చేపడుతున్న డబుల్ బెడ్ రూమ్ ఇండ్లపై డేగలు కన్నేశాయి. ఇప్పటికే ప్రతి పక్షాలు దీనిపై రాద్ధాంతం చేస్తూ ఉంటే.. డబుల్ బెడ్ [more]
పేదల ప్రయోజనం కోసం ప్రభుత్వం చేపడుతున్న డబుల్ బెడ్ రూమ్ ఇండ్లపై డేగలు కన్నేశాయి. ఇప్పటికే ప్రతి పక్షాలు దీనిపై రాద్ధాంతం చేస్తూ ఉంటే.. డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇప్పిస్తామంటూ జనాలకు మస్కా కొట్టి టోపీ పెట్టే ముఠాలు సిటీలో రెడీ అయ్యాయి. ఏకంగా ప్రభుత్వం ఇచ్చిన అప్రూవల్ లెటర్ అంటూ కోట్లు దండుకున్నాయి. అలాంటి ముఠా ఆటకట్టించారు సైబరాబాద్ పోలీసులు. అలాగే ఉద్యోగాల పేరుతో నిరుద్యోగులనుండి డబ్బు దండుకున్న రెండు ముఠాలకు చెక్ పెట్టారు. మరో ప్రొఫెషనల్ దొంగ ఆట కట్టించారు సైబరాబాద్ పోలీసులు.
పంపిణీకి సిద్ధం అవ్వడంతో….
తెలంగాణలో పేద ప్రజలకు సొంతింటి కల నిజం చేసేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు పంపిణీకి సిద్ధమైనాయి. ఈ ఇండ్ల నిర్మాణం విషయంలో నాణ్యత లేదని, బినామీలకే కట్టబెట్టే ప్రయత్నాలు సాగుతున్నాయంటూ ప్రతిపక్షాలు రాద్ధాంతం చేస్తున్నాయి. దీనితోనే ప్రభుత్వం సతమతమవుతున్న సమయంలో మరో కొత్త సమస్య వచ్చింది. కాదేదీ మోసానికి కనర్హం లా డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు అంటూ ముఠాలు మార్కెట్లో అమ్మకాలు సిద్ధం చేశాయి. ఏకంగా అప్రూవల్ లెటర్లు చూపిస్తూ అందనంత దోచుకున్నాయి.
అప్రూవల్ లెటర్లను…
అలాంటి ఓ ముఠాను సైబరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. ఇటీవల కొందరు బాధితులు సైబరాబాద్ సీపీ సజ్జనార్ ని కలిశారు. తమను డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పేరుతో మోసం చేశారని ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు అందుకున్న సీపీ ఓ స్పెషల్ టీమ్ ఏర్పాటు చేశారు. పద్మ, వెంకటేశ్వర రాజు, సత్య కృష్ణ వర ప్రసాద్ అనే ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ముగ్గురు ఒక్కొక్కరి దగ్గర నుండి 20వేల నుండి లక్షా 70 వేల వరకు మోసం చేశారు. 89 మంది దగ్గర నుండి కోటి 3 లక్షలు వసూలు చేశారు. అయితే ఇక్కడే ఒక ట్విస్ట్ ఉంది. ముగ్గురిలో ఇద్దరు నిందితులు గతంలో ఇదే తరహాలో ఇంటి కోసం ఓ ముఠా చేతిలో మోసపోయారు. డబ్బుల కోసం వీరు ఇదే బిజినెస్ ఎంచుకున్నారు.