ఇద్దరు శ్రీనులూ సీన్ మార్చేస్తారా…?
విశాఖ జిల్లా రాజకీయాల్లో శ్రీనులు ఎక్కువ. ఒకప్పుడు తెలుగుదేశం పార్టీలోనే శ్రీనులంతా సర్దుకున్నారు. వైసీపీలోని అవంతి శ్రీనివాసరావు జంప్ చేసి మంత్రి అయ్యాక అటూ ఇటూ పొలిటికల్ [more]
విశాఖ జిల్లా రాజకీయాల్లో శ్రీనులు ఎక్కువ. ఒకప్పుడు తెలుగుదేశం పార్టీలోనే శ్రీనులంతా సర్దుకున్నారు. వైసీపీలోని అవంతి శ్రీనివాసరావు జంప్ చేసి మంత్రి అయ్యాక అటూ ఇటూ పొలిటికల్ [more]
విశాఖ జిల్లా రాజకీయాల్లో శ్రీనులు ఎక్కువ. ఒకప్పుడు తెలుగుదేశం పార్టీలోనే శ్రీనులంతా సర్దుకున్నారు. వైసీపీలోని అవంతి శ్రీనివాసరావు జంప్ చేసి మంత్రి అయ్యాక అటూ ఇటూ పొలిటికల్ సీన్ కూడా మారింది. ఇక టీడీపీ వైపు నుంచి మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు ఉంటే వైసీపీ నుంచి అవంతి శ్రీనివాసరావు ఉంటూ ఇప్పటిదాకా రాజకీయ రచ్చ చేస్తూ వచ్చారు. అటు నుంచి ఒకటి అంటే ఇటు నుంచి మరోటి అన్నట్లుగా విశాఖ పాలిటిక్స్ ని హీటెక్కించారు.
బ్రేకేసిన చోటే….?
ఒక దశలో గంటా శ్రీనివాసరావు వైసీపీలోకి వస్తారని ప్రచారం గట్టిగా జరిగింది. కానీ ఆయన రాకను మాజీ సన్నిహితుడు అవంతి శ్రీనివాసరావే బాహాటంగా వ్యతిరేకించారు. గంటాకు అధికార దాహమని, ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకి మద్దతు ఇస్తారని కూడా విమర్శించారు. జగన్ కి గంటాను తీసుకోవాలని ఉన్నా కూడా అవంతి వ్యతిరేకతను చూసి వెనక్కి తగ్గారని చెబుతారు. ఇపుడు అటువంటి గంటా అవంతి చెట్టాపట్టాలు వేయడం అందరికీ ఆశ్చర్యం కలిగించింది. విశాఖ స్టీల్ ప్లాంట్ ని ప్రైవేటీకరించవద్దు అంటూ సాగిన పోరాటంలో ఇద్దరు నేతలు కలసి ఒకే వేదిక మీద పాలు పంచుకొవడం మాత్రం అందరి దృష్టిని ఆకట్టుకుంది.
దోస్తీ కడతారా…?
రాజకీయాల్లో ఎపుడు ఏది జరుగుతుంది అన్నది చెప్పలేం. గంటా శ్రీనివాస్ అయిన చతురత తెలిసిన రాజకీయ నేత. ఆయన తన దారిని సుగమం చేసుకునేదుకు ఎంతదాకా అయినా వెళ్తారు అన్న మాట ఉంది. అదే సమయంలో ఆయన తన ఒకప్పటి సన్నిహితుడు అవంతి తో కలసి పనిచేయడానికి కూడా రెడీ అవుతారు అంటున్నారు. అవంతి కనుక ఎస్ అని చెబితే ఆ మరుక్షణం వైసీపీలోకి గంటా రాక చాలా ఈజీగా జరిగిపోతుంది అంటున్నారు. ఇక గంటా విషయానికి వస్తే టీడీపీ ద్వారా వచ్చిన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మరీ జగన్ చెప్పినట్లుగానే నడచుకున్నారని అంటున్నారు.
అక్కడే కష్టం…?
ఒక ఒరలో రెండు కత్తులు ఇమడవు అంటారు. ఇద్దరు శ్రీనులూ ఒకే పార్టీలో ఉండడమూ కష్టమే. గంటా శ్రీనివాస్ కనుక వైసీపీలోకి వస్తే కచ్చితంగా తనకు ఇబ్బంది అని అవంతికి స్పష్టంగా తెలుసు. అందుకే ఆయన ఎంత పాత స్నేహితుడు అయినా ఖరాఖండీగానే ఉంటున్నారు. కానీ విశాఖ ఉక్కు ఉద్యమం ఇపుడు ఇద్దరినీ కలుపుతోంది. ఈ సాన్నిహిత్యాన్ని ఏ విధంగా అయినా ట్విస్ట్ చేయగల సామర్ధ్యం గంటా శ్రీనివాస్ కు ఉంది. మరి దాన్ని అడ్డుకోవడానికి అవంతి వద్ద ఉన్న అస్త్రాలు ఏంటి అన్నదే చూడాలి.